Nivedana

ప్రణవమందు వర్ధి ల్లు ప్రణవ రూప జననీ

పలుకు సంకల్ప రూపముగ నుండు బిందురూపా ‘పరా’ వాక్కువు –

చలించిన భావముల రూపము ‘పశ్యంతి’ వాక్కువైతివి.

భావములైన వాక్కులు రూపము గాంచిన ‘మధ్యమా’!!

వ్యక్తమైతివి ‘వైఖరి’ వాక్కుగా వాగ్దేవి –

జీవుల నాల్కలందు వెలసితివి వాణిగా

ఆ ప్రణవమే రూపమై నిలచిన భగవతి’

సుషుమ్నలో తిరుగాడు అగ్నితత్త్వ అంతర్వాహిని

ప్రసరిస్తూ ప్రవహిస్తున్న జ్ఞానమయి

నన్ను , ఈ అజ్ఞాన తిమిరం నుంచి

ప్రచండ చైతన్య సుజ్ఞానానందమైన బ్రహ్మమునకు నడుపు బ్రహ్మీ ….

ఆత్మనివేదనము స్వీకరించవే భారతీ.

సంద్యా యల్లాప్రగడ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s