సౌందర్యలహరి -5 శ్లోకము హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీంపురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ ।స్మరోఽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషామునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ ॥ 5 ॥ అర్థం: అమ్మా! నిన్ను నమస్కరించి పూజించిన వారికి నీవు సౌభాగ్యప్రదురాలివి. నిన్ను కొలచి విష్ణువు స్త్రీ రూపము పొంది జగత్తును మోహములో ముంచాడు. కాముని చంపిన శివుడిని సైతం మోహింపచేశాడు. నీ కృప వలన భస్మమైపోయిన, మన్మథుడు తిరిగి ప్రాణాలు పొంది రతీ దేవికి మాత్రమే కనపడే…
Author: ఉహలు- ఊసులు - సంధ్య
సౌందర్యలహరి 4 శ్లోకము
శ్రీమాత్రే నమః సౌందర్యలహరి -4 శ్లోకం త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణఃత్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా ।భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికంశరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ ॥ 4 ॥ అర్థము అమ్మా! జగజ్జననీ!! ఇతర దేవతలకు రెండు చేతులతో రెండు ముద్రలు పెట్టి ఉంటారు. అవి అభయ ముద్ర, వరద ముద్ర. నీవు మాత్రం నీ చేతులతో ఏలాంటి మద్రులు అభినయించకున్నావు. అమ్మా! భయము నుంచి రక్షించటానికీ, కోరినవి ప్రసాదించటానికీ నీ…
సౌందర్యలహరి -3 శ్లోకము
సౌందర్యలహరి -3 అవిద్యానామంత-స్తిమిర-మిహిరద్వీపనగరీజడానాం చైతన్య-స్తబక-మకరంద-స్రుతిఝరీ ।దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌనిమగ్నానాం దంష్ట్రా మురరిపు-వరాహస్య భవతి ॥ 3 ॥ అర్థంఅమ్మా! నీ పాదము ల నుంచి వచ్చే పద్మపరాగం అజ్ఞానులకు సూర్యోదమైన పట్టణము వంటిది. మందబుద్ధులైన జడులకు జ్ఞానమిచ్చు తేనె ప్రవాహము.దరిద్రులకు చింతమణుల వరసవంటింది. సంసారమన్న సాగరములో మునిగిన జనులకు ఆది వరహామూర్తి కోర వంటిది. (భూమి సముద్రములో మునిగిన నాడు మహావిష్ణువు వరాహావతారములో భూమిని తన కోరపై ఉంచుకొని పైకి తీసుకువచ్చాడు) తేటగీతి॥“జలధి సంసారమిది నెంచ జనులకిలన,నీ…
సౌందర్యలహరి
సౌందర్యలహరి శ్రీమాత్రే నమః తనీయాంసం పాంసుం తవ చరణపంకేరుహభవంవిరించిస్సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ ।వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాంహరస్సంక్షుద్యైనం భజతి భసితోద్ధూలనవిధిమ్ ॥ 2 ॥ అర్థము అమ్మా! నీ పాదముల నుంచి అణువంత ధూళికణముతో బ్రహ్మగారు ఈ చతుర్ధశ భువనాలు నిర్మించాడు. విష్ణువు ఆ ధూళికణము ధరించి వేయి తలల ఆదిశేషువుగా మారి విశ్వమంతా తల మీద ధరించి మోస్తున్నాడు. శివుడు అదే కణమును తన శరీరమంతా బూడిదలా పూసుకు తిరుగుతున్నాడు. తే.గీ॥ తొలుత లేశ…
సౌందర్యలహరి-2
సౌందర్యలహరి -ఆచారము- ఫలము సౌందర్యలహరిని సమయాచారములో ఆష్కరించారు శంకరులు. శ్రీవిద్యా స్వరూపమైన భగవతిని సేవించుకోవటానికి మనకు అందించిన స్తోత్రరాజ్యము సౌందర్యలహరి. ప్రతిశ్లోకంలో నిగూఢముగా ఎన్నో రహస్యాలను పొందపరిచారు. భక్తితో ఈ శ్లోకాలను చదివితే మనకు ఆ మంత్రఫలితము దక్కుతుంది. ఈ శ్లోకాలను చదువుకుంటే శ్రీవిద్యా ఉపాసనా పుణ్యఫలము కూడా దక్కుతుంది. కారణం తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుస్తుంది కదా. అలాగే విద్య కూడా. ఈ శ్లోకఫఠనము వలన బ్రహ్మవిద్యను పొందగలరు చదివినవారు. శంకరులు తన పరమగురువులైన…
సౌందర్యలహరి
సౌందర్యలహరి Day1 ఉపోద్ఘాతము శ్రీమాత్రే నమః. అమ్మవారి సాహిత్యం అపారం. అసలు అక్షరమే జగన్మాత స్వరూపము. జగత్తు పుట్టినది నాదము నుంచి. నాదము అక్షరమే. అక్షరమంటే క్షరము లేనిది, నాశనము అన్నది లేనిది. ఈ అక్షరాలన్నీ కూడా చెప్పేది పరమాత్మ గురించే. వీటినే వర్ణాలని కూడా అంటారు. వర్ణాలంటే అక్షరాలు, రంగులు కూడా. అన్నీ వర్ణాలు చెప్పేది ఆ దేవదేవి గురించే. అందుకే అమ్మవారిని మాతృకావర్ణరూపిణీ అంటారు. అన్నీ వర్ణాలు మంత్రమయమే. మంత్రాలన్నీ వర్ణాల కూడికే కదా….
సోమవారం కార్తీకం
కార్తీకం మాకెంతో ముఖ్యమైనది. తెలుగువారికీ అందునా శివారాధకులకు, దామోధర భక్తులకు కూడా అనుకోండి. కాని మా చిన్నతనంలో ఇన్ని వివరాలు తెలీవు కదా. అయినా ఈ కార్తీకం వచ్చిందంటే హడావిడే. సోమవారాలు ఉపవాసాలు. అభిషేకాలు, శ్రీశైలం వెళ్ళటం, కృష్ణలో మునకలు, దీపాలు వెలిగించి కృష్ణలో వదలటం, గుడిలో వెలిగించే దీపాలు , నాన్నా అమ్మా శివకల్యాణములో కూర్చోవటాలు…ఒకటేమిటి… నెలంతా హడావిడే.మా నాయనగారంత కాకపోయినా మేము కుదిరినంతలో దీపాలు వెలిగించటము, నదీస్నానాలు దీపదానాలు ఇత్యాదివి చేస్తూ వచ్చాము.ఒక కార్తీకం…
ఓక కార్తీకంలో
సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం భగీరథీ ప్రక్కన కార్తీకమాసము గడుపుకునే అవకాశం జగదంబ ప్రసాదించింది. మూడు వారాల కాలం ఆ తల్లిని సేవించుకున్నా రెండు వారాలు మాత్రం గొప్ప పరీక్షా కాలమే. మొదటి వారం కేవలం టీ త్రాగి బ్రతికాను. రెండన వారం శివానంద ఆశ్రమానికి వెళ్ళాను. కేరళ సన్యాసిని ఆ మఠానికి సర్వద్యక్షతగా ఉండేది. ఆమె చాలా అహంకారి కూడా. సన్యాసిని అని, ఆశ్రమం చూస్తున్నదని గౌరవంగా ఉంటే అత్తగారి కన్నా ఎక్కువ ఆరళ్ళు పెట్టింది. …