ప్రణవమందు వర్ధి ల్లు ప్రణవ రూప జననీ పలుకు సంకల్ప రూపముగ నుండు బిందురూపా ‘పరా’ వాక్కువు – చలించిన భావముల రూపము ‘పశ్యంతి’ వాక్కువైతివి. భావములైన వాక్కులు రూపము గాంచిన ‘మధ్యమా’!! వ్యక్తమైతివి ‘వైఖరి’ వాక్కుగా వాగ్దేవి – జీవుల నాల్కలందు వెలసితివి వాణిగా ఆ ప్రణవమే రూపమై నిలచిన భగవతి’ సుషుమ్నలో తిరుగాడు అగ్నితత్త్వ అంతర్వాహిని ప్రసరిస్తూ ప్రవహిస్తున్న జ్ఞానమయి నన్ను , ఈ అజ్ఞాన తిమిరం నుంచి ప్రచండ చైతన్య సుజ్ఞానానందమైన బ్రహ్మమునకు…
Category: కవిత్వం
పద్యాలు- చెణుకులు – చాటువులు.
తెలుగు భాషలో పద్యం ఒక విశిష్టమైన విశేషమైన ప్రక్రియ. పద్యం తో భాషకు ఎన్నైనా సొగసులద్దవచ్చు. ఎంత వచన కవిత్వం అలల మాదిరి సాగిపోయినా, పద్యం తెలుగు భాషకి ఉన్న అత్యుత్తమమైన ఆభరణాలలో ఒకటి! చెణుకుల పద్యాలూ, చాటువులు, తిరకాస్తు పద్యాలూ, పొడుపుకథ పద్యాలూ తెలుగులో విరివిరిగా ఉన్నా, పద్యాలను చదవటం అందరూ ఇష్టపడరు. అంతెందుకు తెలుగునాట మారుమోగి పోయిన కృష్ణ రాయబార పద్యాలు నేడు ఎక్కడా కనిపించవు, వినిపించవు. పద్యం తెలిసిన వారు క్రిందటి తరానికి పరిమితమౌతున్నారు అనిపిస్తున్నది…
పలుకుల తల్లి
పలుకు పలుకుల తల్లి పలుకు బంగారు తల్లి పలుకుల పరా తల్లి పలుకు ధాతువు వా తల్లి పలుకు మూలమైన తల్లి పలుకుల పగడపు తల్లి పలుకు పశ్యతి అనాహతమున మా తల్లి పలుకుపూబోణి పలుకు జిలుకుల వైఖరి తల్లి పలుకుటెలనాగ మా తల్లి పలుకుగా మారు మా తల్లి పలుకవదేమి ఓ తల్లి!! తలచి పిలచితి తల్లి!! నా ఆత్మనీవే తల్లి!! పలుకులాడించ దీవించె మా తల్లి!! సంధ్యా యల్లాప్రగడ
దీపావళి
నిన్నటి వరకూ నాకు నేను తెలియదు నేడు నాకు నేనె కాదు ఎవ్వరూ తెలుయదు తెలిసినది ఒక్కటీ లేదు తెలుసుకొవాల్సినదెమిటో కూడా తెలియదు అనంత అజ్ఞానము అలమరింది చుట్టూ వెలుతురు నిలిచేది క్షణమే చీకటే కదా నిలిచేది సదా మనకున్న కన్ను మూసినా తెరచినా… చికటిని తెలుకున్న, వెలుతురు కనిపించునుట …. అహమన్నది మానవ దృష్టి కన్ను మూసి చూచిన తెలియును అసలు సత్యం అంతః కరణములు అంతఃమఖమున చూచిన చీకటిలో వెలుగురేఖలు విచ్చుకొను వాటికై అన్వేషణ అనంతమైన…
అనామిక
నీ గాఢ నిద్రలో- నా పలవరింతలకు విచ్చిన … నీ పెదాల చిరునగవుల వెలుగులతో, . నా హృదయము మెరిసినది ఈ పూట! గాఢంచు నిద్రల అంచులలో నీ కలలకు రాణిగా, నీ జీవిత ప్రేయసిగా మురిసిన నా చిరు యవ్వన వెలుగుల తారాజువ్వలు ఎగిరిపోయాయి…. నేడు కలయిక మృగ్యమై మౌనముగా…. మృత్యువు ఛాయలకు గమనము సుగమనమై సాగుతూ…. నీకు ప్రేమైక్యజీవన కలవరింతలు వివరిస్తున్నాను. స్నేహానికి, ప్రేమకు హద్దులు చెరపి గాఢంచు మమకారపు వలపులు తొడిగిన మన బందానికి…
స్వరాంజలి
