4.#అమ్మఆలోచనలు అమ్మ వివరించేవి చాలా లాజిక్ తో కూడి ఉంటాయి. రాజు అమ్మ భక్తుడు. అతను మొదటిసారి వెళ్ళినప్పుడు అమ్మ భోజనానికి రమ్మంది. పొట్లకాయ కూర అమ్మే వండింది. రాజు అమ్మతో తను పొట్లకాయ తిననని చెప్పాడు. “ఏం నాన్నా! సహించదా?”“సహించక కాదు. న్ను పాము మంత్రం సాధన చేస్తున్నా. తినవద్దన్నారు ““దానికీ దీనికీ సంబంధం లేదు నాన్నా. పొట్లకాయ రక్తవృద్ధి. రుచి ఆరోగ్యం కూడా. తిను నాన్నా”“నిషేద్ధం అమ్మా”“మంత్రం బాగా జపిస్చున్నావా? ఎవరికైనా వేశావా?”“లేదు”“సిద్ధి పొందిందా?”“తెలియదు….
Author: ఉహలు- ఊసులు - సంధ్య
#అమ్మఆలోచనలు
3స్వామి పరమహంసయోగానంద రమణుల ఆశ్రమం సందర్శించారు. వారు రమణులతో సంభాషణస్వామి: ప్రజలను ఆధ్యాత్మికంగా ఎట్లా ఉద్ధరించాలి? వారికి నేర్పవలసినవుి ఏమిటి?మహర్షి: బోధ అందరికీ ఒకే విధంగా చెయ్యలేము. వారి ప్రకృతి, పక్వత బట్టి ఉంటుంది. స్వా : లోకంలో ఇంతటి బాధ చూస్తూ భగవంతుడు ఎందుకు ఊరుకున్నాడు?ఒక్క దెబ్బతో రూపుమాపవచ్చుకదా మ: బాధ ద్వారా భగవద్దర్శనం కలుగుతుంది స్వా: దాన్ని మార్చి వేరే విధంగా చెయ్యనక్కల్లేదా? మ: అదే మార్గం స్వా: యోగం, మతం విరుగుడు కాదా?…
#అమ్మఆలోచనలు
2.కొందరు పెద్దలు, వేదపండితులు కలసి జిలేళ్లమూడి వెళ్ళారు. వారిలో కొందరు భక్తులు. కొందరు అమ్మను పరిక్షించాలనుకున్నవారు. కొందరు అమ్మ వేదపరిజ్ఞానము చూడాలనుకున్నవారు. అప్పటికి అమ్మ గుడిసెలోనే ఉండేది. అమ్మ అందరికీ భోజనాలు కొసరి కొసరి వడ్డించింది. తిన్న తరువాత వారు అమ్మతో సంభాషణ మొదలెట్టారు. వేదాంతం మీద ప్రశ్నలేశారు. అమ్మ దేనికీ సమాధానమివ్వక వేరేది మాట్లాడుతోంది. ఇంతలో ఒక భక్తుడు వచ్చి “అమ్మ! ఈ పుస్తకం అచ్చు వేశారు. ఇది చూసి నీవు సరేనంటే విడుదల చేస్తారు…”…
#అమ్మఆలోచనలు
1.మున్నెమ్మ అంధురాలు. వృద్ధురాలు. ఆమె తిరువన్నాపురములో ఉండేది. ప్రతిరోజు కష్టం మీద చేతి కర్ర సాయంతో కొండ ఎక్కి వచ్చి భగవాను రమణుల దర్శనము చేసుకునేది. విరూపాక్షగుహలో ఉండేవారు భగవాను అప్పుడు. ఆమె నెమ్మదిగా వచ్చి అక్కడి వారిని అడిగేది “భగవాను చూశారా నన్ను?”“చూశారమ్మా!”అలా చెప్పాక భగవానుకు నమస్కారాలు తెలిపి వెళ్ళిపోయేది. ఎప్పుడూ ఏమీ అడిగేది కాదు. ఒకరోజు ఆమె వచ్చినప్పుడు భగవాను ఆమెను తన వద్దకు తీసుకురమ్మనారు. ఆమె ను భక్తులు భగవాను వద్దకు తీసుకువచ్చారు….
