side table with books

It’s always fun to do a few home improvement projects. They will make you feel proud of yourself and also your creativity will enhance. I enjoy doing such projects. In my home, my library is a good place to hang around. I wanted to add a small side table to put the floor lamp already…

వంకాయ పోయి సాబుదాన్‌ వచ్చే డాం డాం డాం😀😀 —————

ఆలోచిస్తూ కుర్చున్నాను. గుత్తి వంకాయ కూర చెద్దామా? బెండ కాయ పులుసా? తేల్చుకోలేకపోతున్నా…. నాకు రెండూ వచ్చు. వచ్చు అంటే అలా ఇలా కాదు…స్వర్గానికి వెడుతున్నా నే వండిన వంకాయ కూర … అటు ప్రక్క వుంటే, వెళ్ళటము ఆపి బైటాయిం చేస్తారు దేవతలైనా మరి. వీసా రాని మా పిన్నిగారి కొడుకు నే చేసిన ఈ కూర తిని కొంత తీసుకుపోయి వాళ్ళకిచ్చి వీసా చటుక్కున పొందాడు. అంత ఘనమైన కూర నే చేసే గుత్తి…

A step away from paradise

పుస్తకము మంచి మిత్రుడంటారు. కొన్ని పుస్తకాలు జీవితాలను మారుస్తాయి. కొన్ని చదివిన వారి మనసులలో నిలచిపోతాయి. కొన్ని ఆలోచనలను రేకెత్తిస్తాయి.  అలాంటిదే నేను ఈ వారంలో చదివిన “A step away from paradise”.  2018 వ సంవత్సరమునకు గానూ ఇది బెస్టు సెల్లింగు పుస్తకము, న్యూయార్క్ టైమ్స్ లో. నేను వారముగా అందులో కొట్టుకు మిట్టాడిపోయేలా చేసింది.  ఇందులో అంతగా ఏముంది? వుక్కిరి బిక్కిరి చెయ్యటానికి అని ఎవరైనా అడగవచ్చు.  అసలు ఏమి లేదు అందులో?…

పప్పుతో. తిప్పలు

మనకు చిన్నప్పుడు వేరు వేరు కారణాల వలన వంటగది ప్రవేశం నిషేధమయితే తరువాత చాలా ఇబ్బంది పడతాము. అందుకే మన పిల్లలకు చిన్నప్పుడే వంట కాకపోయినా, కనీసము వంట సరుకులన్నా పరిచయము చెయ్యాలి. ఈ వంట సరుకుల పరిచయము లేక గందరగోళపు, తిక్క శంకరయ్యలాంటి వంటలు చేసి పరులకు హాని చేసే అవకాశాలు బహు మెండుగా వుండటము సామాన్యమే కదా మరి!!.  నావరకూ నాకు, చిన్నప్పటి నుంచి వంటగది ఆక్సిడెంట్లు ఎక్కువ. అసలే మనము కస్టర్డ్ పొడితో…

మగ్గం మన్నికలు

మొన్న నా ఇండియా ట్రిప్పులో నా డిగ్రీ స్నేహితురాలు కలిసినప్పుడు నన్ను చూసి ‘నీ కాటను చీరల పిచ్చి, శ్రీ శ్రీ మీద ప్రేమ తగ్గలేదులా వుంది. అమెరికాలో వుంటున్నా ఇలా కాటనే కట్టుకు తిరుగుతున్నావు’ అంది నాలో మార్పుకై వెతుకుతూ.  అవును! ఇన్ని సంవత్సరాలైనా నా కాటను చీరలపై మక్కువ తగ్గలేదు. నేత చీరల ఇచ్చే అందం కానీ, హుందాతనము కానీ మరో రకం వస్త్రాలకు రాదు. దీన్ని కొద్దిగా మైనుటైను చెయ్యాలి కాని ఈ…

బాంబులా జామునుల్లా

వంటగది ఒక ప్రయోగశాల వంటిదంటారు పెద్దవాళ్ళు. అందులో ప్రయోగాలు ఫలించాయా అద్భుతమైన ఆహారము. వికటించాయా మన ప్రయోగశాలలో గాజు గొట్టాలు పగిలి మంటలు ఎగబాకినట్లుగా ఇక్కడ ప్రమాదాలు జరుగుతాయి.ఆ వంటలు వికటించాయా మన మొహాలు నిర్మాతో తోమటము ఖాయం! అందుకే తస్మాత్ జాగ్రత్త అవసరము. ఉదాహరణకే చూడండి, గమ్మున వుండలేక గుబులేసి… గులాబు జాములు తిందామంటే నా గూబ పగిలింది. కన్ను లొట్ట పోయి అమ్మ చేతిలో సూపరు రిన్ తళతళలతో మెరిసిన నా ఈ ప్రహసనం….

