1.మహాకుంభ అనుభవాలు సాయి చరిత్రలో చెబుతారు నా భక్తులను దారం కట్టిన పిచుకల్లా నా వద్దకు లాక్కుంటాయని.ఈశ్వరుడు పిలిస్తే ఎంతవారైనా పరుగున చేరాలి ఆ పవిత్ర గంగాతీరానికి.మేము అంటే మా శ్రీవారూ నేను మహాకుంభ పవిత్ర స్నానాలు చేసి ఈశ్వర తపము చేసుకొని, పెద్దలకు పితృకార్యాలూ, తర్పణాలు చేసుకున్నాము. పవిత్రమైన మౌని అమవాస్యనాడు ప్రయాగరాజులో గణపతి, నవగ్రహ శ్రీసూక్త సహిత హోమం చేసుకున్నాము. మూడు రోజుల పవిత్ర స్నానాలు, ఉదయమే జపాలు.నాల్గవనాడు వారణాసీ. శివలింగం ప్రతిష్ఠాపన చేసుకున్నాము….