అమ్మ….

 లలితా సహస్రనామాలలో మొదటి నామం  శ్రీమాతా….  అమ్మ అంటే తొలి అని అర్థం కదా. అమ్మతనం కన్నా కమ్మనైనది లేదు సృష్టిలో.  ఈ సృష్టిని సృష్టించిన అమ్మతనం ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగితే దానికి సమాధానమే విశ్వజనని… జిల్లెళ్ళమూడిలో వెలసి సమస్త జీవులకు తల్లిగా వెలుగొందినది “అమ్మ”… ఎన్నోమార్లు ఎన్నో సందేహ ప్రాణులకు సంపూర్ణత్వమే అమ్మ అని జిల్లెళ్లమూడిలో వెలసిన అమ్మ నిరూపించింది. అయినా దైవత్వం అనేది మన మానవ బుద్దికి అందగలిగేదా???? అయిన అది అవగతమగుట కేవలం అమ్మ కృప వల్లనే కదా…

సత్సాంగత్యం

శంకర భగవత్పాదుల వారు రచించిన మోహముగ్ధరంలో ఒక శ్లోకం మనకు సత్సాంగత్యము గురించి చెబుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః || సత్పురుష సాంగత్యము వలన భవబంధములు తొలగును. బంధములు తొలగినచో మోహము నశించును. మోహము నశించగా స్థిరమైన జ్ఞానం ఏర్పడును. స్థిరజ్ఞానం ఏర్పడగా జీవన్ముక్తి కలుగును.దీనికే మనకు సజ్జనులతో సాంగత్యము అవసరం.ఏది లభించినా సజ్జనులతో మాత్రం సాంగత్యము దొరకటం అంత తేలికకాదు. అలాంటిది, మంచి మిత్రులు సజ్జనులు, మనలను మంచి వైపు…

అమ్మఆలోచనలు

అమ్మఆలోచనలు సంసారము లంపటమని అంటారు పెద్దలు. సుఖభోగాల పై ఆసక్తి, పేరు ప్రతిష్టలపై మక్కువ, తమతర బేధాలు సంసారులకు సామాన్య లక్షణాలు. ఆధ్యాత్మిక సాధనకు ఇవి అడ్డంకులని, సంసారము వదిలి పోవాలని లేకపోతే సాధన మృగ్యమని మనకో నమ్మకము కూడా ఉంది.అంటే సంసారులకు, గృహస్తుకు తరించే మార్గమే లేదా? గృహస్తు సమాజానికి ముఖ్యమైన వారు కదా. వారే సమాజానికి వెన్నెముక, ముఖ్యాధారం. వారు సర్వసంగ పరిత్యాగం చెయ్యటము సులభం కాదు. మరి తరించటానికి సంసారులకు అడ్డంకులుంటే మార్గమేమిటన్న…

కాశ్మీర్ ఫైల్స్ #kashmirfiles

మేము అట్లాంటా రాక పూర్వం సైప్రస్‌ లో ఉండేవాళ్ళము. అదో చిన్న దీవి/దేశం.అందమైన ఆ దీవిలో భారతీయ మిత్రులలో కొందరు నాతో చాలా ప్రేమగా ఉండేవారు. వారిలో దీపిక ఒకరు. దీపికను మొదట నేను చూసినప్పుడు నన్ను ఆకర్షించినది ఆమె చెవుల నుంచి పొడుగ్గా వ్రేలాడుతున్న బంగారు గొలుసులు. ఎర్రటి యాపిల్ పండులా ఉండే ఆమె, ముద్దులొలికే వారి పాప మా అందరికీ చాలా ప్రత్యేకంగా కనిపించేది. ఆమె చెవి గొలుసులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయనటంలో అతిశయోక్తి…

అమ్మఆలోచనలు

అమ్మఆలోచనలు “నోటికి రెండు ధర్మాలున్నాయి ఒకటి తినటం. రెండు శబ్ధం చెయ్యటం” అన్నది అమ్మ. మానవులమైన మనం నోటిని దేనికి వాడుతున్నాము?ఆ శబ్దాలు ఎటు వంటి శబ్దాలు? పరమాత్మను పంచేంద్రియాల ద్వారా కూడా సేవచెయ్యాలని గురువులు చెబుతారు. అదే భాగవతము కూడా చెబుతుంది. మనందరము భగవంతునికి షోడష లేదా పంచ ఉపచారాలు చేస్తాము.పుష్పం, పత్రం, దీపం, ధూపం, నైవెద్యం. ఇవే కదా. ఇది మనకు తెలిసిన పూజ. కాని భాగవతము చెప్పే పూజ, అదే ప్రహ్లాదుుకు కూడా…