మేము అట్లాంటా రాక పూర్వం సైప్రస్ లో ఉండేవాళ్ళము. అదో చిన్న దీవి/దేశం.అందమైన ఆ దీవిలో భారతీయ మిత్రులలో కొందరు నాతో చాలా ప్రేమగా ఉండేవారు. వారిలో దీపిక ఒకరు. దీపికను మొదట నేను చూసినప్పుడు నన్ను ఆకర్షించినది ఆమె చెవుల నుంచి పొడుగ్గా వ్రేలాడుతున్న బంగారు గొలుసులు. ఎర్రటి యాపిల్ పండులా ఉండే ఆమె, ముద్దులొలికే వారి పాప మా అందరికీ చాలా ప్రత్యేకంగా కనిపించేది. ఆమె చెవి గొలుసులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయనటంలో అతిశయోక్తి…