అక్కడ – ఇక్కడ : ఋతువులు- చెట్లు – పర్యావరణం: కాలాలు, ఋతువుల వివరాలు చిన్నప్పుడు పాఠం నేర్చుకోవటమే కానీ, అనుభవంలోకి వచ్చినది నిజానికి ఇక్కడికి వచ్చాకనే! నా సైన్స్ పాఠంలో శిశిరం, వసంతం ఇలా ఆరుకాలాల/ఋతువుల గురించి నేర్చుకున్నా, నేను పెరిగిన ఊరులో కానీ, హైదరాబాద్ లో కానీ ఋతువులలో తేడా పెద్దగా ఉండేదికాదు. మాకు వేసవిలో వేసవి సెలవలు, మామిడి పండ్లు, మల్లెపూల గుబాళింపు, ఎండలు వీటి మూలంగా వేసవి బాగా తెలిసేది. వాన…
Author: ఉహలు- ఊసులు - సంధ్య
శ్రీ చక్ర సంచారిణి
ఓంకార రూపిణీ మాతా, మలయాచలవాసినీ, సర్వ జగద్రాత్రి ప్రథమ సోపానముల సాదనల సాధ్వి, లలనా మయూరి, శ్రీ చక్ర సందాయిని పాహిమాం।। ఐంకార రూపిణీ, వాగ్దేవి, శుద్ధ సాత్వికే జనని, వేద సంభూతిని, సమరస సంగీత సంజ్ఞాతిని పాహిమాం।। హ్రీంకార రూపిణీ, కర్మద్వంసినీ, అజ్ఞానాసురాంతకి, దేవి, సింహవాహిని, జ్ఞానప్రథాయిని పాహిమాం ।। క్లీంకార రూపిణీ నీశ్వరీ, త్రిగుణీ, కామేశ్వరి, కామ సందాయిని, భగవతి, సర్వ లోకైక పావనీ పాహిమాం।। – సంధ్యా యల్లాప్రగడ
శనగ దోశ- నా అజ్ఞానము
శనగ దోశ- నా అజ్ఞానము మా పుటింట్లో మడులు, దడులు ఎక్కువ. అందుకే అసలు వంటింటి ఛాయలకు రానిచ్చేవారు కారు మా చిన్నప్పుడు. నాకు వంట రాకపోవటానికి ఇదో కారణమనుకోండి. ఈ సాకుగా నా బద్దకాన్ని కప్పేసి ఎప్పుడూ నాకు వంటరాకపోవటానికి ఈ పద్దతులే కారణమని సాదించే చాన్సు వదిలేదాని కాదు. వంటే కాదు వంటవస్తువులు కూడా ఏవి ఏమిటో తెలియని అమాయకత్వం ఎవ్వరూ గమనించ కుండా చాలా కాలము దాచాను కాని ఓక సారి అడ్డంగా…
కవనమాల
అమ్మవారికి కవనమాల 1. మహి లోన నడిపించు శక్తి నీవు మా మనసులో కొలువైన జనని నీవు అగుపించు ప్రకృతివి, అగుపడనిఅచలజవి జగతినడిపించుఆత్మనీవు అందరిలోకొలువైనపరమాత్మానీవు బ్రహ్మాండాలకుగతియునీవు!! 2. ఆది శంకరుడు బోధించిన వాణి నీవు మూకశంకరుని వాక్పటిమ నీవు భాస్కర రాయుని భాష్యాలు నీవు పరమాచార్యుణ్ణి పరమ నిష్ఠ నీవు మా వాక్,కర్మ భావనల యందు నిలిచి సదా మమ్ము నడిపించావోనీశ్వరి! 3. మూలాధారములోని మూడున్నర మూర్లు ముడుచుకున్న మహా శక్తి నీవు పరమ గురు బోధనలు…
Rotimatic-Magic
పూర్వం వంటంటే అదో ప్రహసనంలా ఉండేది. వడ్లు నూరటం నుంచి, విసరటం,దంచటం అంతా మనుష్యులే చేతులతో, రాతి పనిముట్లతోనూ (రోలు, తిరగలి,గాడి పోయ్యి, రోకలి, పొత్రం ఇత్యాదివి)చేసేవారు. ఆనాడు స్త్రీ కు రోజంతా వంటఇంట్లోనే గడిచిపోయేదంటే మరి వింత కాదు. విద్యుత్ కనిపెట్టాక, కొద్ది కొద్దిగా యంత్రాలు చోటు చేసుకుంటూ, స్త్రీలకు ఈ అవస్థను కొంత తప్పించాయి. తిరగలి బదులు వెట్ గ్రైండర్, రోళ్ళు బదులు మిక్సీ, కట్టెల పొయ్యి బదులు గ్యాస్ స్టవ్, ఎలక్ట్రిక్ పొయ్యి,…
