ఆది శంకరులు – అపర శంకరులు అధ్వైతం ప్రతిపాదించి నలుమూలలా, అణువణువుగా భారతావని యంతటా వ్యాప్తి చేసిన ఉద్ధారకులు! వింత వింత పోకడలతో సనాతన ధర్మమునకు ముప్పు వాట్టిల్లు సమయాన సత్యదండం చేతబూని జాతికి ధర్మభిక్ష చేసిన సత్యవాది! వేద, వేదాంగములకు, ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రాలకు సరళ వ్యాఖ్యలతో భాష్యములు రాసి జాతికి జ్ఞాన భిక్ష చేసిన జ్ఞానవాది! హిందూ దేశానికి నలుదిక్కూలా నాలుగు మఠాలను దీపస్తంభములా నిలిపి,ధర్మ రక్షణకు దిక్చూచి గా నిలచిన ధర్మవాది! సర్వ దేవతా,…
Category: కవిత్వం
శ్రీ చక్ర సంచారిణి
ఓంకార రూపిణీ మాతా, మలయాచలవాసినీ, సర్వ జగద్రాత్రి ప్రథమ సోపానముల సాదనల సాధ్వి, లలనా మయూరి, శ్రీ చక్ర సందాయిని పాహిమాం।। ఐంకార రూపిణీ, వాగ్దేవి, శుద్ధ సాత్వికే జనని, వేద సంభూతిని, సమరస సంగీత సంజ్ఞాతిని పాహిమాం।। హ్రీంకార రూపిణీ, కర్మద్వంసినీ, అజ్ఞానాసురాంతకి, దేవి, సింహవాహిని, జ్ఞానప్రథాయిని పాహిమాం ।। క్లీంకార రూపిణీ నీశ్వరీ, త్రిగుణీ, కామేశ్వరి, కామ సందాయిని, భగవతి, సర్వ లోకైక పావనీ పాహిమాం।। – సంధ్యా యల్లాప్రగడ
కవనమాల
అమ్మవారికి కవనమాల 1. మహి లోన నడిపించు శక్తి నీవు మా మనసులో కొలువైన జనని నీవు అగుపించు ప్రకృతివి, అగుపడనిఅచలజవి జగతినడిపించుఆత్మనీవు అందరిలోకొలువైనపరమాత్మానీవు బ్రహ్మాండాలకుగతియునీవు!! 2. ఆది శంకరుడు బోధించిన వాణి నీవు మూకశంకరుని వాక్పటిమ నీవు భాస్కర రాయుని భాష్యాలు నీవు పరమాచార్యుణ్ణి పరమ నిష్ఠ నీవు మా వాక్,కర్మ భావనల యందు నిలిచి సదా మమ్ము నడిపించావోనీశ్వరి! 3. మూలాధారములోని మూడున్నర మూర్లు ముడుచుకున్న మహా శక్తి నీవు పరమ గురు బోధనలు…
మాయ
మాయ : కనుల ముందు పంచ రంగులు వెలసిపోవు ఈ రంగలోక మాయ సంపాదించిన ధనం తరగిపోవు ఈ సంపదోక మాయ నేటి యవ్వన పొగ్గు రేపు కరిగి పోవు ఈ యౌవనమొక మాయ నేటి బంధాలు రేపు చెదిరిపోవు ఈ బంధాలోకమయ నేటి రాజ దర్పం రేపు వేరొకరిదవును ఈ వ్యవహారమొక మాయ నేటి వెలుగులు రేపు చీకటవును ఈ రేపగలోక మాయ క్షణ క్షణపు జీవితం నిలువు మాయ మాయలకు మాయ ఈ జీవితం…
అర్ధ భాగం
నీవు కటిక చీకటిలో తచ్చాడుతుంటే ఒక చిరుదివ్వెనైనాను గ్రీష్మంలా వేగిపోతుంటే చిన్ని శీతల పవనమైనాను శిశిరం లా రాలిపోతుంటే వసంతమై తిరిగొచ్చాను కఠిన పాషాణం ల శిధిలమైపోతుంటే ఒక శిల్పమై స్వరాగాలు పలికించాను మంచుబిందువులా కరిగిపోతుంటే వసుధ నయి వడ్డిపట్టాను అలవై చెదిరిపోతుంటే చెలియలి కట్టనై చెంత నిలిచాను మౌనమై శూన్యం లోకి జారిపోతుంటే మౌనిలా నీలో అర్ధనై పరమార్ధమై నిలిచాను!! – సంధ్యా యల్లాప్రగడ