ఉచ్శ్వాస నిశ్వాసల హంసను ఎక్కి మనఃఫలకమున మంజుల వాణివి జ్ఞానవాహినివి నీవు మాతా! మూలాధారమున ‘ష్డజమ’ రూపపు మొగ్గవు అనాహతం మీద ‘మద్యమ’మై, విశుద్ధ లోన ‘పంచమ’ముగా పవళించి సహస్రారమున ‘నిషాద’మైన నిలుచిన స్వరరాగ మాధురివి సరిగమలతో హంస ప్రయాణం సరస్వతికి స్వరాభిషేకం నిలిపిన నిశ్చలముగా హంసను నిలుపును జీవిని,నీరాజనంబు నొసగగ సంగీతారాధనము జ్ఞానేశ్వరికి జరిపిన మోక్షమునకు కది కదా సుగమము సుమధుర కచ్ఛపి నాధమును హృదయమున పలికించి, హంసను అనుసంధానించి అర్చింపు సాదనకు జీవితము పండించు…
చెలియలి కట్ట
ఊరు వాడ, పుట్ట, చెట్టు, వాన వరదై ఉప్పొంగుతున్నాయి చలికి మెల్లగా పిల్ల గాలులు నెమ్మదిగా బరువుగా ఈ గదిలో తెలియని భయాలు కనపడని గోడలు వికటంగా నవ్వుతున్నాయి సాధన భాదను వేదన మాతృ వేదన, మరణ వేదన మానసిక వేదన నీరవ నిర్జీవ ఉదయాలు ఏ అంబికా దర్బారు బత్తి వెలిగించి జీవం ఇవ్వాలి దోమలు చీమలు చుట్టూ అలుముకుంటున్నాయి పేలు ప్రవహిస్తున్నాయి వాడ బడుతున్నాను సోపు లా – ఒక ఆడ సోపులా మగ…
ఇది సమయము
ఆడపిల్లలను బ్రతకనియ్యటం లేదంటే, వాళ్ళను హింసించి చంపుతున్నారురా దేవుడా, అంటే ముస్లీమా? హిందువా? అంటారు, అక్కడ ఒక ప్రాణమురా……. అది సరిగ్గా చూడండి! ఒక ఆడ పిల్లని ఆడపిల్లగా చూడండి! హిందువా, ముస్లిమా అని కాదు…. బలవంతులు బలహీనులను- చెరుస్తున్న దుర్ముహుర్తమిది। చెదపట్టిన న్యాయాలు, కులమతాల రొచ్చులలో స్త్రీ జాతికి వుచ్చులు తొడిగి పాత బంధాల మీద క్రొంగొత్త ఆంక్షలు తొడిగి అంగట్లో అమ్మేస్తుంటే… ఎక్కడుంది ప్రాణం విలువ? ఎక్కడుంది మానము విలువ? కలియుగమున ధర్మం నాల్గవ…
వాణిని నమ్మితి
వాణిని నమ్మితి మృదుల గీతోత్పల మంజుల మృందగ సుశీల నాద విపంచి రవముల గానము చెయ్యగ వాణిని నమ్మితి సుమనోహర దృతుల సుశిత గంభీర ఝరుల కవనము రచియింపగ వాణిని నమ్మితి మోహన సావేరి పున్నాగవరాళి, సింధుభైరవి, తోడి లలో మృధు మధుర రాగాలాపనలతో వీణను మీటగ వాణిని నమ్మితి ప్రాక్దిశన వెలుగు బాలారుణ భాస్కర సుప్రకాశ జ్యోతుల యందు అమ్మను దర్శించి ప్రార్థన సేయ్యగ వాణిని నమ్మితి సకల చరాచరములలో జాగ్రుత్, స్వప్న, సుషుప్తి, తుర్యావస్థల…
శివారాజ్ఞీ-నీశ్వరీ
1. భక్తులను రక్షింప భవాని కదిలె కదలీ వనమునుంచి, దానవులను దుంచె దుర్గమ్మ చింతలుబాయగ చింతామణి గృహమునుంచి- 2. వెడలె వారాహి తోడుగ సుధలు పంచి సాదకుల జీవన సాపల్య మందించ వెడలి వచ్చె నంబ సుధాసాగర మధ్య నుంచి, నట్టి శ్రీచక్ర రధ వాసిని శరణనెదను!! 3. తల్లి పాదములాశ్రయించుటనొకటే మొక్షమార్గము! అంబ కరుణార్ధ దృష్టి చేత కరుగు జన్మ జన్మల కర్మలు! అమ్మ కొనగోటి కాంతి చాలు కోటి సూర్యులనెలిగించునట్టి …