మాయ
మాయ : కనుల ముందు పంచ రంగులు వెలసిపోవు ఈ రంగలోక మాయ సంపాదించిన ధనం తరగిపోవు ఈ సంపదోక మాయ నేటి యవ్వన పొగ్గు రేపు కరిగి పోవు ఈ యౌవనమొక మాయ నేటి బంధాలు రేపు చెదిరిపోవు ఈ బంధాలోకమయ నేటి రాజ దర్పం రేపు వేరొకరిదవును ఈ వ్యవహారమొక మాయ నేటి వెలుగులు రేపు చీకటవును ఈ రేపగలోక మాయ క్షణ క్షణపు జీవితం నిలువు మాయ మాయలకు మాయ ఈ జీవితం…
అర్ధ భాగం
నీవు కటిక చీకటిలో తచ్చాడుతుంటే ఒక చిరుదివ్వెనైనాను గ్రీష్మంలా వేగిపోతుంటే చిన్ని శీతల పవనమైనాను శిశిరం లా రాలిపోతుంటే వసంతమై తిరిగొచ్చాను కఠిన పాషాణం ల శిధిలమైపోతుంటే ఒక శిల్పమై స్వరాగాలు పలికించాను మంచుబిందువులా కరిగిపోతుంటే వసుధ నయి వడ్డిపట్టాను అలవై చెదిరిపోతుంటే చెలియలి కట్టనై చెంత నిలిచాను మౌనమై శూన్యం లోకి జారిపోతుంటే మౌనిలా నీలో అర్ధనై పరమార్ధమై నిలిచాను!! – సంధ్యా యల్లాప్రగడ
రవ్వ దోశ పెళ్ల పెళ్ల -తింటే కరకర
రవ్వ దోశ పెళ్ల పెళ్ల ,తింటే కరకర ఈ సమూహం లో చేరాక ఏవైనా కొత్త వంటకాలు నేర్చుకో వచ్చుగా అని ఆశతో మీరంతా గుమగుమతో అదర గొట్టేస్త్తున్నారు. నీకు పెద్దగా వంటల రకాలు రావు..వచ్చినతవరకు పంచుకోవాలనే ఉబలాటం తప్ప…… అందుకే బాగా త్రీవ్రంగా అలోచించి, ఛంట్టబ్బాయి లో శ్రీలక్ష్మి ని ప్రార్ధన చేసి చేసిన “రవ్వ దోశ పెళ్ల పెళ్ల , తింటే కరకర” మీ కోసం అందిస్తున్నా. . కావలసిన సరుకులు: ఒక గ్లాస్…
అక్కడ-ఇక్కడ-రోడ్స్
రోడ్స్ :అక్కడ-ఇక్కడ మా చిన్నప్పుడు మేము ఉన్న ఊరిలో ఒక్కటే విశాలమైన రోడ్ ఉండేది. అది మా చిన్నతనము, రోడు మరీ పెద్దగా అనిపించేది. ఆ రోడ్ దాటితే కానీ ఆడుకోవటానికి ఉండేది కాదు. అమ్మవాళ్ళు రోడ్ దాటనిచ్చేవాళ్ళు కాదు అంత తొందరగా, అక్కడ పెద్ద ట్రాఫిక్ ఉండకపోయినా. హైదరాబాద్ లో రోడ్సు విశాలం గురించి నాకెప్పుడు అర్థం కాదు. సగం రోడ్ చిన్న వ్యాపారాలు, సగం రోడ్ దుకాణపు దారులు… మిగిలినది ఆటో స్టాండ్.. అసలు…
రామ శబ్దం
రామ శబ్దం కడు పవిత్రం ‘రామ-రామ’ అనగానే అంతరించు అజ్ఞానం రామాయణము అది జీవన ప్రగతికి మూలం- తరచి చూడగా నది ప్రతీకాత్మ సమ్మేళం… జీవుని జీవిత సమరం.. కౌసల్య దశరథులు – రాముని మాతాపితురులగా, పంచకర్మేంద్రియ గుణము తత్త్వముల గుర్తులు, ప్రతివారికి తమ మీద అపరిమిత ప్రేమ కదా రాముడన్ననది ఆత్మ- మనలోని పరమాత్మ నందుకే రాముడు చూడగ- సర్వ జన ప్రియధాముడు ! సీత యన్న బుద్ది తోడ వివాహము జరిగెను యుక్తాయుక్తములే లక్ష్మణ…