జొన్నవిత్తులతో కాసేపు:

జొన్నవిత్తులతో కాసేపు: తెలుగు భాషకు ఉన్న ఒక విశిష్ట ఆభరణం పద్యం. ఇతర భాషలకు లేనిది తెలుగుకు మాత్రమే సొంతమైనది పద్యమేనని పెద్దలంటారు. మన తెలుగులో పద్యం మాత్రమే ప్రాచుర్యంలో ఉన్న రోజులలో పద్య వైభవం ఎంతో ఘనత కెక్కింది. రాయభార పద్యాలు ఇలా….వచనము, వచన కవిత్వం బాగా ప్రాచుర్యంలోకి వచ్చాక, పద్యం కుంటుపడింది. అందునా కొందరు పెద్దవారు  “చందస్సుఅనేదుడ్డుకర్రలో, పద్యాలనడ్డివిరుగగొడుదాం” –అనిచాటించిపద్యాలనుమూలకుతోసి వచనముకోసంఆరాటపడ్డారు. అలాంటిది ఈ కాలంలో కూడా అలవోకగా పద్యాలూ చెబుతూ, వంటికి అత్తరు…

ఉక్కిరి బిక్కిరి గా ముంచేసిన నీల

“లైంగిక విలువల పేరుతో పురుషులూ స్త్రీలూ, గురయ్యే హింస నుంచి విముక్తి పొందాలి” ఎంత బలంగా ఉన్నది ఈ మాట! ఈ ఒక్క మాట కోసమైనా నీల చదవాలి. నీల ను చదివాను. మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ హడావిడి తగ్గాకా, కొంచం టైం కుదుర్చుకొని నీల ను మొదలెట్టాను. 500 పేజీల పైనున్న ఈ నవల నన్ను ఇంతగా ఊపేస్తుందని, ఉక్కిరిబిక్కి చేస్తుందని అనుకోలేదు. అసలు పూర్తిగా చదువుతానా? అని ఒక డౌటు వుంది మొదలెట్టక ముందు….

రంగుల ప్రపంచం

చిన్నతనము నుంచి పిల్లలలో సృజనాత్మకత పెంచాలన్నా, అసలు ప్రపంచాన్ని వారికి పరిచయము చెయ్యాలన్నా రంగులు, బొమ్మలే మంచి సహాయకారి కదా! రంగుల పెన్సిళ్ళు తెల్లకాగితాలు పిల్లలని గంటల తరబడి కదలక కూర్చొబెట్టే సాదనాలు, ఉపకరణాలు. రంగులు, కాగితాల మీద గీయ్యటము, బొమ్మలు వేయ్యటములో వాళ్ళు అల్లరిని లోకాన్ని మర్చిపోతారు. ఇప్పుడు iPads వచ్చాయనుకోండి. రంగులు వెయ్యటము మూలంగా బాలలలో పరిశీలించే గుణం, ఆలోచించే విధానములో మార్పు వస్తుందని,విజ్ఞాన వికాసము కలుగుతుందని పరిశోదనలలో తేలిన విషయము. బొమ్మలు వేసే బాలలు…

పుస్తకమా ఎక్కడ నీ చిరునామా? 

పుస్తకమా ఎక్కడ నీ చిరునామా? రెండు వారాలకు మునుపు, నేను మిత్రులను అడిగిన ప్రశ్నలు, మీకు నచ్చిన నేటి కాలపు రచయితా/త్రి ఎవరు అన్ని. చాల మంది మిత్రులు సమాధానాలు చెప్పారు. ఒక్క విషయం అంతా వక్కాణిస్తున్నది నేటి యువతలో చదివే అలవాటు తప్పిందని. ఇంతకూ మునుపులా చదవటంలేదని ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది నిజమా? నేటి యువత అసలు చదవటం అన్నది లేదా? ప్రస్తుతం కాలములో  మనము చదవటం తగ్గించామా? మనలను  ప్రభావితం చేసి…

అనామిక

నీ గాఢ నిద్రలో- నా పలవరింతలకు విచ్చిన  …  నీ పెదాల చిరునగవుల వెలుగులతో,  . నా హృదయము మెరిసినది ఈ పూట! గాఢంచు నిద్రల అంచులలో నీ కలలకు రాణిగా, నీ జీవిత ప్రేయసిగా మురిసిన నా చిరు యవ్వన వెలుగుల తారాజువ్వలు ఎగిరిపోయాయి…. నేడు కలయిక  మృగ్యమై మౌనముగా….  మృత్యువు ఛాయలకు గమనము సుగమనమై సాగుతూ…. నీకు ప్రేమైక్యజీవన కలవరింతలు వివరిస్తున్నాను. స్నేహానికి, ప్రేమకు హద్దులు చెరపి గాఢంచు మమకారపు వలపులు తొడిగిన మన బందానికి…

ఆధునిక సత్రాలు-AIRBNB లో అతిధ్యం –

ఆధునిక సత్రాలు-AIRBNB లో అతిధ్యం – పూర్వం చందమామ కథలలో మనందరము చదువుకున్నాము కదండి సత్రాల గురించి. అదే నేటి ఆధునిక ముసుగేల కున్న airbnb. వివరాలలోకి వెళ్ళిపోయ్యామంటే – మేము మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ కు వెళ్ళాలన్నప్పుడు ఐదు నెలల ముందుగా హోటల్ బుక్ చేసుకునే ప్రయత్నం చేశాము. అసలు మామూలుగానే డౌన్-టౌన్ లోని హోటల్స్ లో ముఖ్యమైన రోజులలో కిటకిటలు, ఆకాశానికి ధరలు సర్వ సాధారమైన విషయం. ఈ నాలుగు సంవత్సరాలలో చూసినదేమంటే, క్యాంపస్…

