సర్వప్రియానందా ఈ పేరు ఆయనకు ఎవరు పెట్టారో కాని నిజంగానే సర్వులకూ ప్రియమైనవాడు. సున్నితత్వం, మృదుత్వం, దైవత్వం తో కూడిన సంస్కారానికి రూపమాయన. గులాబీలలో మెత్తదనము, పారిజాతాల పవిత్రత గుర్తకు వస్తాయి ఆయనను చూసిన వారికి. దైవత్వాన్ని వెదజల్లుతూ ఒక దివ్యమైన తేజస్సు కూడి ఆ స్వామి నడుస్తుంటే ప్రతి ఒక్కరూ ఆ దైవత్వానికి ప్రణమిల్లుతారు. ఆయన నిఖార్సైన వేదాంతి. అద్వైతాన్ని నమ్మి, నలుగురుకీ పంచుతున్నవాళ్ళలలో ముఖ్యుడు. చక్కటి స్వష్టమైన భాష, గొప్ప అనుభవాలతో కూడిన ప్రసంగము అందర్ని అలరిస్తుంది. ప్రతి ఒక్కరిని…
Category: మనసులో మాటలు
శ్రీ రాముని అడుగుజాడలలో:
శ్రీ రాముని అడుగుజాడలలో: రాముడు భారతీయ ఆత్మ. రామ నామము మహా మంత్రం. రామ నామము ఉన్నంత వరకూ ఈ భూమి మీద ఉంటానన్నాడు హనుమంతుల వారు. రామ మంత్రం జరిగే చోట నేటికీ మనకాయన తప్పక కనపడుతాడు. మహరచయితల నుంచి కొద్దో గొప్పో రచనలు చేసే వారి వరకూ, రామకథను రాయనివారు కద్దు. అందుకే మనకు రామాయణాలు కోకొల్లలు. తెలుగులోనే వందకు పైగా రామాయణాలు ఉన్నాయి. కారణము బహుశా రామకథ మధురమైనది కాబట్టి, రాముడు దేవుడుగా…
రామాయణం- అంతరార్థం- సీతామాత – కుండలినీ శక్తి.
రామాయణం- అంతరార్థం- సీతామాత – కుండలినీ శక్తి. “నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యై చ తస్యై జనకాత్మజాయై। నమోఽస్తు రుంద్రేంద్రయమానిలేభ్యో। నమోఽస్తు చంద్రార్కమరుద్గణేభ్యః॥” శ్రీరామునికి, హనుమకు సర్వస్యశరణాగతి చేసిన నేల భారతావని. రామాయణం, హనుమంతుల వారు అణుమణువునా అగుపడుతారీ అవనిలో. రామాయణం పవిత్రమైన గ్రంథం. మన ఐతిహాసము. శ్రీ రామచంద్రుడు భారతీయ ఆత్మ. ఆ రామస్వామి పేరు భారతదేశపు అణువణునా, కణకణమునా నిలచి ఉంది. వాల్మీకి మహాముని రామాయణాన్ని కావ్యంగానో, చరిత్రగానో రాయలేదు. గొప్ప అంతరార్థాన్ని నిక్షిప్తం…
మాఘ నవరాత్రులు
మాఘమాసం అద్భుతమైన కాలం. ఉత్తరాయణ పుణ్యకాలం మొదట వచ్చే ఈ మాసం పుణ్యకాలం.అప్పటి వరకూ ఆగిన ముహుర్తాలు మాఘమాసంతో మొదలవుతాయి. నదీ స్నానానికి, సముద్రస్నానానికి ప్రసిద్ధి ఈ మాసం.మాఘమాసంలో సూర్యారాధన ఎంతో ముఖ్యమైనది. ఈ మాసంలోనే మనకు రథసప్తమి కూడా వస్తుంది.ఇదే కాక ఈ మాసంలో జ్ఞానాన్ని ఇచ్చే శ్యామలా నవరాత్రులు కూడా వస్తాయి.ఈ మాఘ శుక్ల పాడ్యమి నుంచి శుక్ల నవమి వరకూ కూడా రాజ్యశ్యామలా నవరాత్రులుగా ప్రసిద్ధి. ఇవి గుప్త నవరాత్రులు. ఈ గుప్త…
అష్టావక్రగీత10
అష్టావక్రగీత#10జనక మహారాజు అష్టావక్రునికి జ్ఞాన తృష్ణతో అడిగిన ప్రశ్నకు అష్టావక్రుడు ఆత్మ నిజతత్త్వాన్ని గురించి వివరించి చెబుతాడు.జనక మహారాజుకు ఆత్మానుభవము కలిగింది. ఆ జ్ఞానం కలిగిన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చెబుతున్నాడు.సముద్రంలో అనేకమైన అలలు పుడుతూ ఉంటవి. అవే కాదు కెరటాలు, నురుగు, నీటి బిందువులు వెదజల్లబడుతూ ఉంటాయి. తిరిగి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. అలాగే పరమాత్మ నుంచి ఆత్మలు ఉద్భివిస్తాయి. తిరిగి లయమవుతాయి. అన్నీ సముద్రంలో భాగాలలా, పరమాత్మలో ఇవీ భాగాలే. అలా ఆత్మ పరమాత్మలో…
అష్టావక్రగీత#9
అష్టావక్రగీత#9 జనక మహారాజు అష్టావక్రునికి జ్ఞాన తృష్ణతో అడిగిన ప్రశ్నకు అష్టావక్రుడు ఆత్మ నిజతత్త్వాన్ని గురించి వివరించి చెబుతాడు. జనక మహారాజుకు ఆత్మానుభవము కలిగింది. ఆ జ్ఞానం కలిగిన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చెబుతున్నాడు. సముద్రంలో అనేకమైన అలలు పుడుతూ ఉంటవి. అవే కాదు కెరటాలు, నురుగు, నీటి బిందువులు వెదజల్లబడుతూ ఉంటాయి. తిరిగి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. అలాగే పరమాత్మ నుంచి ఆత్మలు ఉద్భివిస్తాయి. తిరిగి లయమవుతాయి. అన్నీ సముద్రంలో భాగాలలా, పరమాత్మలో ఇవీ భాగాలే….
