విశ్వనాథ జన్మదినం

ఈ రోజు విశ్వనాథ సత్యనారాయణ గారిజన్మదిన సందర్భంగా వారికి భక్తితో సమర్పించే చిరు పుష్పం… విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన సాహిత్యాములో రామాయణ కల్పవృక్షము అతి విశిష్టమైనది. వారికి జ్ఞానపీఠము తెచ్చిపెట్టినది.అందరూ అదే రామాయణము రాయటమేమిటా అని మనము అడగక ముందే, వారే చెప్పారు… ఇలా… “తింటున్న అన్నమే రోజూ తింటున్నాము కదా యని…మరల నిదేల రామాయణం బన్నచో,నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళతినుచున్న అన్నమే తిననచున్నదిన్నాళ్ళు,తన రుచి బ్రదుకులు తనవి గానచేసిన సంసారమే చేయుచున్నది,తలచిన రామునే తలచెద…

వారాహీ మాత

వారాహీనవరాత్రులు నేటి నుంచీ వారాహీ నవరాత్రులు మొదలు: ఆషాడ మాస పాడ్యమి నుంచి నవమి వరకూ వచ్చే నవరాత్రులను “శ్రీ వారాహీ నవరాత్రులు” అని పిలుస్తారు. శ్రీ లలితా దేవి యొక్క దండనాయిక (సేనానాయిక) శ్రీ వారాహీ మాత. ఈమె రక్షణ శక్తి. ఎంతటి ఘోర కష్టాల్లో ఉన్నవారైనా ఈ తల్లిని స్మరించినంత మాత్రాన ఉద్దరింపబడతారని శాస్త్ర వచనం.ఆషాడ నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం కోసం పూజించాలి.ఆమె భూదేవికి మరో రూపం, వరాహ స్వామి యొక్క స్త్రీ రూపం.లలితా…

గురు పౌర్ణమి

ఆషాఢ పౌర్ణమి – వ్యాస పౌర్ణమి – గురుపౌర్ణమి అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ॥ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః। గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ॥ మానవ జన్మల పరంపరలను విచ్ఛేదించు విచ్చు కత్తి గురువుల ఆశీర్వచనము. గురువు మనకు అందించే బోధను త్రికరణశుద్ధితో నమ్మి, ఆచరించిన వారికి ఈ జన్మ పరంపర ఇబ్బంది పెట్టదు. గురువును నమ్మిన వారికి ఈ సంసారమన్న నౌక…

శ్రావణ(పండగల) మాసానికి స్వాగతం

శ్రావణ(పండగల) మాసానికి స్వాగతం2021 శ్రావణ మాసం వచ్చింది. ఇక మనకు చుట్టూ పండగలే. ప్రతిరోజు ఒక కొత్త విషయమే.ఎండాకాలపు వేడికి అలసిన హృదయాలకు మిత్రుల, బంధువుల కలయికతో ఆనందము వర్షించే సమయము ఆసన్నమవటమే శ్రావణము.హడావుడి జీవితాలలో ఒక్క క్షణం ఆగి ఆనందస్వరూపుడైన పరమాత్మను తలుచుకోవటానికి విశిష్టమైన కాలము శ్రావణము. శివునికి, విష్ణవుకు ప్రియమైన కాలము శ్రావణము.మంగళగౌరిగా, శ్రావణలక్ష్మిగా , అమ్మవారిని ఆరాధించేకాలము శ్రావణము.మంచిరోజులుకు, పెళ్ళిళ్ళకు, పెళ్ళిమాటలకు శుభ సమయము శ్రావణము.ఆషాడపు గడ్డుకాలము తీరి నవ దంపతులను కలిపే…

సుందరకాండకా పేరెందుకు?

సుందరకాండ ఆ పేరెందుకు?? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసేరఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః రామాయణ మహాకావ్యములో ఉన్న కాండలలో సుందరకాండ ఉత్కృష్టమైనది. పరమ పావనమైనది. ఆ కాండకు సుందరకాండ అనే పేరు మునివర్యులు, కవి అయిన వాల్మీకి ఎందుకు పెట్టాడన్నది ప్రశ్న. దానికి వాల్మీకి ఎక్కడా వివరణ ఇవ్వలేదు మనకు.సుందర కాండకు మరి ఆ పేరెందుకు వచ్చి ఉంటుంది?అన్ని కాండలకు పేర్లు బట్టి అందులో గల విషయము ఏమిటో చెప్పగలము. కానీ ఈ సుందరకాండకు మాత్రము…