విశ్వనాథ

నా ఎదురుగా కుర్చీలో కూర్చొని అగుపించారు. ఆయన చేతిలో చేతి కర్ర. భుజము మీద అంగవస్త్రము. మూఖాన అగ్నిహోత్రములా నుదుటిన ఎర్రని కుంకుమ బొట్టు. కళ్ళజోడు. శిఖ తో , నీరుకావి కాటను లాల్చీ, పంచా కట్టుకొని కాలు ఒకటి కాస్త ముందుకు చాచి పెట్టుకు కూర్చున్నారు.  ఆశ్చర్యంగా అనిపించింది.  నేను ఆయన భక్తులలో లేను. కాని నాకు కనపడ్డారేమిటి?? సరే కనపడ్డారుగా… పెద్దవారు. పైపెచ్చు బాగా పేరున్నవారు. వాగ్దేవిని అలవోకగా అవుపోశన పట్టినవారు.  నాకు సహజముగా…

యోగులు- భూమిపై పరమాత్మ స్వరూపములు: ఆనందమయి మా: తపఃసంపన్నులైన యోగులు, సిద్ధ యోగులు, పరమాత్మ ప్రతినిధులు. వారు ఏ శరీరమునాశ్రయించిన పరిపూర్ణ పరమాత్మ ను ఆవిష్కరించారు.భారతావనిలో నడయాడిన ఎందరో మహానుభావులు ఆ నేలను, గాలిని పవిత్రం చేసి, భక్తులను కరుణించి మోక్షమిచ్చారు. నేటికీ ఇస్తున్నారు. ************************ “ఈ అశాశ్వతమైన శరీరమే నిజము కాదు. అనంతమైన చైతన్యము వున్నది. ఈ చిన్ని శరీరములోకి జీవిగా రాక పూర్వమూ చైతన్యం వున్నది, బాల్యదశలో వుండగా వుంది, పరిపూర్ణ స్త్రీతత్వము సంతరించుకున్న…

హల్వా

హిట్టా…ఫట్టా… నవరాత్రులు ముగిసిన ఇన్ని రోజులకు నా నవరాత్రులలో విశేషాలు పంచుకోవాలని అనిపించింది.  నా యోగా క్యాంపు మూలముగా నేను నవరాత్రులలో ఆరాధన షష్ఠి, సప్తమి వరకూ మొదలెట్టలేకపోయా. అందుకే రోజూ ఒక తీపి, ఒక అన్న ప్రసాదము మాత్రమే చెయ్యగలిగాను. లేదంటే రోజూ ఆ వ్రతములో చెప్పిన నైవేద్యము వండుతాను సాధారణముగా.  తీపి ఎప్పుడూ అన్నపరమాన్నమే. అదేమంటే – అమ్మవారు ‘పాయసన్నప్రియే’ కదా! అని సమర్ధన.  నిజానికి నాకు బాగా చెయ్యటము వచ్చినందు వలననో, ఎప్పుడూ…

వంట – తంటా

“ఏమండోయి!!  నాకూ వంటలు, పిండి వంటలూ గట్రా వచ్చండోయి.  ఎదో అప్పడప్పుడూ ఒకటి అరా అలా అలా చెడొచ్చు కాక.  కొద్దిగా బద్దకముతో రెండు రోజులకోకసారి వండొచ్చు గాక. అయినంత మాత్రాన వంట రాదని తీర్పు చెప్పటమేనా?  ఎదో పండుగంటే భోజనానికి ఎవ్వరూ లేరని ఆకులు అలములు అదే సలాడు తో కానివ్వవొచ్చు కాక,  కూర బదులు ఊరగాయ, లేకుంటే చట్నీ పొడో రెండు రొట్టలు వేడి చేసి ఈ భర్తరత్నానికి వడ్డించొచ్చు గాక,  ఆవ పెట్టమంటే…

నీమ్‌ కరోలీ బాబా

యోగులు- భూమిపై పరమాత్మ స్వరూపములు: నీమ్‌ కరోల్‌ బాబా: తపఃసంపన్నులైన యోగులు, సిద్ధ యోగులు, పరమాత్మ ప్రతినిధులు. భారతావనిలో నడయాడిన ఎందరో మహానుభావులు ఆ నేలను, గాలిని పవిత్రం చేసి, భక్తులను కరుణించి మోక్షమిచ్చారు. నేటికీ ఇస్తున్నారు. ************************ స్టీవ్ జాబ్స్, ‘ఆపిల్’ సంస్థ రూపును మార్చి ప్రపంచంలో అత్యధిక ప్రజల చేతులలోకి స్మార్ట్ ఫోను తెచ్చిన మేధావి. ఆధునీకరణ ఆ స్మార్ట్ ఫోన్ తోనే రూపు దిద్దుకుందన్నది సత్యం. అలాంటి స్టీవ్ జాబ్ తన లాపుటాపు…

నా కరవాచౌద్‍

నా కరవాచౌత్‌ కరువాచౌదు మాములుగా ఉత్తర భారతములో ప్రసిద్ధి. నేను చిన్నప్పుడు చూసిన హిందీ సినిమాలలో ‘ఈ కరవాచౌదుని, స్త్రీలందరూ మూకుమ్మడిగా జెల్లెడ లోంచి భర్త ను చూసి తరువాత భోం చెయ్యటము గుర్తు. హిరోయిన్ కూడా పెళ్ళి కాకుండా హీరో కోసం ఇలా చెయ్యటము, ఎవ్వరూ చూడకుండా జెల్లడలోంచి ఈ హిరోని వెత్తుకోవటము ….గట్రా లు చెయ్యటము కూడా ఎదో సినిమాలో చూడటము గుర్తు. అది చిన్నప్పుడు. మళ్ళీ మొన్నీమధ్య వరకూ ఆ వూసే లేదు….

Swamy samartha

యోగులు – పరమాత్మ ప్రతిరూపాలు  అక్కల్ కోట శ్రీ స్వామి సమర్థ : తపఃసంపన్నులైన రుషులు, సిద్ధ యోగులు, పరమాత్మ ప్రతినిధులు. భారతావనిలో నడయాడిన ఎందరో మహానుభావులు ఆ నేలను, గాలిని పవిత్రం చేసి, భక్తులను కరుణించి మోక్షమిచ్చారు. నమ్మిన వారికి నేటికీ ఇస్తున్నారు.  ఇలా నడయాడిన ఆ మహనుభావులలో కొందరు దత్తస్వామి అవతారాలుగా ప్రసిద్ధి చెందారు. వారు ఉన్నప్పుడే కాక, నేటికీ నమ్మి వచ్చిన భక్తులకు కరుణతో బ్రోచి, కష్టాలలో సేద తీర్చి, మోక్షం వైపు…