దేవీం శరణమహం ప్రపద్యే

మన రుషులు దర్శనంతో గ్రహించి అందించిన జ్ఞాన సంపద అనంతము,అపారం. అందులో మన కర్మను బట్టి మనకు కొంత ఆ జ్ఞానము లభిస్తుంది. సృష్టికి పూర్వం సత్‌చిత్‌ స్వరూపము ఒకటున్నది. ఆ సత్‌చిత్‌….అంటే ఎలాంటి చలనము లేక, నిశ్చలంగా, సదా ఆనందంతో, తనలో తాను రమిస్తూ వున్న ఆ స్వరూపమునకు పేరు లేదు. ఆ పదార్థంని “పరా” అన్నారు. అది పూర్తి సచ్చితానంద స్వరూపము. ఆ పరా లో చాలా కొద్ది భాగము (కేవలం 1% అనుకోవచ్చు)…

బరువు

బరువు ప్రపంచాన్ని ఊపేస్తున్న ఒకానొక సమస్య… అది ఫలానా బరువు అని చెప్పలేము … అంటే, శరీర బరువు ఒబేసిటీ, మనసులో బరువు స్ట్రెస్, దేశాల మధ్య బరువు యుద్ధాలు, రాజకీయనాయకులకు బరువు వారి సుపుత్రులు, లేదా బంధువులు… ఇలా ఇలా… అసలు బరువు … అంటే ఏంటి? అనవసరమైన లేదా ఎక్స్ ట్రా …లేదా ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉండటము కదా, అందునా అది మనకు పనికి రానిదై ఉంటుంది. మరి పనికి రానిదాన్ని మొయ్యటమెందుకు?…

మిత్రులతో సరదాగా కాసేపు

“మీతో స్నేహం స్వల్పం మైత్రికి హృదయం ముఖ్యం అందుకే మిమ్ముల బాగా ఎరుగుదన్నది సత్యం” అన్న భుజంగరాయ శర్మ గారి మాటలు ఎంత నిజాలో నేడు నాకర్థమైయ్యింది. నిన్న మా చిన్ని కుటీరము వేదికైయ్యింది ఆ మాటలలోని నిజాలు అక్షర సత్యమని తెలుయటానికి. నిన్నటి రోజు తార్నాకా పర్ణశాలలో నవ్వుల పువ్వులు పూచాయి. మిత్రుల కబుర్లు, కౌగిలింతలు, అల్లర్లు,పాటలు, నృత్యాలు ఒకటేమిటి అన్నీనూ…సంతోషపు స్నేహ సౌగంధాలలో మా మనసులు తడిసాయి. అమృతంతో పాటు నవ్వులు పంచే మా…

కూచి గారితో కాసేపు

కూచి గారితో కలయిక- నిన్న ఒక అద్భుతమైన విచిత్రం జరిగింది. అదేమంటే…. కళ్యాణి కాశీభట్ల ఒక కవిత రాశారు, అది విచిత్రం కాదు….  దానికి ఒక అందమైన బొమ్మను కూడా కలిపి భావుకలో పోస్ట్ చేశారు…. అదీ విచిత్రం కాదు…. నాకు నచ్చి ఆ బొమ్మ గురించి వివరాలు అడగాలని ఆ ‘పిక్’ ని దాచాను… అది విచిత్రం కాదు… మీరు విసుగు పడకండి మరి …. అసలు విచిత్రమేమంటే …… ఆ చిత్రం గీచిన అద్భుతమైన…

సత్సాంగత్యము

సత్సాంగత్యము – ‘క్రియా’ అంటే పని అని కదా అర్థం. నిఘంటువు అర్థం కూడా అదే. యోగా అంటే ధ్యానము, ఔషధము; అపూర్వవస్తుప్రాప్తి అని అర్థం చెబుతారు. ఈ రెండు కలిపి “క్రియా యోగ” అన్న మాటకు అర్థం ధ్యాన మన్న పని అనుకున్నా దానికి పరమార్థం మాత్రం సమస్తం, ఫలితము అనంతం. అసలు ‘క్రియాయోగా’ అన్న మాట మనకు “ఒక యోగి ఆత్మకథ” లో పరిచయం చేయబడుతుంది. ఆ పుస్తకం ప్రపంచానికి చేసిన మహోన్నతమైన మేలు…