విశ్వనాథ జన్మదినం
ఈ రోజు విశ్వనాథ సత్యనారాయణ గారిజన్మదిన సందర్భంగా వారికి భక్తితో సమర్పించే చిరు పుష్పం… విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన సాహిత్యాములో రామాయణ కల్పవృక్షము అతి విశిష్టమైనది. వారికి జ్ఞానపీఠము తెచ్చిపెట్టినది.అందరూ అదే రామాయణము రాయటమేమిటా అని మనము అడగక ముందే, వారే చెప్పారు… ఇలా… “తింటున్న అన్నమే రోజూ తింటున్నాము కదా యని…మరల నిదేల రామాయణం బన్నచో,నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళతినుచున్న అన్నమే తిననచున్నదిన్నాళ్ళు,తన రుచి బ్రదుకులు తనవి గానచేసిన సంసారమే చేయుచున్నది,తలచిన రామునే తలచెద…
వారాహీ మాత
వారాహీనవరాత్రులు నేటి నుంచీ వారాహీ నవరాత్రులు మొదలు: ఆషాడ మాస పాడ్యమి నుంచి నవమి వరకూ వచ్చే నవరాత్రులను “శ్రీ వారాహీ నవరాత్రులు” అని పిలుస్తారు. శ్రీ లలితా దేవి యొక్క దండనాయిక (సేనానాయిక) శ్రీ వారాహీ మాత. ఈమె రక్షణ శక్తి. ఎంతటి ఘోర కష్టాల్లో ఉన్నవారైనా ఈ తల్లిని స్మరించినంత మాత్రాన ఉద్దరింపబడతారని శాస్త్ర వచనం.ఆషాడ నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం కోసం పూజించాలి.ఆమె భూదేవికి మరో రూపం, వరాహ స్వామి యొక్క స్త్రీ రూపం.లలితా…
గురు పౌర్ణమి
ఆషాఢ పౌర్ణమి – వ్యాస పౌర్ణమి – గురుపౌర్ణమి అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ॥ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః। గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ॥ మానవ జన్మల పరంపరలను విచ్ఛేదించు విచ్చు కత్తి గురువుల ఆశీర్వచనము. గురువు మనకు అందించే బోధను త్రికరణశుద్ధితో నమ్మి, ఆచరించిన వారికి ఈ జన్మ పరంపర ఇబ్బంది పెట్టదు. గురువును నమ్మిన వారికి ఈ సంసారమన్న నౌక…
శ్రావణ(పండగల) మాసానికి స్వాగతం
శ్రావణ(పండగల) మాసానికి స్వాగతం2021 శ్రావణ మాసం వచ్చింది. ఇక మనకు చుట్టూ పండగలే. ప్రతిరోజు ఒక కొత్త విషయమే.ఎండాకాలపు వేడికి అలసిన హృదయాలకు మిత్రుల, బంధువుల కలయికతో ఆనందము వర్షించే సమయము ఆసన్నమవటమే శ్రావణము.హడావుడి జీవితాలలో ఒక్క క్షణం ఆగి ఆనందస్వరూపుడైన పరమాత్మను తలుచుకోవటానికి విశిష్టమైన కాలము శ్రావణము. శివునికి, విష్ణవుకు ప్రియమైన కాలము శ్రావణము.మంగళగౌరిగా, శ్రావణలక్ష్మిగా , అమ్మవారిని ఆరాధించేకాలము శ్రావణము.మంచిరోజులుకు, పెళ్ళిళ్ళకు, పెళ్ళిమాటలకు శుభ సమయము శ్రావణము.ఆషాడపు గడ్డుకాలము తీరి నవ దంపతులను కలిపే…
సుందరకాండకా పేరెందుకు?
సుందరకాండ ఆ పేరెందుకు?? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసేరఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః రామాయణ మహాకావ్యములో ఉన్న కాండలలో సుందరకాండ ఉత్కృష్టమైనది. పరమ పావనమైనది. ఆ కాండకు సుందరకాండ అనే పేరు మునివర్యులు, కవి అయిన వాల్మీకి ఎందుకు పెట్టాడన్నది ప్రశ్న. దానికి వాల్మీకి ఎక్కడా వివరణ ఇవ్వలేదు మనకు.సుందర కాండకు మరి ఆ పేరెందుకు వచ్చి ఉంటుంది?అన్ని కాండలకు పేర్లు బట్టి అందులో గల విషయము ఏమిటో చెప్పగలము. కానీ ఈ సుందరకాండకు మాత్రము…
టికెట్లు ఇక్కట్లు
టిక్కెట్లు – ఇక్కట్లు -2 రోడ్డు మీద టికెట్లు రావటానికి ‘స్టాప్ సైను’ కల్పతరువు కాపులకు(cops)కి, ఆ కౌంటికి. స్టాపు సైను వుంటే ఆగమని కదా. ఆగిన తరువాత మనము (తౌజెండు వన్, తౌజెండు టూ, తౌజెండు త్రీ) అంటూ మూడంకెలు లెక్కెట్టాలి. అంటే అంత సమయము ఆగాలన్నమాట. అందుకే కారు నేర్చుకునేటప్పుడు చెప్పారు మనసులో లెక్కెట్టుకోమని. కాబట్టి ప్రతి స్టాపు సైను వద్ద అలా అనుకోవటము అలవాటుగా మారింది నాకు. మా ఇంటి వెనక వైపు…