కృతికా నక్షత్రం… వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే |జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ || శివశివానిలు జననిజనకులు ఈ జగతికి. వారు జగతికే కాదు గణపతి, స్కందులకు కూడా జననీజనకులు. కుమారస్వామి శివశక్తుల పుత్రుడు. ఆయనను జ్యోతి స్వరూపంగా కొలుస్తారు భక్తులు. ఈ స్వామికి కుమార స్వామి, స్కందుడు, కార్తికేయుడు, శరవణుడు, మురగన్, దండపాణి, వేలాయుదం అన్న పేర్లు ఉన్నాయి. ఈయన యజ్ఞస్వరూపుడు. అగ్ని స్వరూపుడు. శివ పంచాయతనంలో ఈ స్వామి రూపు ఉండదు.(పంచాయతనం అంటే…
Category: మనసులో మాటలు
నిత్యపూజ
నిత్య పూజ ప్రాముఖ్యత కొందరు పూజ చెయ్యనిదే ఉదయపు అల్పాహారం కూడా అంటరు.అసలు ఈ నిత్య పూజ ఏమిటి?దాని ప్రాముఖ్యత ఏమిటి?ఆ విధి – విధానం ఏమిటి?అన్న సందేహం మనకు తప్పక కలుగుతుంది. ప్రతి దినం చేసే చేసే ప్రార్థనే నిత్య పూజ. పర్వదినములలో, ప్రత్యేక సందర్భాలలో చేసేది ప్రత్యేకమైన పూజ.నిర్గుణుడు, నిరాకారి అయిన పరమాత్మని తలుచుకోవాటానికి, కొలుచుకోవటానికి మనకు వీలుగా వుండటానికి మన ఋషులు చూపించిన బహు చక్కని సులువైన మార్గం విగ్రహారాధన.విగ్రహారాధన అన్నది మానవుడు…
ఆది శంకరుల ప్రాతఃస్మరణ స్తోత్రం:
ఆది శంకరుల ప్రాతఃస్మరణ స్తోత్రం: శంకర భగవత్పాదుల సాహిత్యం విసృతమైనది. వారి సాహిత్యాన్ని మూడు విధాలుగా విభాగం చేస్తారు. మొదటి శ్రేణిలో ప్రస్థానత్రయానికి భాష్యాలు ఉంచబడ్డాయి. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత లను కలిపి ప్రస్థానత్రయం అంటారు. వీటికి భాష్యాలను, అనగా వివరణను శంకరులవారు రచించి జన ప్రాచుర్యం చేశారు. అందుకే మనకు బ్రహ్మసూత్రాలు నేటికీ లభిస్తున్నాయన్నది సత్యం. రెండవ శ్రేణిలో నిలబడేవి ప్రకరణగ్రంథాలు. ఇవి వివేకచూడామణి, ఆత్మబోధ, తత్వబోధ, అపరోక్షానుభూతి, మనీషాపంచకం, ఉపదేశపంచకం, ప్రాతఃస్మరణ స్తోత్రం…
అమ్మఆలోచనలు
సంసారం చేపల వల వంటిది.ఎవరి మాయతో ఈ సంసారం సృజింపబడిందో ఆ భగవంతుడు జాలరి.జాలరి వలలో చేపలు పడినప్పుడు కొన్ని వల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి. అటువంటి వారిని “ముముక్షువులు” అంటారు.అయితే అలా ప్రయత్నించిన అన్ని చేపలు తప్పించుకోలేవు. వాటిలో కొన్ని మాత్రమే వల నుంచి బయట పడతాయి. అలా బయటపడిన వారిని “ముక్తజీవులు” అంటారు.కొన్ని చేపలు అప్రమత్తతతో ఉండి ఎప్పటికీ వలలో చిక్కుకోవు. వారిని “నిత్యముక్తులు” అంటారు.ఎక్కువ చేపలు ఈ వలలో క్రీడిస్తూ తప్పించుకోవట్నికి…
సుందరకాండ -సాధన – అంతరార్థం
సుందరకాండ -సాధన – అంతరార్థం “మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం॥వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి॥” సుందరకాండకు ఆ పేరు ఎందుకు వచ్చి ఉంటుదన్న విషయం నిరుడు విచారం చేసుకున్నాము. సుందరకాండ కేవలం రామాయణంలో ఒక కాండ మాత్రమే కాదు, ఎన్నో రహస్యాలను తనలో ఇముడ్చుకున్న విజ్ఞానం. ఇది కేవలం బ్రహ్మ విద్యే. సుందరకాండను అనుసంధానం చేసుకొని తరించిన భక్తులున్నారు. వారు సుందరకాండ ఒక్కటే అనునిత్యం పారాయణం చేసుకుంటారుట. అందుకే రోజూ…
అమ్మ….
