ఇక్కడ – అక్కడ …

ఉగాది ముందుగా అందరికి గుర్తుకువచ్చేది వుగాది పచ్చడేగా.. ఆ చిరుచేదు, పులుపు, తీపి మిశ్రమము. ఆ పచ్చడి, చిన్నప్పుడు తినాలంటే పగలే చుక్కలు కనిపించేవి. అందునా మా ఇంటి వెనకాల  ఒక వేప చెట్టు వుండేది. ఆ ఉదయమే తాజాగా వేప పూత కోసుకొచ్చి పచ్చడి రెడీ చెసేది అమ్మ. తలంటి పోసి కొత్తబట్టలు తొడిగి అందరికి వరసగా చేతులలో ఆ పచ్చడి పెట్టి మిలిటరీ డిసిప్లెనుతో మా నాన్నగారు తన ముందే మింగమంటే, ఒక సారి…