దీపావళి 

నిన్నటి వరకూ నాకు నేను తెలియదు నేడు నాకు నేనె కాదు ఎవ్వరూ తెలుయదు తెలిసినది ఒక్కటీ లేదు తెలుసుకొవాల్సినదెమిటో కూడా తెలియదు అనంత అజ్ఞానము అలమరింది చుట్టూ వెలుతురు నిలిచేది క్షణమే చీకటే కదా నిలిచేది సదా మనకున్న కన్ను మూసినా తెరచినా…  చికటిని తెలుకున్న, వెలుతురు కనిపించునుట …. అహమన్నది మానవ దృష్టి కన్ను మూసి చూచిన తెలియును  అసలు సత్యం అంతః కరణములు అంతఃమఖమున చూచిన చీకటిలో వెలుగురేఖలు విచ్చుకొను వాటికై అన్వేషణ అనంతమైన…

తపమేమి చేసితినో….

నేను భారతావనికి వచ్చిన వెంటనే ‘వీ.టీ సేవ’ వేసవి internsకు పర్యవేక్షకురాలిలా వెళ్ళిపోవటం జరిగింది. ఆ మధ్యలో నేనో పని చేశా. అది… ఎన్నో వేల మందిని తన రచనలతో ప్రభావితం చేస్తూ, వివిధ భాషలలో వున్న అద్భుత కవిత్వాన్ని తెలుగు భాషాభిమానులకు పరిచయం చేస్తున్న తాత్విక, సాహిత్యవేత్త, ప్రతిరోజూ ఫేసుబుక్‌ ద్వారా వివిధ విషయాలను అలవోకగా అందిస్తున్న, పరిచయం అవసరం లేని చినవీరభద్రుడు గారితో మాట్లాడటం. ఆయనకు నేను వెళ్ళే అల్లంపల్లి గురుకులం గురించి తెలుసు….

విశాఖ

అందమైన సముద్రతీరం అంతకన్నా అందమైన బీచ్ వెంబడి మార్గం, ఆ సముద్రపు వడ్డున ఒక ప్రక్కన ‘వారిజ’ ఆశ్రమము ఎక్కడ్నుంచి చూసినా కొబ్బరి చెట్ల దర్శనం కన్నులకు పండుగగా ఆకాశము ఏకమగునట్లు దివ్యదర్శనపు సాగరం ఆశ్రమంలో అందమైన కుటీరం పర్ణశాలల సోయగం వేద పాఠశాల, అంధబాలల విద్యాలయం దినమంతా భగవంతుడు శ్రుతి చేసిన హోరున సంద్రం దీటుగా హయగ్రీవాలయన వేద గానం నిండుగ కాపున పండ్ల చెట్లు ప్రాంగణం కడుపు నింపు కమ్మని బోజనపు ఇందు హరితము…

VT Seva in June – July

ఈ మధ్యన అంటే ఈ వేసవిలో అట్లాంటా వీటి సేవలో మేము చేసిన వివిధ కార్యక్రమాలలో ‘హెబిటాట్ ఫర్ హ్యుమానిటి’(Habitat for Humanity)ఒకటి. ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఇందులో భాగంగా ఈ H for H వారు గుర్తించిన దిగువ తరుగతిలో (దాదాపుగా పేదరికపు అంచున) వుండి,కుటుంబ భాద్యతలు వుండి, వారికి వచ్చే సంపాదన వారికి సరిపోక, నిలువనీడ లేని వారి కోసం ఒక ఇల్లు నిర్మించి ఇవ్వటం. ఆ ఇంటికి కావలసిన స్ధలం వీరిదే…

పదిరోజుల సంగీత మధురాలయం మా గృహం

“కొన్ని సినిమాలు చూసినప్పుడు అలా వుంటుందా? అన్న అనుమానము కలుగుతుంది”. నేటి హడవిడి చిత్రాల గురించి కాదు, మన కాశీ విశ్వనాథ గారి చిత్రాల లాంటివి. “ఒక సంగీత విద్వాంసులు…. కొబ్బరాకుల నుంచి జాలుగా జారిన నీరెండ నీడలు… మంద్రంగా శ్రుతితో తంబూర….. రాగం… వంట ఇంట్లో ఆ ఇంటి ఇల్లాలు వండుకుంటూ ఆ మంద్ర సంగీతాన్ని ఆస్వాదించటము…” ఇలాంటివి వుత్త కథలలో, విశ్వనాథ సినిమాలలోనే అని నాకో అనుమానముండేది. ఫణి గారు మా ఇంటికి రాక…