లలితా సహస్రనామాలలో మొదటి నామం శ్రీమాతా…. అమ్మ అంటే తొలి అని అర్థం కదా. అమ్మతనం కన్నా కమ్మనైనది లేదు సృష్టిలో. ఈ సృష్టిని సృష్టించిన అమ్మతనం ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగితే దానికి సమాధానమే విశ్వజనని… జిల్లెళ్ళమూడిలో వెలసి సమస్త జీవులకు తల్లిగా వెలుగొందినది “అమ్మ”… ఎన్నోమార్లు ఎన్నో సందేహ ప్రాణులకు సంపూర్ణత్వమే అమ్మ అని జిల్లెళ్లమూడిలో వెలసిన అమ్మ నిరూపించింది. అయినా దైవత్వం అనేది మన మానవ బుద్దికి అందగలిగేదా???? అయిన అది అవగతమగుట కేవలం అమ్మ కృప వల్లనే కదా…
సత్సాంగత్యం
శంకర భగవత్పాదుల వారు రచించిన మోహముగ్ధరంలో ఒక శ్లోకం మనకు సత్సాంగత్యము గురించి చెబుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః || సత్పురుష సాంగత్యము వలన భవబంధములు తొలగును. బంధములు తొలగినచో మోహము నశించును. మోహము నశించగా స్థిరమైన జ్ఞానం ఏర్పడును. స్థిరజ్ఞానం ఏర్పడగా జీవన్ముక్తి కలుగును.దీనికే మనకు సజ్జనులతో సాంగత్యము అవసరం.ఏది లభించినా సజ్జనులతో మాత్రం సాంగత్యము దొరకటం అంత తేలికకాదు. అలాంటిది, మంచి మిత్రులు సజ్జనులు, మనలను మంచి వైపు…
అమ్మఆలోచనలు
అమ్మఆలోచనలు సంసారము లంపటమని అంటారు పెద్దలు. సుఖభోగాల పై ఆసక్తి, పేరు ప్రతిష్టలపై మక్కువ, తమతర బేధాలు సంసారులకు సామాన్య లక్షణాలు. ఆధ్యాత్మిక సాధనకు ఇవి అడ్డంకులని, సంసారము వదిలి పోవాలని లేకపోతే సాధన మృగ్యమని మనకో నమ్మకము కూడా ఉంది.అంటే సంసారులకు, గృహస్తుకు తరించే మార్గమే లేదా? గృహస్తు సమాజానికి ముఖ్యమైన వారు కదా. వారే సమాజానికి వెన్నెముక, ముఖ్యాధారం. వారు సర్వసంగ పరిత్యాగం చెయ్యటము సులభం కాదు. మరి తరించటానికి సంసారులకు అడ్డంకులుంటే మార్గమేమిటన్న…
కాశ్మీర్ ఫైల్స్ #kashmirfiles
మేము అట్లాంటా రాక పూర్వం సైప్రస్ లో ఉండేవాళ్ళము. అదో చిన్న దీవి/దేశం.అందమైన ఆ దీవిలో భారతీయ మిత్రులలో కొందరు నాతో చాలా ప్రేమగా ఉండేవారు. వారిలో దీపిక ఒకరు. దీపికను మొదట నేను చూసినప్పుడు నన్ను ఆకర్షించినది ఆమె చెవుల నుంచి పొడుగ్గా వ్రేలాడుతున్న బంగారు గొలుసులు. ఎర్రటి యాపిల్ పండులా ఉండే ఆమె, ముద్దులొలికే వారి పాప మా అందరికీ చాలా ప్రత్యేకంగా కనిపించేది. ఆమె చెవి గొలుసులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయనటంలో అతిశయోక్తి…
అమ్మఆలోచనలు
అమ్మఆలోచనలు “నోటికి రెండు ధర్మాలున్నాయి ఒకటి తినటం. రెండు శబ్ధం చెయ్యటం” అన్నది అమ్మ. మానవులమైన మనం నోటిని దేనికి వాడుతున్నాము?ఆ శబ్దాలు ఎటు వంటి శబ్దాలు? పరమాత్మను పంచేంద్రియాల ద్వారా కూడా సేవచెయ్యాలని గురువులు చెబుతారు. అదే భాగవతము కూడా చెబుతుంది. మనందరము భగవంతునికి షోడష లేదా పంచ ఉపచారాలు చేస్తాము.పుష్పం, పత్రం, దీపం, ధూపం, నైవెద్యం. ఇవే కదా. ఇది మనకు తెలిసిన పూజ. కాని భాగవతము చెప్పే పూజ, అదే ప్రహ్లాదుుకు కూడా…