గురుకృప

1.సముద్రమంతా త్రాగేయవచ్చు మేరు పర్వతమును పెకిలించవచ్చు భగభగ మండు అగ్నిని మింగవచ్చు కానీ మనసును నిగ్రహించమెవరి తరము? 2.సింహాని బోనులో ఇరికించవచ్చు ఎడారి ఇసుకలో వరి పండించవచ్చు హిమవంతముపై అగ్ని రగిలించవచ్చు కానీ మనసును నిగ్రహించమెవరి తరము? 3.అమవాస్యరాత్రి సూర్యుణ్ణి ఉదయించవచ్చు దిక్కులను అటు–నిటూ మార్చవచ్చు అణుబాంబును అంగిట్లో మింగవచ్చు కానీ మనసును నిగ్రహించమెవరి తరము? 4. సమయాన్ని వెనుకకు త్రిప్పవచ్చు గ్రహముల నడతను మార్చవచ్చు భూమి నడతను ఆపవచ్చు కానీ మనసును నిగ్రహించమెవరి తరము? 5….

నా కోతికొమ్మచ్చి -4

జ్ఞాపకాల సందడి -4 పిడకలవేట – తీసినతాట మేము పెరిగినది తాలూకా పట్టణము వంటిదైనా, చాలా చిన్న వూరే. నాన్నగారు డిప్యూటితాసిల్‌దారు. మాకు ఎవ్వరూ తెలియకపోయినా అందరికి మేము బానే తెలుసు. మా ఇల్లు చుట్టూ వున్న ఇళ్ళ పిల్లలతో భేదాలు లేకుండా తిరిగేవాళ్ళము. ఆటలలో, చదువులలో ఒకటేమిటి… సర్వం. మా నానమ్మ నా మిత్రులను ఇంట్లో కి రానియ్యకపోతే అందరము వెనక దొడ్డోనో, నడిమి గదిలనో తినేవాళ్ళము తిండి. అంతలా కలిసితిరిగేవాళ్ళము. మా ఇంటి చుట్టూ…

కోతికొమ్మచ్చి -3

  ముక్కు చెంపలు మా బడి 5 తరగతి వరకూ మామూలు బడి వంటిది. అది వీధి బడికి ఎక్కువ, ప్రభుత్వ బడికి తక్కువ. కానీ తాలూకా సెంటరు కాబట్టి మంచి హైస్కూలు వుండేది. దాంట్లో 6 తరగతి నుంచి మొదలు. 5 తరగతి వరకూ కూడా పిల్లలు ఎక్కువ టీచర్లు తక్కువ వుండే స్కూలు. అంటే రెండు క్లాసులు ఒక టీచరు. ఫర్నీచరు వుండేది కాదు. అంతా నేల మీదే కూర్చునేవారు. ఒక్క ఐదవ తరగతిలో…

kotikomacchi-2

ఆడపిల్ల – మగాటలు: ఆటలకు మగా ఆడా వుంటాయా అసలు? వుండవు కదా! కానీ అలా కాదండోయి…. కొందరి దృష్టిలో వుంటాయి మరి. అదేమిటో చెప్పాలంటే నేను మళ్ళీ రింగులు రింగులుగా చుట్టి నా చిన్నప్పటి రోజులకు వెళ్ళాలి……. అప్పటిలో… రెండు జళ్ళతో ….. జడలకు అంటిన నూనెతో నా అందము మరుగున పడిన దుఖం లో నేనుంటే, దానికి తోడు మా నాన్నమ్మ గోల ఒకటి. చాదస్తానికి బట్ట కడితే మా నానమ్మ. పిల్లలను స్వేచ్ఛగా…

kotikomacchi

నా కోతికొమ్మచ్చి-1 చిన్నప్పుడు గురించి తలచుకుంటే నాకు ముందుగా గుర్తుకువచ్చేది ‘జడలు – ప్రహసనము’ ఆ రోజులలో ఉదయము స్కూలు హడావిడి ఒక లెవల్లో వుండేది. ఉదయమే మా నాన్నగారు 5 గంటలకు పిల్లలందరిని లేపి మంచాలు పక్కలు ఎత్తివేశేవారు. మేము అంటే, అక్కా, తమ్ముడూ నేను ముఖం కడుకొని పుస్తకాలు ముందేసుకు చదవాలి. అది ఉదయపు దినచర్యలో మొట్టమొదటి కార్యక్రమము. మాకు పరుపులతో పరచివున్న మంచాలు వుండేవి కావు. మావి అన్నీ గూడా నవారు మంచాలు….

guruvu

సుడిగుండాల సుడులతో, వరదతో ప్రవహించు నది – ఈ సంసారము। జీవుడు వరదలో కొట్టుకుపోతున్నాడు గమ్యరహితంగా, ఈతరాని జీవుడతడు ఈదలేని జీవుడతడు- ప్రవాహమున కొట్టుకుపోతున్న జీవుడతడు- వరదలో నుంచి బయటకు రాలేక తల్లడిల్లుతూ కొట్టుకుపోతున్నాడు జీవుడు- పూర్వ పుణ్యమున అమ్మవారి నామము … దొరికినది అనువుగా జీవునికి… వదలక తలచెను మంత్రమును పిలిచెను భక్తిగా అమ్మను.. నామపారాయణమన్న మంత్రం సంత్సంగమన్న మంత్రం దాసోహమన్న మంత్రం కరివరదుని కదిలించు మంత్రం.. వరదనుంచి తప్పించు మంత్రం! పరమాత్మకు తప్పదు కదా!…