గానగంధ్వరునితో కాసేపు –

ఎంత అద్భుతమైన మధ్యహనపు వేళ ఈ వేళ. ఇది గంధర్వ లోకమా లేక అట్లాంటానగరమా అని ఆశ్చర్య పడాలో ఏమిటో తెలియలేదు. చాలా రోజుల తర్వాత ఇంత అద్భుతమైన, ఆహ్లదకరమైన, ఆనంద కరమైన, మనసును, ఆత్మను సమ్మోహన పరచి తృప్తి కలిగిన వేళ ఈ మధ్యాహ్నం. బయట భానుడు ప్రతాపము మమ్ముల్ని ఎంత మాత్రమూ ఇబ్బంది పెట్టలేదు అంటే మరి అంతేగా జేసుదాసుగారి సుమధుర స్వరఝరిలో తడిసి ఓలలాడి, పవిత్ర ఆ ప్రవాహంలో మునకలేసి మురిసిన హృదయాలకి…