ఈ మధ్యన అంటే ఈ వేసవిలో అట్లాంటా వీటి సేవలో మేము చేసిన వివిధ కార్యక్రమాలలో ‘హెబిటాట్ ఫర్ హ్యుమానిటి’(Habitat for Humanity)ఒకటి. ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం.
ఇందులో భాగంగా ఈ H for H వారు గుర్తించిన దిగువ తరుగతిలో (దాదాపుగా పేదరికపు అంచున) వుండి,కుటుంబ భాద్యతలు వుండి, వారికి వచ్చే సంపాదన వారికి సరిపోక, నిలువనీడ లేని వారి కోసం ఒక ఇల్లు నిర్మించి ఇవ్వటం.
ఆ ఇంటికి కావలసిన స్ధలం వీరిదే (H for H). వీరికి ఇల్లు ఇచ్చినందుకు ఆ ఇంటిని పొందిన లబ్ధిదారులు ప్రతి నెల కొంత బాడుగలా H for H కు కట్టవలసివుంటుంది. ఆ విధంగా వారు కట్టే మొత్తం ఇంటి ధర సగం వరకూ వచ్చాక, ఇల్లు లబ్ధిదారుల సొంతం అవుతుంది. ఆ పద్దతిలో అపాత్రదానము లేదు, భాద్యతగాను మెసలుతారు గృహముపొందినవారు.
ఆ ఇంటిని వాలంటీరులు అంతా సైటు సూపర్వైజరు పర్యవేక్షణలో 8 వారాలలో కట్టేస్తారు.
ఇల్లు పొందె లబ్ధిదారులు ఆ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వచ్చే రిపేరులను ఎలా సరి చేసుకోవాలో నేర్చుకుంటారు.
మా వీటి సేవ అట్లాంటా చార్టరు వారు క్రిందటి ఏడాది, ఈ సంవత్సరము కూడా అందులో పాల్గొన్నారు. 8 వారాంతారాలు,ప్రతి వారాంతరము 8 గంటలు మన కమిట్మెంటు ఆ కార్యక్రమానికి. వెళ్ళిన ప్రతి వారము క్రొత్త విషయాలు తెలుసుకుంటాము మనము. నేను మొదటి వారము మాత్రమే వెళ్ళగలిగాను. మా టీం నుంచి వాలెంటీరులు ప్రతి వారము వెళ్ళారు క్రమం తప్పక.
నేను వెళ్ళిన వారము ఆ సైటుకు వెళ్ళే ముందర మాకు అక్కడ పాటించవలసిన జాగ్రత్తల గురించి వివరించారు.
తరువాత రూటుమ్యాపు ఇచ్చారు. నేను నాతో పాటు మరి ముగ్గురు మా వీటి తరుపున నలుగురము ఆ వారానికి అన్నమాట!
సైటులో అప్పటికే బేసు (పునాది)కట్టి వుంచారు. అంటే సిమెంటు బండలతో, పైన అడ్డంగా చెక్కలు అక్కడక్కడా.
ముందురోజు వాన మూలంగా ఇంటి చుట్టూ చిత్తడిగా వుంది. అందుకని ముందుగా మేము గడ్డి పరిచాము ఆ ఇంటి చుట్టూ. అటుపైన 8/6 చెక్కలను వ్యాను నుంచి దించి ఇంటికి ఫ్లోరు తయారు చేశాము అంతా. చెక్కల తోనే నేల, అరుగు, గోడలు లేపటం చేసేసరికి వంటిగంట అయ్యింది.
మా అందరికి భోజనము గుడి నుంచి వచ్చింది. మేము తిన్నా మనిపించి కొంచము నీడకు చేరాము. మాకు అప్పటివరకూ నీడ లేదు. డైరెక్టుగా ఎండలో పని చెస్తూ మాడి పోవలసి వచ్చింది.
ఉదయము 7.30కి వచ్చిన మేమంతా అప్పటికే కిందా మీదా పడుతున్నాము ఆ రోజు ఎండకు.
నాతో వచ్చిన హైస్కూలు విధ్యార్థులు మాత్రం ఉత్సాహంగా మరింత ఉరుకుల తో,పరుగులతో పనిని చాలా ఎంజాయి చేశారు. నేను కరకర మంటున్న నా కీళ్ళతో ఎలాగో కానిచ్చి గొప్ప క్రోత్త అనుభవముతో కూడిన ఆత్మవిశ్వాసముతో, వంటి నిండా నెప్పులతో ఇంటి ముఖము పట్టాను.
మిగిలిన వారాలలో విటీ నుంచి నలుగురికి తక్కవ కాకుండా విధ్యార్థులు పాల్గొన్నారు. క్రిందటి శనివారము 50 మంది వాలంటర్లుకు భోజనము వీటీ సేవ అట్లాంటా వారి తరుపున అందచేశాము. మాకు సంవత్సరములో అత్యధికంగా నమోదు అయ్యే వాలంటీరు గంటలు ఈ కార్యక్రమము నుంచే.
కొత్త విషయాలు నేర్చుకొనేందుకు కూడా ఈ కార్యక్రమము దోహదపడింది.
ఈ జాన్, జూలైలలో మేము ఇవే కాక ఒక రక్తదాన శిబిరము, రెండు సార్లు food for homeless కార్యక్రమము చేశాము. ఇదీ కాక మా రెండవ “Annual meet” చేసి క్రితం సంవత్సరము వాలంటీరులకు వచ్చిన అవార్డులు పంచి పెట్టాము.
వీటీ సేవ అమెరికాలో కొన్ని పట్టణాలలో ఎంత బలంగా వున్నా మా అట్లాంటాలో మాత్రం నిరుడే మొదలయ్యింది. అయినా మేము పూర్తి స్థాయిలో ప్రతి నెలా దాదాపు రెండు వాలంటీరు కార్యక్రమాలు చేస్తూ బుడి బుడి అడుగుల నుంచి వడివడిగా వేగం పెంచుకుంటున్నాము.
మాకు మా సియివో అయిన పరమహంస పరివ్రాజక శ్రీ చిన్నజీయ్యరు స్వామి మంగళాశాసనాలతో పాటు, ఉరుకుల పరుగుల విద్యార్థులు, మడమ తిప్పని కొందరు వాలంటీర్ల వలన ఇది సాద్యమవుతోంది. మా తదుపరి ప్రోగ్రాంలలో మీరు పాల్గొనదలిస్తే మీరు మా వాలంటీర్లతో మాట్లాడవచ్చు.
ఈ వాలంటీరు గంటలు ఇక్కడి పాఠశాలలో వుపయోగపడతాయి. అంతేకాదు వారికి ప్రభుత్వం తరుపున వచ్చే అవార్డులకీ, రివార్డులకీ, కాలేజీ కి అప్లయి చేసేటప్పడు, మీదుమిక్కిలి పూర్ణ భాద్యతాయుతమైన పౌరులుగా మసలటానికి సహయాకారి.
అట్లాంటా పరిసర ప్రాంత మిత్రులు ఆలోచించండి.
-Sandhya Yellapragada




