నాకు తెలిసిన సాలరుజంగు

మా చిన్నప్పుడు సాలారుజంగు మ్యూజియం వెళ్ళినప్పుడు, వింతగా చూస్తుంటే చెప్పారు ఇవ్వన్నీ ఒక్కళ్ళు సేకరించిన సరుకు అని. అన్ని సేకరించటానికి ఎంత ఇంటరెస్ట్ , సమయము ఉండాలో నా చిన్న బుర్రకు అర్థం కాలేదు. అమెరికాలో ఇలాంటి కలెక్షన్, కలెక్టు చేసే వారు చాలా మంది ఉంటారు. వారికి గ్రూప్లు, విషయాలు పంచుకోవటం, ఊరు ఊరు తిరగం,మాల్స్. ఫిల్టు మార్కెట్లు , ఆక్షన్ కేంద్రాలు, ఓహో అదో మహా లోకం…. మనకు తెలియని ప్రపంచం. ఇంట్రెస్ట్ ఉండాలి…