ఈ భాద్రపద శుద్ధ అష్టమి రాధారాణి జన్మాష్టామి. బృందావనవాసులకే కాదు సర్వ జనులకు పండుగరోజే. కృష్టాష్టమి ఎంత వేడుకో, అంతకుమించి పండుగ ఈ రోజు. కృష్ణుని ప్రియురాలని తలచే ఈ రాధారాణికి ఎందుకింత ప్రాముఖ్యత? అని ఆలోచన కలిగితే, ఆమె గురించి విచారిస్తే, తరచి చూస్తే మూలప్రకృతిగా, శక్తి స్వరూపిణిగా రాధారాణి మనకు కనపడుతుంది. రాధను తిప్పి రాస్తే ధార అవుతుంది. నిరంతరాయంగా అంటే ధారగా కురిసే కరుణ, ప్రేమ, అనురాగం, దయకు గుర్తు రాధ….