ప్రతి క్షణం
ప్రతి క్షణం ఈ లోకాన్ని
ఎవరోవకరు వదిలిపెట్టెస్తున్నారు…
ప్రతిక్షణము ఎవరో ఒకరు రూపు మార్చుకుంటున్నారు..
వయస్సు తో సంబంధంలేదు
బంధాలు ఆపలేవు…
మనమూ ఈ వరసలో
నిలబడే ఉన్నాము
ఎంత దూరమో… ఎంత దగ్గరో…
మన ముందు ఎందరో… మనకు తెలీదు.
ఈ వరసలో నిలబడిన చోటనుంచి
బయటకు పోలేము,
వెనకకు మరలలేము…
ముందుకే సాగాలి…
తప్పించుకోలే “వరుసక్రమ”మిది
ఇది సత్యం…
ఇదే సత్యం…
మరి తప్పని ఈ సత్యాన్ని
జీర్ణీంచుకోవటానికి సందేహమెందుకు?
వరుసలో ఎదురుచూస్తూ
ఏం చెద్దామనుకుంటున్నావు?
ఆటలాడవచ్చు…
అందరితో స్నేహమూ పెంచుకోవచ్చు…
నీ బంధువులకు జ్ఞాపకాలు మిగల్చవచ్చు
నీ బలాన్నీ లెక్కపెట్టవచ్చు…
నీ మనస్సులోని చెడును తొలగించుకోవచ్చు…
నలుగురికీ ఉపయోగపడవచ్చు…
సద్గంధాలు చదవవచ్చు..
జ్ఞానాన్ని పెంచుకోవచ్చు
అజ్ఞాన్నాని త్రుంచుకోవచ్చు…
శాంతిని, ప్రేమను పంచవచ్చు…
మొక్కను పెంచవచ్చు
కుక్కకు ఆహారమందించవచ్చు…
వరుసలో ఎదురుచూస్తూ…
క్షణాలను బ్రహ్మానందంలో ముంచి సర్వులకూ అందించవచ్చు…
సమయం సెలవు పెట్టదు పనికి…
కాలం సాగుతూ ఉంటుంది…
నీ కాలమొచ్చే వరకూ
కాల స్వరూపాన్ని కనిపెట్టవచ్చు
సాపేక్షితమైన కాలాన్ని
సద్గురువు సేవతో నింపవచ్చు
నీ స్వస్వరూపంలో గడపవచ్చు…
నీవు వరుసలోనే ఉన్నావు..
ప్రతి క్షణం జ్ఞానిలా చూడు…