అమెరికా లో ఆవకాయ ——————— నేను సైతం అమెరికాలో మామిడికాయను కొని తెచ్చాను.. విందు లో వాడాలని, పసందుగా బోంచేయ్యా లని, తెచ్చిన కాయని ముక్కలుగా తరిగాను, చెక్కలను వేరు చేశాను.. ట్రంప్ మీద కోపాన్ని కారంగా మార్చాను ఎర్రటి కారాని వేశాను ఒక తూకాన, చేతయి చేతకాని ఆవేశంలా మిగిలిన తెల్లని ఉప్పును అదే చేత్తో వేశాను… వడ్డించా ఘాటుగా రెండేసి చెంచాల ఆవాలు పిండిలా మార్చి, H 1 ఉద్యోగి వీసా సమస్యను.. H…
Author: ఉహలు- ఊసులు - సంధ్య
పెసరట్టు
ముడి పెసలు కడు ఒడుపుగా తెచ్చి ముచ్చటగా ముందు రోజు నానపోసి ముసలం లేని యంత్రమున పిండి గావించి మరునాడు ఉదయం పెనము సిద్ధం చేసి ముచ్చటగా ఆ పెనం మీద మూడు చుట్టులా పిండి తిప్పి మిర్చి, ఉల్లి క్యారటు మరియు జీలకఱ్ఱయు చల్లి మురిపముగా తీసి వడ్డించగా మగడు మురిసెను మోము మెరిసెను, ముక్తి తీర ఆనందముగా గానము చేసేనిట్లు “అల్లం పచ్చిమిర్చి జీలకఱ్ఱ చల్లి నాకు నచ్చేటట్లు మా ఆవిడా వేసింది ఒక…
కాలిబాట- పరుగుల మూట
కాలిబాట- పరుగుల మూట ఈ దారి ఎన్ని కాలాలని దాచినదో, ఎందరి యవ్వనాలని చూచినదో ఎందరి ఆనందాలలో మురిసినదో ఎందరి భారాలను మోసినదో ఎందరి కన్నీరు తుడిచినదో ఎందరి హృదయాలని తేలిక పరిచినదో ఎన్ని రంగులు మారినదో ఎన్ని తరాలని పలకరించినదో ఇది హరితముతో నిండి, హరిణాలతో కూడి బిగ్ క్రీక్ నది వెంట నేలమీద పాకుతూ వంతెనల క్రిందుగా వంతెనలు కలుపుతూ అల్లనల్లన సాగె అల్ఫారెట్ట కాలిబాట మా పరుగుల మూట.
గుమ్మడి పులుసు గుమగుమలు- వివాహంలో విరహాలు
గుమ్మడి పులుసు గుమగుమలు- వివాహంలో విరహాలు మిత్రులకి శుభాకాంక్షలతో మిత్రులు సోదర సమాన శ్రీ వెంకట రత్నం గారు వివాహాలలో గుమ్మడి పులుసు విషయం ప్రస్తావించాక అది చేసి కానీ మాట్లాడకూడని ఊరుకున్నాను. ఆ ముచ్చట ఇప్పటి కి కుదిరింది. అదే గుమ్మడి పులుసు చెయ్యటం. నిన్న గుమ్మడి తెచ్చి పులుసు గుమ గుమ లాడించి, మీ ముందుకు తెస్తున్నాను. మరి వివాహ విషయం ముచ్చటించకుండా ఎలాగు మీకు రెసిపీ చెప్పగలను చెప్పండి. పూర్వం పెళ్ళిళ్లు ఐదు…
గతంలో గారెలు
గారెలకు తెలుగువారికి సంబంధం అనాదిగా ఉన్నది. అసలు మాములుగా పిండివంటలు అంటే గారెలు బూరెలు అని కదా అంటారు. గారెలు ఇష్టపడని వారు ఉండరు. గుండమ్మ కథ లో జమున గారెలు వండుకోవాలనేగా వెళ్లి అసలు రహస్యం కనిపెట్టేసింది. గారెలతో పెరుగు గారెలు మరీ రుచి. ఆవడ, దహి వడ,, పెరుగుగారే పేరు ఏమైనా రుచి అదే, వస్తువు అదే… అసలు పెరుగు గారెలు చేయటం ఒక కళ. ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ గీసినట్లు, ఒక…
