జొన్నవిత్తులతో కాసేపు:

జొన్నవిత్తులతో కాసేపు: తెలుగు భాషకు ఉన్న ఒక విశిష్ట ఆభరణం పద్యం. ఇతర భాషలకు లేనిది తెలుగుకు మాత్రమే సొంతమైనది పద్యమేనని పెద్దలంటారు. మన తెలుగులో పద్యం మాత్రమే ప్రాచుర్యంలో ఉన్న రోజులలో పద్య వైభవం ఎంతో ఘనత కెక్కింది. రాయభార పద్యాలు ఇలా….వచనము, వచన కవిత్వం బాగా ప్రాచుర్యంలోకి వచ్చాక, పద్యం కుంటుపడింది. అందునా కొందరు పెద్దవారు  “చందస్సుఅనేదుడ్డుకర్రలో, పద్యాలనడ్డివిరుగగొడుదాం” –అనిచాటించిపద్యాలనుమూలకుతోసి వచనముకోసంఆరాటపడ్డారు. అలాంటిది ఈ కాలంలో కూడా అలవోకగా పద్యాలూ చెబుతూ, వంటికి అత్తరు…

ఉక్కిరి బిక్కిరి గా ముంచేసిన నీల

“లైంగిక విలువల పేరుతో పురుషులూ స్త్రీలూ, గురయ్యే హింస నుంచి విముక్తి పొందాలి” ఎంత బలంగా ఉన్నది ఈ మాట! ఈ ఒక్క మాట కోసమైనా నీల చదవాలి. నీల ను చదివాను. మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ హడావిడి తగ్గాకా, కొంచం టైం కుదుర్చుకొని నీల ను మొదలెట్టాను. 500 పేజీల పైనున్న ఈ నవల నన్ను ఇంతగా ఊపేస్తుందని, ఉక్కిరిబిక్కి చేస్తుందని అనుకోలేదు. అసలు పూర్తిగా చదువుతానా? అని ఒక డౌటు వుంది మొదలెట్టక ముందు….

అమ్మా నిన్ను తలచి…..

అమ్మా నిన్ను తలచి….. అమ్మను తలుచుకోవటానికి నాకు ప్రత్యేకంగా ఒక రోజు అవసరములేదు. ప్రతి రోజూ ఏదో క్షణంలో ఏదో ఒక విషయములో గుర్తుచేసుకుంటునే వుంటాను. అమ్మ వస్తుందంటే ముందు మెట్టెలు కలిసిన మెత్తని అడుగుల సవ్వడి,  మెల్లని గలగలలు గాజులు సవ్వడి, నా హృదయంలో చిరుగంటలలా వినిపిస్తూనే వుంటాయి. అమ్మ గుంటూరు నేత చీరలు ఎక్కువగా కట్టుకునేది. మెత్తని ఆమె చీర కొంగు ఎన్ని సార్లు నాకు చలి తగలకూడదని కప్పిందో. బోంచేశాక అమ్మ కొంగుతో…