హిందోళ రాగము

“శిశుర్వేత్తి పశుర్వేత్తి వేతి గానరసం ఫణి కోవేత్తి కవితా తత్త్వం శివో జానాతి వా నవా ” అన్ని పెద్దలు చెప్పారు. చిన్నలను పెద్దలను, పశు పక్షాదులను సమానముగా అలరించి మైమరపించే శక్తి సంగీతానికి ఉంది. అలాంటి సంగీతంలో కొన్ని రాగాలు మరీ అవలీలగా ఆకట్టుకొని, హృదయాన్ని ఉరూతలూగిస్తాయి. అలా అలవోకగా మనసును రంజించే రాగాలలో “హిందోళ” రాగ మొకటి. హిందుస్తానీ వారు ‘మాల్కోస్’ అంటారు దీనినే. దీనికి 20వ మేళకర్త అయిన ‘నటభైరవి’ జన్యం. ఈ…

మాతృభాషాదినోత్సవము

1.అమ్మ చిరునవ్వు భాష తెలుగు। అమ్మ మమ్ముల దగ్గరకు తీసుకొని పెట్టిన గోరు ముద్దలు భాష తెలుగు। మా చిన్నతన్నాన ఆడిన గుజ్జనగూళ్ళ భాష తెలుగు। నాన్న చెయ్యి పట్టుకు నడిచిన నడత తెలుగు।। 2.నన్నయ్య అక్షర రమ్యత తెలుగు। తిక్కన నాటకీయత తెలుగు। కృష్ణరాయలు  పద్యసొగసు తెలుగు। రామకృష్ణుని చతురత తెలుగు। పెద్దన ప్రవరుని పవిత్రత తెలుగు। నంది తిమ్మన నుడికారము తెలుగు।। 3.పోతన భాగవతపు వెలుగు తెలుగు। శ్రీనాధుని వీర శృంగారము తెలుగు। గురజాడ…

కుదిపేసిన గొల్లపూడివారి సాయంకాలము

మంచి పుస్తకానికి ఉన్న లక్షణం  పాఠకులను ఏకధాటిగా చదివించటంలోనే కాదు, చదివాక దాని ప్రభావంలో ఆ చదివిన వారు కొట్టుకుపోవడం.  అదీ అట్లా ఇట్లా కాదు, పూర్తిగా మునిగి పోవటం. వారిలో కొంత మార్పు తేవటము. పాఠకులు తమ కథను ఆ చదివిన కథతో అనుసంధానించుకోవటం.  పాత్రలలో మమైక్యమైపోవటం. తమ కోణంలో ఆ కథను చూడటం. కొన్నిచోట్ల కథతో తాదాత్మ్యం చెందటం. కథను కొంత సమర్ధించుకోవటం. వెరసి పూర్తిగా అందులో మునిగి తమను తాము కోల్పోయేలా చేసేది…

వంటగదిలో ఆధునికత – ఎంత ఆరోగ్యము ?

పూర్వం, అంటే కట్టెల పోయి ఉన్నప్పుడు, బియ్యం నానబోసి రోట్లో దంచినప్పుడు, సర్వం కుంపటి మీదనో, మరో దాని మీదో వంట చేసే స్త్రీ లకు కిరసనాయిలు స్టవ్వు వచ్చినప్పుడు వంట త్వరగా అవుతున్న సంతోషమే తప్ప మరోటి కలిగి ఉండదు. కానీ అప్పటి రోజులలో కాఫీ, పాలు కిరోసిన్ స్టవ్వు మీద కానిచ్చి, ఆ స్టవ్వు తాలూకు వాసన గురించి కంప్లియెంట్ చేసేవారట.  కుంపట్లో కాచమని కూడా గొడవ వుండేదని చెబుతారు పెద్దవాళ్ళు వుంటే.  గ్యాస్…

ప్రపంచము మరచిన చక్రవర్తులు

అసలు చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి?  అలా అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం: చెట్టు, వేరు లేకుండా పెరుగుతుందా? మనగలుగుతుందా?  నీ మూలాలు నీవు తెలుసుకోలేకపోతే నీవు భవిష్యత్తులో సాధించేదేమిటి?  తన చరిత్ర తనకు తెలియని వారు, సాధించే ఘనకార్యాలు ఏముంటాయి?   మన చరిత్రను తెలుసుకోవటమే కాదు, దానిని గురించి మనకు లభిస్తున్న ఆధారాలను జాగ్రత్త పెట్టుకోవలసిన అవసరము కూడా మనకుంది.  ఈమధ్యలో చుసిన ఒక చిన్న వీడియొ క్లిప్ చాలా చిరాకు పరిచింది.  కొందరు తుంటరులు…