నేటి నా మానసం
అమ్మా! జగన్మాతా!!
ఈ జీవితం నిజమని
ఈ శరీరం శాశ్వతమని
వంటిని సువాసనలతో
కంటిని కాటుకలతో ,
పెదవులకు రంగులతో,
పాదములకు లత్తుకలతో ,
అలంకరించి
మురిసే అజ్ఞానులము….
ఒకతెల్లని వెంట్రుక కనపడితే
తల్లడిల్లి
ఒక చిన్న ముడత కనపడితే
గింజుకొని
క్రిందా మీదా పడి వ్యాకులపడి….
శరీరమే జీవితమని,
మరి యోక చింతన లేక వగచే
మూఢులము!!
కనపడిని వయసును కప్పి,
కనపడే శరీరానికి హంగులుదిద్దు
జడమైన చర్మానికి రంగులు దిద్ది
అరువు అందాలని నిజమని తలచి
మతైక్కిన జడులము!!
లేనివి చూపించి, మత్తులో పడవేసి
క్షణికమైన యవ్వనాన్ని,
క్షణభంగురమైన కృతిమ సుఖాన్ని
నిజమని భ్రమసి…. మాయకు లొంగి,
సర్వుము నే నని భ్రమసి నీ నామము మరిచెము !
నీ నామరూపములు గానము చేసి,
కొంత జ్ఞానముదయించినా,
ప్రస్తుత్త స్థితి శాశ్వతం కాదని
తెలినా,
మనసుకు అత్తుకుపోయిన వదలని జన్మజన్మల పెంకుల అవిద్య తొలిగే మార్గమేల?
పంకంలో దొరలే వరాహములా
బూడిదలో పొరలే శునకములా
తిరిగి తిరిగి మాయను అంటుకుపోతిమి కదమ్మా!!
ఆత్మైక రూపిణివైన నిను కనుగొనుటెట్లు?
నీ అపార కరుణతో మాత్రమేనది సాధ్యం!!
నా నడత నడక నీ దశగా, దిశగా మరల్చుమమ్మా!!
నిన్ని నమ్మితి- నాకికెమరి తెలియదు నీశ్వరీ!!