విశ్వనాథ జన్మదినం

ఈ రోజు విశ్వనాథ సత్యనారాయణ గారిజన్మదిన సందర్భంగా వారికి భక్తితో సమర్పించే చిరు పుష్పం… విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన సాహిత్యాములో రామాయణ కల్పవృక్షము అతి విశిష్టమైనది. వారికి జ్ఞానపీఠము తెచ్చిపెట్టినది.అందరూ అదే రామాయణము రాయటమేమిటా అని మనము అడగక ముందే, వారే చెప్పారు… ఇలా… “తింటున్న అన్నమే రోజూ తింటున్నాము కదా యని…మరల నిదేల రామాయణం బన్నచో,నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళతినుచున్న అన్నమే తిననచున్నదిన్నాళ్ళు,తన రుచి బ్రదుకులు తనవి గానచేసిన సంసారమే చేయుచున్నది,తలచిన రామునే తలచెద…