గురువు – గురుమండలము గురు మండలము సూక్ష్మలోకంలో ఉంటుంది. మనకు కనపడుతున్న భౌతిక ప్రపంచము మాత్రమే ప్రపంచమని తలవటమే అజ్ణానము. మనకు కనపడేది కేవలం1/7 భాగము. మనకు కనపడని విశ్వం అనంతం. ఇంతటి విశ్వంలో పెనుచీకటికి ఆవల ఉన్న ఈశ్వరుడ్ని ఎలా పొందగలము?దానికే మనకు గురువును సహాయం కావాలి. అంతేనా అంటే కాదు గురువు ఈశ్వరుడై జీవుని/సాధకుని వేదన తగ్గిస్తాడు. ఈశ్వర ప్రభతో వెలిగే గురుదేవులు జీవుడి వేదన తగ్గించి అంతర్మఖమై స్వాత్మను తెలుసుకోవటానికి సహయపడతాడు. అందుకే గురువు అవసరం ప్రతి ఒక్కరికీ ఉంటుంది….