వంకాయోపాక్యానము-మెంతికారము
వంకాయోపాక్యానము.మెంతికారము మిత్రులకి అభినందనలు “వంకాయ వంటి కూర, శంకరుని వంటి దైవం పంకజముఖి సీత వంటి భార్య కలరే లోకమున్” ఎంత వంకాయ ‘ఆహా ఏమి రుచి’ అని చప్పరిస్తూ తిన్నా అదేమాదిరిగా తింటే ఎవ్వరికైనా వెగటువేయ్యక తప్పదు కదా. మెంతికారం పెట్టి వంకాయ చేసినా ఈ రెసిపీ తో పాటు మీకు వంకాయ అంటే నాలుక కోసికునే( తప్పుగ వాడినా అర్థం మాత్రం అదే) శ్రీవారికి వంకాయనా బాబోయ్ అన్న సందర్భం ఒకటి పంచుకుంటా. మా…
చెలి నీ స్నేహం
చెలి నీ స్నేహం _________ ఈ ఉదయపు నీరెండలా వెచ్చగా తగిలింది నీ స్నేహం! ఈ దేవగన్నేరు పువ్వుల సువాసనలా పవిత్రంగా తోచింది నీ సహవాసం ! ఈ ఏప్రిల్ చలిలా వణికించ ప్రయత్నించింది నీ కోపం ! నీ కాలి మువ్వల చప్పుడు కి తొలకరి జల్లు తో తడిసిన పుడమిలా గగురు పొడిచింది !!
అతిధిగా భరణి
మొదటి సారి వారిని 2013 లో తానా లో కలిశాను. అప్పటికి మిథునం వచ్చి, US అంతా ఢంకా మ్రోగించింది. వారిని చూడగానే, నేను చెప్పిన మాట “అద్భుతః”, అనగానే నవ్వేశారు హాయిగా. అంత నిరాడంబర సెలిబ్రిటీ మరొకరు మనకు కనిపించటము అరుదు. నిన్నటి సోమవారం భరణి గారు మా ఆహ్వానాన్ని మన్నించి మాతో గడపటానికి ఉదయమే వచ్చారు… రావటం రావటం మాకు “తిరుపతి ప్రసాదం“ అని నాచేతికి ఇచ్చారు. ఆ చైత్ర శుద్ధ తదియ నాడు,…
వెండిచీర:
వెండిచీర: ఈ ఉదయము అట్లాంటా నగరము వెండి చీరను సింగారించుకుంది- హరి నివాస పాలసంద్రము పొంగిపొరలి వచ్చినట్లుంది- కైలాసపు హరుని శిరస్సు నుంచి జాలువారిన గంగ హిమమును తోడు తెచ్చుకున్నట్లుంది- మార్గశిర పౌర్ణమి వెన్నెలలు తెరలు తెరలుగా పరుచుకున్నట్లుంది- పండు ముతైదువ పండుగకోసం వరిపిండి ఆరబోసినట్లుంది- మల్లెల వనమంతా ఓక్కసారిగా గుప్పున విచ్చికున్నట్లుంది- పత్తి పంటకాపుకొచ్చినట్లుంది- కుండలోని గడ్డపెరుగు గలగల నవ్వినట్లుంది- ఆకులురాలిన చెట్లను మంచు ఏంజిల్స వచ్చి పరామర్శించినట్లుంది- ఆకాశము నుంచి హంసలు బారులు బారులుగా…
గానగంధ్వరునితో కాసేపు –
ఎంత అద్భుతమైన మధ్యహనపు వేళ ఈ వేళ. ఇది గంధర్వ లోకమా లేక అట్లాంటానగరమా అని ఆశ్చర్య పడాలో ఏమిటో తెలియలేదు. చాలా రోజుల తర్వాత ఇంత అద్భుతమైన, ఆహ్లదకరమైన, ఆనంద కరమైన, మనసును, ఆత్మను సమ్మోహన పరచి తృప్తి కలిగిన వేళ ఈ మధ్యాహ్నం. బయట భానుడు ప్రతాపము మమ్ముల్ని ఎంత మాత్రమూ ఇబ్బంది పెట్టలేదు అంటే మరి అంతేగా జేసుదాసుగారి సుమధుర స్వరఝరిలో తడిసి ఓలలాడి, పవిత్ర ఆ ప్రవాహంలో మునకలేసి మురిసిన హృదయాలకి…