కమనీయమైన ‘ఖమస్’

కమనీయమైన ‘ఖమస్’ ఈ ఉదయమంతా ఖమాస్ లో మనసు మూర్చనలు పోయ్యింది. “పాడమని నన్నడగవలెనా.. పరవశించి పాడనా… నేనే పరవశించి పాడనా” అనే వీణ మీద చక్కటి పాట డా।। చక్రవర్తి లో పాట అది. ఈ సందర్భంలో ఖమాస్ రాగము, అందులో మేము నేర్చుకున్న స్వరజతి, కీర్తనా గుర్తుకువచ్చాయి. సర్వజతి ‘సాంబశివా యనవే రాజితా గిరి’ అన్నది. నేను చాలా త్వరగా నేర్చుకొని ఇష్టంగా వాయించేసేదాన్ని. శ్లో।। నకారం ప్రాణనామానం దకార మనలం విదుః।। జాతః…

జ్యోషీ మఠము -కల్పవృక్షము

జ్యోషీ మఠము -కల్పవృక్షము మనము చేసే యాత్రలలో ఒకోసారి మనకు తెలియకుండానే కొన్ని అద్బుతాలను అపూర్వ ప్రశాంతతను అనుభవిస్తాము. అది మనము ఊహించనప్పుడు కలిగితే ఆ ఆనందం వర్ణానాతీతం. నా జ్యోషిమఠ్ సందర్శనము అలాగే జరిగింది. నేను కేవలం గంగ వడ్డున కొంత కాలముండాలన్న కోరికతో 2016 రిషీకేషుకు వెళ్ళినప్పుడు కొందరు తోటి యాత్రికుల నోట “జ్యోషిమఠ్” అని విన్నా. ఆ పేరు నాకెందుకో బాగా గుర్తండి పోయింది. ఆది శంకరులు ఏర్పాటు చేసిన నాలుగు మఠాలలో…

బొమ్మల కొలువు

బొమ్మలకొలువు ఈ రోజు కొలువుకు పేరంటానికి వెళ్ళాలి. బొమ్మలకొలువంటే నన్ను చిన్నతనానికి తీసుకువెళ్ళే వారధి. ఏ విషయాలు చిన్నతనంలో చేస్తామో అవి తలచుకోవటాన్నీ  “good old golden days” అంటారేమో మరి.  నా ‘Good Golden childhood’లో, తెలంగాణాలో నేను పెరిగిన ఆ చిన్న పట్టణంలో సంక్రాంతికి బొమ్మలకొలవు పెట్టే వాళ్ళు ఎవ్వరూ లేరు, మేము తప్ప.  మాకు సంక్రాంతి పండగకు కొలువు, భోగినాడు భోగి పళ్ళ పేరంటము తప్పక వుండేది. అసలు ధనుర్మాసము ఆరంభం నుంచే మొదలయ్యేది…

స్వర్గసీమ

స్వర్గసీమ నా చిన్నప్పుడు – అంటే 1980 ప్రాంతాలలో… మేము ఉన్న ఇల్లు నాలుగు గదులతో…ఒకే వరసలో రైలు పెట్టలని తలపిస్తూ ఉండేది. పూర్వపు వారికి ఒకే వరసలో 7 ద్వారాలు ఏర్పాటు చేసిన తరువాత మార్చాలనే ఒక నియమం ఉండేదట.అందుకే ఆ ద్వారాలు అలా వుండేవి. అవి కూడా గోడకు మధ్యలో ఉండేవి. అలాంటి ఇళ్లలోనే అంతా పెరిగారని కాదు కానీ, నా మిత్రులు చాల మంది ఇళ్ళు దాదాపు అలానే ఉండేవి. ఇది తెలంగాణ…