స్వరాంజలి

ఉచ్శ్వాస నిశ్వాసల హంసను ఎక్కి మనఃఫలకమున మంజుల వాణివి జ్ఞానవాహినివి నీవు మాతా! మూలాధారమున ‘ష్డజమ’ రూపపు మొగ్గవు అనాహతం మీద ‘మద్యమ’మై, విశుద్ధ లోన ‘పంచమ’ముగా పవళించి సహస్రారమున ‘నిషాద’మైన నిలుచిన  స్వరరాగ మాధురివి సరిగమలతో  హంస ప్రయాణం సరస్వతికి స్వరాభిషేకం నిలిపిన  నిశ్చలముగా హంసను నిలుపును జీవిని,నీరాజనంబు నొసగగ సంగీతారాధనము జ్ఞానేశ్వరికి జరిపిన మోక్షమునకు కది కదా సుగమము సుమధుర కచ్ఛపి నాధమును హృదయమున పలికించి, హంసను అనుసంధానించి అర్చింపు సాదనకు జీవితము పండించు…

చెలియలి కట్ట 

ఊరు వాడ, పుట్ట, చెట్టు, వాన వరదై ఉప్పొంగుతున్నాయి చలికి మెల్లగా పిల్ల గాలులు నెమ్మదిగా బరువుగా ఈ గదిలో తెలియని భయాలు కనపడని గోడలు వికటంగా నవ్వుతున్నాయి సాధన భాదను వేదన మాతృ వేదన, మరణ వేదన మానసిక వేదన నీరవ నిర్జీవ ఉదయాలు ఏ అంబికా దర్బారు బత్తి వెలిగించి జీవం ఇవ్వాలి దోమలు చీమలు చుట్టూ అలుముకుంటున్నాయి పేలు ప్రవహిస్తున్నాయి వాడ బడుతున్నాను సోపు లా – ఒక ఆడ సోపులా మగ…

స్నాతకోత్సవ సరిగమలు – పరుగుల పదనిసలు 

#అక్కడ – ఇక్కడ మే,జూన్ లలో ఎక్కడ చూసినా గ్రాడ్యుయేషన్స్ లు, పిల్లలతో పెద్దల పరుగుల లుకలుకలు, పిల్లల పకపకలు కనబడుతాయి. ఐదవ తరగతి నుంచి రిసెర్చ్ వారు వరకూ. ఇక్కడ, అంటే అమెరికాలో, ఈ గ్రాడ్యుయేషన్ అన్న మాటకి విలువ ఎలా ఇవ్వాలో నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదంటే నమ్మాలి. ఎందుకంటే, మేము చదువుకునే రోజులలో, 90’s లో అన్నమాట, మాకు డిగ్రీ అయ్యాక ఒకటో రెండో సంవత్సరాలు గడిచాక నాలుగు బాచ్లల వారికీ కలిపి…

sandwich

sandwich – చిన్నప్పుడు మడి గురించి చాలా విప్లవం జరిపినా నా ధర్మపోరాటము లో నేను ప్రతిసారి “ఘోరంగా” ఓడిపోయేదాన్ని మా నాయనమ్మ చేతిలో. నా ఉదేశ్యం ‘మడి’ అన్నది శుభ్రం కోసం మొదలుపెట్టి ఉంటారు. ఆ రోజులలో పాడి – పంట, గొడ్లు – గోడా, సర్వం అక్కడే ఉండేది కదా! గచ్చు నెలలు కూడా ఉండేవి కావు కదండీ. మట్టితో అలికిన వంటగదులు, చేతులతో సమస్తం తాకటం ఉండేదేమో, అందుకే అన్నం ముట్టుకున్నా, వండినవి…

అమ్మా నిన్ను తలచి…..

అమ్మా నిన్ను తలచి….. అమ్మను తలుచుకోవటానికి నాకు ప్రత్యేకంగా ఒక రోజు అవసరములేదు. ప్రతి రోజూ ఏదో క్షణంలో ఏదో ఒక విషయములో గుర్తుచేసుకుంటునే వుంటాను. అమ్మ వస్తుందంటే ముందు మెట్టెలు కలిసిన మెత్తని అడుగుల సవ్వడి,  మెల్లని గలగలలు గాజులు సవ్వడి, నా హృదయంలో చిరుగంటలలా వినిపిస్తూనే వుంటాయి. అమ్మ గుంటూరు నేత చీరలు ఎక్కువగా కట్టుకునేది. మెత్తని ఆమె చీర కొంగు ఎన్ని సార్లు నాకు చలి తగలకూడదని కప్పిందో. బోంచేశాక అమ్మ కొంగుతో…

ఇది సమయము

ఆడపిల్లలను బ్రతకనియ్యటం లేదంటే, వాళ్ళను హింసించి చంపుతున్నారురా దేవుడా,  అంటే ముస్లీమా? హిందువా? అంటారు, అక్కడ ఒక ప్రాణమురా……. అది సరిగ్గా చూడండి! ఒక ఆడ పిల్లని ఆడపిల్లగా చూడండి! హిందువా, ముస్లిమా అని కాదు…. బలవంతులు బలహీనులను- చెరుస్తున్న దుర్ముహుర్తమిది। చెదపట్టిన న్యాయాలు, కులమతాల రొచ్చులలో స్త్రీ జాతికి వుచ్చులు తొడిగి పాత బంధాల మీద క్రొంగొత్త ఆంక్షలు తొడిగి అంగట్లో అమ్మేస్తుంటే… ఎక్కడుంది ప్రాణం విలువ? ఎక్కడుంది మానము విలువ? కలియుగమున ధర్మం నాల్గవ…