స్వర్గసీమ

స్వర్గసీమ నా చిన్నప్పుడు – అంటే 1980 ప్రాంతాలలో… మేము ఉన్న ఇల్లు నాలుగు గదులతో…ఒకే వరసలో రైలు పెట్టలని తలపిస్తూ ఉండేది. పూర్వపు వారికి ఒకే వరసలో 7 ద్వారాలు ఏర్పాటు చేసిన తరువాత మార్చాలనే ఒక నియమం ఉండేదట.అందుకే ఆ ద్వారాలు అలా వుండేవి. అవి కూడా గోడకు మధ్యలో ఉండేవి. అలాంటి ఇళ్లలోనే అంతా పెరిగారని కాదు కానీ, నా మిత్రులు చాల మంది ఇళ్ళు దాదాపు అలానే ఉండేవి. ఇది తెలంగాణ…

ఇక్కడ-అక్కడ

ఇక్కడ- అక్కడ భూదేవికి -వందనాలు: పర్యావరణముపై అవగాహన కలిగిన తరువాత, మన ముందు తరాల వారికి స్వచ్ఛమైన వాతావరణము అందించాలనే సత్సంకల్పముతో ఈ Earth-Day ను మొదలెట్టారు . ఇప్పుడు ప్రపంచమంతా ఎదో సందడి జరిపే ఈ ఏప్రెల్ మూడవ ఆదివారము నాటికి మేము వాలంటీరు చేసే వీటీ సేవ తరుపున మేము Earth-Day లో పాల్గోన్నాము. ఆ సందర్భముగా నేను వెళ్ళిన పార్కు నిజానికి పార్కు కాదు. అది ఓక జాతీయ రిక్రియేషను కేంద్రము. టూకీగా…

Home improvement projects-

మేము వచ్చిన కొత్తలో ఇంటిని ఫర్నిష్ చేసుకోవటము మొదలు పెట్టాక మొట్టమొదటి సారి ఒక వింతయిన అనుభవం కలిగింది. నన్ను శ్రీవారు షాప్ దగ్గరకు వచ్చేయమని చెప్పి ఆఫీస్ కు వెళ్ళిపోయారు. షాప్ కు నేను డైరెక్ట్ గా వెళ్ళాను. షాప్ కి వెళ్ళాక నచ్చిన ఫర్నిచర్ చూసి ఇంటికి కావలసిన అలమారా, బీరువాలు, బల్లలు బుక్ చేశాము. డెలివరీ కి కూడా పే చేసాము. ఇంటికి వచ్చేస్తాయి ఇంక సర్దుకోవటానికి ఎక్కడ ఏమి పెట్టుకోవాలి అని…

ఋతువులు- చెట్లు – పర్యావరణం

అక్కడ – ఇక్కడ : ఋతువులు- చెట్లు – పర్యావరణం: కాలాలు, ఋతువుల వివరాలు చిన్నప్పుడు పాఠం నేర్చుకోవటమే కానీ, అనుభవంలోకి వచ్చినది నిజానికి ఇక్కడికి వచ్చాకనే! నా సైన్స్ పాఠంలో శిశిరం, వసంతం ఇలా ఆరుకాలాల/ఋతువుల గురించి నేర్చుకున్నా, నేను పెరిగిన ఊరులో కానీ, హైదరాబాద్ లో కానీ ఋతువులలో తేడా పెద్దగా ఉండేదికాదు. మాకు వేసవిలో వేసవి సెలవలు, మామిడి పండ్లు, మల్లెపూల గుబాళింపు, ఎండలు వీటి మూలంగా వేసవి బాగా తెలిసేది. వాన…

శ్రీ రామనవమి – ఇక్కడా – అక్కడా

రామనవమి అంటే భద్రాచలమే గుర్తుకువస్తుంది తెలుగువారికి ఎవ్వరికైనా!! మా చిన్నప్పుడు పెరిగిన ఊరిలో రామాలయం లేదు, కానీ ఇంట్లో విధిగా అమ్మ రామనవమి ఆచరించేది. మాకు వడపప్పు, పానకం ఇచ్చేది. పానకం కారంగా, చాలా కొంచము తీయగా ఉండేది కాబట్టి తాగటానికి నాలుగు వంకలు పోయి, తప్పక గొంతులో పోసుకునేవాళ్ళము,అందుకే చాలా గుర్తు. ఒకసారి నవమికి తెనాలిలో ఉన్నాము. నాకు బహుశా 10 సంవత్సరాల వయస్సు ఉండొచ్చు. ఊరంతా పందిళ్లు, ఎక్కడ చుసినా జనం.. అన్నిటికి మించి…