అష్టావక్రగీత7
అష్టావక్రగీత#7 ”సాకారమనృతం విద్ది నిరాకారం తు నిశ్చలమ్।ఏతత్త్వోపదేశేన న పునర్భవ సంభవః॥” రూపం నశిస్తుంది. రూపం లేనిది శాశ్వతంగా ఉంటుంది. ఈ జ్ఞానం వల్ల పునఃజన్మ నుంచి విముక్తి పొందుతావు. జగత్తు మిథ్య. కనిపించేది అశాశ్వతం.ఆత్మ సర్వసాక్షిగా ఉంటుంది. నశించిపోయే వాటి మీద అభిమానం వద్దు. ఆకారంలేని ఆత్మ సర్వకాలాల్లో ఉంది. ఇదే ఆనందం. ఇటు వంటి ఆనందమే బ్రహ్మం. ఇదే చిన్మాత్ర. చిన్మాత్రలో విశ్రయించటమే ముక్తి. “యథైవాదర్శమధ్యస్తే రూపేంతః పరితస్తుసః।తథైవాస్మిన్శరీరేంతః పరితః పరమేశ్వరః॥” అద్దంలో ప్రతిబింబం…
ప్రతిక్షణం
ప్రతి క్షణం ప్రతి క్షణం ఈ లోకాన్నిఎవరోవకరు వదిలిపెట్టెస్తున్నారు…ప్రతిక్షణము ఎవరో ఒకరు రూపు మార్చుకుంటున్నారు..వయస్సు తో సంబంధంలేదుబంధాలు ఆపలేవు…మనమూ ఈ వరసలో నిలబడే ఉన్నాముఎంత దూరమో… ఎంత దగ్గరో…మన ముందు ఎందరో… మనకు తెలీదు.ఈ వరసలో నిలబడిన చోటనుంచిబయటకు పోలేము,వెనకకు మరలలేము…ముందుకే సాగాలి…తప్పించుకోలే “వరుసక్రమ”మిదిఇది సత్యం…ఇదే సత్యం…మరి తప్పని ఈ సత్యాన్ని జీర్ణీంచుకోవటానికి సందేహమెందుకు? వరుసలో ఎదురుచూస్తూఏం చెద్దామనుకుంటున్నావు?ఆటలాడవచ్చు…అందరితో స్నేహమూ పెంచుకోవచ్చు…నీ బంధువులకు జ్ఞాపకాలు మిగల్చవచ్చునీ బలాన్నీ లెక్కపెట్టవచ్చు… నీ మనస్సులోని చెడును తొలగించుకోవచ్చు…నలుగురికీ ఉపయోగపడవచ్చు…సద్గంధాలు చదవవచ్చు..జ్ఞానాన్ని…
#అమ్మఆలోచనలు
కొన్ని సార్లు మనకు తెలియకుండా కొన్ని దివ్యమైన అనుభవాలు ఆవిష్కరించబడుతాయి. అవి మనమెంతో కోరుకున్నవైతే ఇక చెప్పేదేముంది? అదో అద్భుతమే కదా! ఈ ఉపోత్ఘమంతా ఈమధ్యనే నాకయిన ఒకానొక అనుభవం పంచుకో టానికి. అసలు అనుభవం పంచుకోవాలా? అని వారం రోజులు ఆలోచించి ఓటు వెయ్యటానికి వరుసలో నిలబడి ఈ విషయం రాసుకుంటున్నా. జిల్లేళ్ళమూడి అమ్మ గురించి చదివి, అమ్మతో అనుభవాల గురించి ఇంటర్యూలు విని, చాలా కాలం అమ్మను ప్రత్యక్షంగా చూడలేదని కష్టపెట్టుకున్నాను. పైగా నాయనమ్మ…
నళినిగారి అనుభవము
స్వాద్యాయ సెంటరులో వారాంతరం గొప్ప సాహిత్య సమావేశాలు జరుగుతాయి. ఆ సెంటరు నారపల్లిలో ఉంది. ఊరికి కొంత దూరంగా ఉన్నందునా, ఇంకా రణగోణధ్వనుల ప్రవేశం లేనందునా ఆ ప్రదేశంలో కొంత ప్రశాంతత నిలిచే ఉంది. శ్రీమాన్ కోవెల సుప్రసన్నాచార్యులువారి గ్రంధాలయంలో నెలకొని ఉంది ఆ కేంద్రం. ఆ ప్రాంగణము చెట్లతో నిండి ఉంది. బయట వేడి లోపలికి రానియ్యని వృక్షసంపదతో పాటూ, ఆ ఇంటి గ్రౌండు ప్లోర్లే కావటం వలన వారి గ్రంధాలయం ఎంతో ప్రసన్నంగా, ప్రశాంతంగా ఉంది. ఎన్నో…