sanchika.com/adhyatmikam-bhakti-okati-kaadaa/
Category: మనసులో మాటలు
అమ్మా
చేతనవు, స్వయం ప్రకాశ చైతన్యము !! జగతుకు కారణము, పోషణ నీవు!! ధారుణా యన్న అజ్ఞానము నీవే, జ్ఞానము నొసగు మహా సరస్వతినీ నీవే!! అన్నింటిని స్వహాచేయు కాలము, అన్నింటిని లయము చేయు రాత్రివీ నీవే!! కాళరాత్రివి, మహారాత్రి మోహరాత్రివి నీవు!! ప్రజలను తిరిగి తిరిగి మోహింపచేయు మహామాయవు!! ఉత్తముల చెంత లక్ష్మివి అధముల ఇంట అలక్ష్మివి నీవే! బుద్ధిమంతునిలో మేదవు.. సత్పురుషులలో హృదయములో తెలివి నీవే!! స్త్రీలకు బిడియపు రూపమైన లజ్జవు నీవు!! సంసారములో మునిగే…
నా మానసము
నేటి నా మానసం అమ్మా! జగన్మాతా!! ఈ జీవితం నిజమని ఈ శరీరం శాశ్వతమని వంటిని సువాసనలతో కంటిని కాటుకలతో , పెదవులకు రంగులతో, పాదములకు లత్తుకలతో , అలంకరించి మురిసే అజ్ఞానులము…. ఒకతెల్లని వెంట్రుక కనపడితే తల్లడిల్లి ఒక చిన్న ముడత కనపడితే గింజుకొని క్రిందా మీదా పడి వ్యాకులపడి…. శరీరమే జీవితమని, మరి యోక చింతన లేక వగచే మూఢులము!! కనపడిని వయసును కప్పి, కనపడే శరీరానికి హంగులుదిద్దు జడమైన చర్మానికి రంగులు దిద్ది…
అమ్మకు నివేదన
అమ్మకు నివేదన: నవ రంద్రాలతో కూడిన కుండ ఇది. లోపలి దీపపు కాంతి ఈ రంధ్రాలగుండా ప్రసరిస్తున్నది. కాని చుట్టూ వున్న మాయను వెలుతురుగా భావించు అజ్ఞానపు జీవినై లోపలి వెలుతురు గమనించలేకుంటి! అమ్మా నీ దాసులము మమ్ము ఈ మాయనుంచి పెకిలించు నీ నామ గండ్రగొడ్డలితో ఒసంగుము శివసానిధ్యమును- అహకరించు మానవులవు పశుబుద్ది తో మెసలు మూర్ఖులము పశుపతి సగభాగానివి జననీ మమ్మాడించుము నీ కనుసైగన- మామనస్సు పరమకోతి. సకల చరాచరమును ఆడించెటి ఆటగత్తేవు నీవు…
చరైవేతి
నమస్తే చలి అణువణువు ప్రాకి స్థంభిస్తూ హృదయా మున్నా, నిశ్చలమై నిలవ దిగులు పడుతున్నప్పుడైనా జీవితాని వెలుగు కొరకు జగన్మాత దివ్య కాంతి కొరకు తపిస్తున్న క్షణానా… మిగులు దుఖం… ధైర్యాన్ని హరిస్తున్నా… చరైవేతి …చరైవేతి… ఎవరు మెచ్చారని సూర్యడు పోషకుడయ్యేనీ భువికి? నెవరు తలచారని మృదల వెన్నెలనందిచను రాకా చంద్రుడు… అందుకే చరైవేతి.. చరైవేతి పుష్పాలు వికసించి సువానలు చల్ల, చల్సలని సమీరము మరులు కొలుపు ఎవరు జీతమిచ్చునని వర్షమభిషేకించు ఫృధ్విని? చరైవేతి.. చరైవేతి… మధువునందించు…
ఆంధ్ర పథం -నా సమీక్ష
చరిత్ర చదవటం ఎందుకు? దానికి సమాధానం కన్నా ముందు అసలు ఒక విషయం చెప్పండి…. బాగా సంపద ఉన్నవారి పిల్లలలో కనిపించే మంచి,గొప్ప లక్షణం ఏమిటి? ఆత్మవిశ్వాసం ! గమనించారా? వారి ఆత్మ విశ్వాసం…. అది వారి సంపద మూలంగానే కదా! అలాగే గొప్ప చరిత్ర వారసత్వ సంపదగా ఉన్న జాతిలో కనపడేది కూడా ఆత్మ విశ్వాసమే! ప్రపంచ దేశాలలో ఘన చరిత్ర వున్న రాజ్యాల పద్దతి, పస్తుత వారి విధానాలలో మనము గమనించవచ్చు. తమ జాతి…
అద్భుతమైన అలంపురం.