రామ శబ్దం
రామ శబ్దం కడు పవిత్రం ‘రామ-రామ’ అనగానే అంతరించు అజ్ఞానం రామాయణము అది జీవన ప్రగతికి మూలం- తరచి చూడగా నది ప్రతీకాత్మ సమ్మేళం… జీవుని జీవిత సమరం.. కౌసల్య దశరథులు – రాముని మాతాపితురులగా, పంచకర్మేంద్రియ గుణము తత్త్వముల గుర్తులు, ప్రతివారికి తమ మీద అపరిమిత ప్రేమ కదా రాముడన్ననది ఆత్మ- మనలోని పరమాత్మ నందుకే రాముడు చూడగ- సర్వ జన ప్రియధాముడు ! సీత యన్న బుద్ది తోడ వివాహము జరిగెను యుక్తాయుక్తములే లక్ష్మణ…
అమెరికా లో ఆవకాయ
అమెరికా లో ఆవకాయ ——————— నేను సైతం అమెరికాలో మామిడికాయను కొని తెచ్చాను.. విందు లో వాడాలని, పసందుగా బోంచేయ్యా లని, తెచ్చిన కాయని ముక్కలుగా తరిగాను, చెక్కలను వేరు చేశాను.. ట్రంప్ మీద కోపాన్ని కారంగా మార్చాను ఎర్రటి కారాని వేశాను ఒక తూకాన, చేతయి చేతకాని ఆవేశంలా మిగిలిన తెల్లని ఉప్పును అదే చేత్తో వేశాను… వడ్డించా ఘాటుగా రెండేసి చెంచాల ఆవాలు పిండిలా మార్చి, H 1 ఉద్యోగి వీసా సమస్యను.. H…
పెసరట్టు
ముడి పెసలు కడు ఒడుపుగా తెచ్చి ముచ్చటగా ముందు రోజు నానపోసి ముసలం లేని యంత్రమున పిండి గావించి మరునాడు ఉదయం పెనము సిద్ధం చేసి ముచ్చటగా ఆ పెనం మీద మూడు చుట్టులా పిండి తిప్పి మిర్చి, ఉల్లి క్యారటు మరియు జీలకఱ్ఱయు చల్లి మురిపముగా తీసి వడ్డించగా మగడు మురిసెను మోము మెరిసెను, ముక్తి తీర ఆనందముగా గానము చేసేనిట్లు “అల్లం పచ్చిమిర్చి జీలకఱ్ఱ చల్లి నాకు నచ్చేటట్లు మా ఆవిడా వేసింది ఒక…
కాలిబాట- పరుగుల మూట
కాలిబాట- పరుగుల మూట ఈ దారి ఎన్ని కాలాలని దాచినదో, ఎందరి యవ్వనాలని చూచినదో ఎందరి ఆనందాలలో మురిసినదో ఎందరి భారాలను మోసినదో ఎందరి కన్నీరు తుడిచినదో ఎందరి హృదయాలని తేలిక పరిచినదో ఎన్ని రంగులు మారినదో ఎన్ని తరాలని పలకరించినదో ఇది హరితముతో నిండి, హరిణాలతో కూడి బిగ్ క్రీక్ నది వెంట నేలమీద పాకుతూ వంతెనల క్రిందుగా వంతెనలు కలుపుతూ అల్లనల్లన సాగె అల్ఫారెట్ట కాలిబాట మా పరుగుల మూట.
చెలి నీ స్నేహం
చెలి నీ స్నేహం _________ ఈ ఉదయపు నీరెండలా వెచ్చగా తగిలింది నీ స్నేహం! ఈ దేవగన్నేరు పువ్వుల సువాసనలా పవిత్రంగా తోచింది నీ సహవాసం ! ఈ ఏప్రిల్ చలిలా వణికించ ప్రయత్నించింది నీ కోపం ! నీ కాలి మువ్వల చప్పుడు కి తొలకరి జల్లు తో తడిసిన పుడమిలా గగురు పొడిచింది !!