ప్రణవమందు వర్ధి ల్లు ప్రణవ రూప జననీ పలుకు సంకల్ప రూపముగ నుండు బిందురూపా ‘పరా’ వాక్కువు – చలించిన భావముల రూపము ‘పశ్యంతి’ వాక్కువైతివి. భావములైన వాక్కులు రూపము గాంచిన ‘మధ్యమా’!! వ్యక్తమైతివి ‘వైఖరి’ వాక్కుగా వాగ్దేవి – జీవుల నాల్కలందు వెలసితివి వాణిగా ఆ ప్రణవమే రూపమై నిలచిన భగవతి’ సుషుమ్నలో తిరుగాడు అగ్నితత్త్వ అంతర్వాహిని ప్రసరిస్తూ ప్రవహిస్తున్న జ్ఞానమయి నన్ను , ఈ అజ్ఞాన తిమిరం నుంచి ప్రచండ చైతన్య సుజ్ఞానానందమైన బ్రహ్మమునకు…
Category: కవిత్వం
పద్యాలు- చెణుకులు – చాటువులు.
తెలుగు భాషలో పద్యం ఒక విశిష్టమైన విశేషమైన ప్రక్రియ. పద్యం తో భాషకు ఎన్నైనా సొగసులద్దవచ్చు. ఎంత వచన కవిత్వం అలల మాదిరి సాగిపోయినా, పద్యం తెలుగు భాషకి ఉన్న అత్యుత్తమమైన ఆభరణాలలో ఒకటి! చెణుకుల పద్యాలూ, చాటువులు, తిరకాస్తు పద్యాలూ, పొడుపుకథ పద్యాలూ తెలుగులో విరివిరిగా ఉన్నా, పద్యాలను చదవటం అందరూ ఇష్టపడరు. అంతెందుకు తెలుగునాట మారుమోగి పోయిన కృష్ణ రాయబార పద్యాలు నేడు ఎక్కడా కనిపించవు, వినిపించవు. పద్యం తెలిసిన వారు క్రిందటి తరానికి పరిమితమౌతున్నారు అనిపిస్తున్నది…
పలుకుల తల్లి
పలుకు పలుకుల తల్లి పలుకు బంగారు తల్లి పలుకుల పరా తల్లి పలుకు ధాతువు వా తల్లి పలుకు మూలమైన తల్లి పలుకుల పగడపు తల్లి పలుకు పశ్యతి అనాహతమున మా తల్లి పలుకుపూబోణి పలుకు జిలుకుల వైఖరి తల్లి పలుకుటెలనాగ మా తల్లి పలుకుగా మారు మా తల్లి పలుకవదేమి ఓ తల్లి!! తలచి పిలచితి తల్లి!! నా ఆత్మనీవే తల్లి!! పలుకులాడించ దీవించె మా తల్లి!! సంధ్యా యల్లాప్రగడ
దీపావళి
నిన్నటి వరకూ నాకు నేను తెలియదు నేడు నాకు నేనె కాదు ఎవ్వరూ తెలుయదు తెలిసినది ఒక్కటీ లేదు తెలుసుకొవాల్సినదెమిటో కూడా తెలియదు అనంత అజ్ఞానము అలమరింది చుట్టూ వెలుతురు నిలిచేది క్షణమే చీకటే కదా నిలిచేది సదా మనకున్న కన్ను మూసినా తెరచినా… చికటిని తెలుకున్న, వెలుతురు కనిపించునుట …. అహమన్నది మానవ దృష్టి కన్ను మూసి చూచిన తెలియును అసలు సత్యం అంతః కరణములు అంతఃమఖమున చూచిన చీకటిలో వెలుగురేఖలు విచ్చుకొను వాటికై అన్వేషణ అనంతమైన…
అనామిక
నీ గాఢ నిద్రలో- నా పలవరింతలకు విచ్చిన … నీ పెదాల చిరునగవుల వెలుగులతో, . నా హృదయము మెరిసినది ఈ పూట! గాఢంచు నిద్రల అంచులలో నీ కలలకు రాణిగా, నీ జీవిత ప్రేయసిగా మురిసిన నా చిరు యవ్వన వెలుగుల తారాజువ్వలు ఎగిరిపోయాయి…. నేడు కలయిక మృగ్యమై మౌనముగా…. మృత్యువు ఛాయలకు గమనము సుగమనమై సాగుతూ…. నీకు ప్రేమైక్యజీవన కలవరింతలు వివరిస్తున్నాను. స్నేహానికి, ప్రేమకు హద్దులు చెరపి గాఢంచు మమకారపు వలపులు తొడిగిన మన బందానికి…