అష్టావక్రగీత

అష్టావక్రగీత#5 మన మనస్సులో ఏ భావము బలంగా ఉంటుందో అదే నిజమవుతుంది. ఇందులో మ్యాజిక్ ఏమీలేదండి. మనఃనిర్మతం ప్రపంచం. మన మనస్సులో అనుకున్నదే మనకు కనపడుతుంది. లేకపోతే మన దృష్టికి ఆనదు. ఉదాహరణకు ఆకలిగా ఉన్నవారికి ప్రతీది ఆహారంలా కనపడుతుంది. అప్పటి వరకూ కనపడని హోటల్స్ కనబడుతాయి. మనస్సులో ఆలోచనతో లోకం చూస్తారు. చాలా సార్లు తరగతి గదులలో విద్యార్థులను టీచర్లు “ఎక్కడ పెట్టావు బుర్ర… పాఠం వినటంలేదు” అంటూ ఉంటారు. అంటే మనస్సులో ఆలోచనలు ఎక్కడో…

అష్టావత్రగీత-4

అష్టావక్రగీత#4 అహం కర్తేత్యహం మాన మహాకృష్ణాహి దంశితఃనాహం కర్తేతి విశ్వసామృతం పీత్వా సుఖీభవ॥ ఒక నల్లటి త్రాచు పాము ఉంది. దాని వంటి నిండా కాలకూట విషముంది. దాని కాటుకు విషముతో కుట్టబడితే విషంతో వారు నిండిపోయి దుఃఖమనుభవిస్తారు. కర్తృత్వం అన్నది నల్లటి త్రాచుపాము. కర్తృత్వం అంటే చేసేది నేనే అన్న అహంకారం. అహంకారం కన్నా నల్లటి త్రాచు మరోటి లేదు. అహంకారం నిండా ఉన్నవారు వంటి నిండా ప్రవహిస్తున్న విషం కలవారు ఒక్కటే. వారికి ఎవ్వరూ…

అష్టావక్రగీత-3

అష్టావక్రగీత#3 వైరాగ్యం ఎలా కలుగుతుంది? జ్ఞానము ఎలా కలుగుతుంది? ముక్తి ఎలా కలుగుతుందని జనకమహారాజు ప్రశ్నించగా అష్టావక్రుడు సమాధానం చెబుతున్నాడు. విషయలంపటాలను విషంలా వదిలెయ్యమన్నాడు. బంధాలనుంచి విడుదల చేసుకోమన్నాడు. ఏ బంధాలవి? “యదిదేహం పృథక్కృత్య చితి విశ్రామ్యతిష్టసి।అధునైవ సుఖీ శాంతః బంధముక్తో భవిష్యసి॥” శరీరము నేనన్న తాదాత్మ్యం నుంచి వేరుపడి నీ ఎరుకలో నీ కాంషియస్‌నెస్‌లో నిలబడి నిన్ను నీవు చూసుకు. నిత్యముక్తుడవు.నిత్యతృప్తుడవు. ఆనందరూపమే నీవు. దేహమనేది ఒక పెద్ద బంధం. ఈ దేహము నేను అన్న…

అష్టావక్రగీత-2

అష్టావక్రగీత #2 జనకుడు రాజయోగి. ఆయనకు జ్ఞాని అని పేరు. ఆయన అష్టావక్రుడన్న మునికుమారుని అడిగిన ప్రశ్న “జ్ఞానం అంటే ఏమిటి? వైరాగ్యం ఎలా నిలుపుకోవాలి? ముక్తి ఎలా లభ్యమవుతుంది?” అష్టావక్రగీతలో మొదటి అధ్యాయములోని 19 శ్లోకాలాలో సమాధానం చెబుతాడు అష్టావక్రుడు. ఆలోచించండి వేల సంవత్సరాలకు పూర్వం శంకరభగవద్పాదుల వారు మనకు అద్వైత జ్ఞానము పంచక పూర్వం అజ్ఞానమన్న రెల్లగడ్డిని పదునైన కత్తి వంటి సమాధానాలతో అష్టావక్రుడు చెప్పాడంటే….ఆనాటి మునుల జ్ఞానగంగా ప్రవాహం మన బుర్రకు అందనిది….

అష్టావక్రగీత -1

నేను” అన్నది ఏమిటో తెలుసుకో!, అన్నారు భగవానులు.“నేను” మీద ధ్యానం చెయి, తెలియగలదని అన్నామలై (రమణుల వారి శిష్యులు) చెప్పారు. “నేను” అన్న భావమే అహం. మానవుకున్న 26 తత్త్వాలు/ గుణాలు/భూతాలలో ముఖ్యమైనది అని చెబుతారు వేదాంతులు. దీని విషయం తెలుసుకోవటానికి గురువును ఆశ్రయించమన్నారు పెద్దలు. గురువు ఏం చెబుతాడు?  “అజ్ఞానివి నీవు కాదయ్యా! నీ స్వభావం జ్ఞానమే. కాని నీవు, నీవు కానిదైన శరీరము నీవన్న బ్రాంతిలో ఉండి నీ అసలు రూపం గహ్రించటము లేదు. నీ అసలు స్వరూపము…