అద్భుతమైన అలంపురం. భారతావనిలో అమ్మవారు అష్టాదశ (18) శక్తి పీఠాలలో నెలకొని, భక్తులను అనుగ్రహిస్తుంది. ఆ అష్టాదశ పీఠాలలో అత్యంత శక్తివంతమైన పీఠంగా పేరు పొందిన క్షేత్రం అలంపురం. అలంపురం హైదారాబాదు కు 230 కిలోమీటర్ల దూరంలో, కర్నూల్ కు 20 కి.మీ దూరం లో తెలంగాణ రాష్ట్రము లో ఉంది. అలంపురం కి మాకు ఉన్న సంబంధం చాలా పాతది. మేము మా చిన్నతనంలో నివసించిన కొల్లాపూర్ కు ఈ అలంపురం చాలా దగ్గర గా…
My review
చిన్న కథలు చదవటానికి బాగుంటాయి… త్వరగా, చకచకా చదివేసి, చదివిన కథలలో నచ్చినవి మననం చేసుకోవటం మంచి అనుభూతి. అందునా మంచి కథ చదివితే ఆ అనుభూతి రసానుభూతి. మరి మంచి కథలు అన్ని ఒక్క దగ్గర కూడి ఒక పుస్తకం లా వస్తే…. అది మరింత మధురమే కదా! కథలో – నిర్మించిన వస్తువు, కథా గమనం,కథలోని పాత్రలు, ఔచిత్యం, సమస్యను వివరించటం, కొన్ని సందర్భాలలో పరిష్కారము సూచించటం ఇత్యాది లక్షణాలు కథను చదువరులకు గుర్తుండేలా…
ఇనుపముక్కల ఇడ్లీలు
‘ఒకటి రెండు చెడితేగాని వైద్యుడు కాదు’అని సామెత. ఆ ఒకటి రెండుసార్లకి మాత్రం పడ్డవారి గోల పరమాత్మకే ఎరుక. విషయము ఎదైనా కానీయ్యండి. అందుకే ఎప్పుడు ఒకటి రెండు ప్రయోగాలు శత్రువుల మీదే కానీస్తే కనీసం మన కసిన్నా తీరుతుంది. అంటే వంటైనా, మరోటైనా అని నా భావన. కానీ మరీ అత్తగారింట్లోకి అడుగు పెట్టగానేనంటే ప్రయోగాలంటే మాత్రం పరువు పోతుంది. ముందు ఏ తమ్ముడి మీదో అయితే మరోలా వుంటుంది. కానీ నా జాతకములో శని…
బ్లౌజులు ఫ్యౌష్లన్లు
ఒక పెళ్ళికి వెళాల్సి వచ్చింది. ఎటైనా వెళ్ళటమంటేనే భయంగా ఉంటోంది. మరీ ముఖ్యంగా పెళ్ళి అంటేనూ ఇంకా భయం. ఒక చీరతో అవదు. అంటే కనీసం ఒక నాలుగైదయినా కావాలి. వాటికి మాచింగ్ బ్లౌసులు తప్పక ఉండాలి. అవి కూడా నేటి లేటెస్ట్ ఫ్యాషన్వ్ అయి ఉండాలి. లేకపోతె చిన్న చూపుగా ఉంటుంది నలుగురిలో. ఎలాంటి బ్లౌసుల ఫ్యాషన్ నడుస్తోందో ఏంటో నేటి కాలంలో, తెలియకుండా ఉందిగా. పారిస్ లో ఫ్యాషన్లు రోజు రోజూ కీ మారిపోతాయని…