స్వామివారి అట్లాంటా రాక -2017

ఈ సారి స్వామి వారి అమెరికా పర్యటనలో అట్లాంటా నగరము చోటు చేసుకొనలేదు. అది ఎందుకో తప్పిపోయింది. వారు నార్త్, సౌంతు కెరోలినా వరకూ వస్తున్నారు. కాని ప్రక్కనే వున్న అట్లాంటాకు రావటం లేదు. నా భావాలు వర్ణానాతీతాలు. స్వామి ఇక్కడ దాకా వచ్చిన వెళ్ళి దర్శించుకోలేని నా నిసహయతకు నామీద నాకు చిరాకువేసింది. సర్వ సమర్దుడైన పరమాత్మ శ్రీ శ్రీ పరమహంస పరివాజ్రకులైన స్వామి వేంచేస్తుంటే వెళ్ళలేని  నా అసహయతను నా స్వామి పాదుకలుకు విన్నపించుకోవటం…