Bali day1

ప్రయాణములో పదనిసలు -7 బాలిలో మేము మేము వైజాగు నుంచి సింగపూరు మీదుగా ఇండోనేషియాలోని బాలి ద్వీపానికి వెళ్ళాము. అక్కడ మా క్రిస్మస్ సెలువలు గడపాలని మా ఉద్దేశము.  వైజాగులో విమానము ఎర్రబస్సును పోలిన  అనుభవమిచ్చినా, బాలిలో మాత్రం స్వాగతం అద్భుతంగా వుంది.  మేము వుండే ‘గ్రాండు హయత్తు’ వారు మా కోసం కారు పంపారు. మేము ఆ దీవిలో వున్నన్ని రోజులు మాకు ఇలలో కలలా, కలలో కల్పనలా, వెరసి భూతల స్వర్గంలా అనిపించిన మాట…

సంసారములో సరిగమలు

రెండు రోజులుగా జర్వం.  మూడో రోజుకు అసలు లేవలేకపోయాను. ఉదయమే లేచి జపతపాదులతో పాటూ కాఫీ టిఫినూ రెడి అయ్యాక, అప్పుడే నిద్ర లేచి వచ్చే పతి మహారాజు సేవలకు అంతరాయము కలిగింది. ఉదయము లేస్తే నాకు విపరీతముగా చలివేసి అలానే పడుకుండిపోయా.  ఇతను మాములుగా 9దింటికి లేచి నేను లేవకపోవటము గమనించి అడిగాడు’లేవలేదేమిటి?’ అని నేను మూలుగుతూ ‘చలిగా వుంది. జర్వం’ అన్నా.  తను తెగ ఫీల్ అవుతూ ’అయ్యో పడుకో. నే కాఫీ టిఫిన్ల…

రోలు పచ్చడి

భూమి గుండ్రముగా వుంటుంది అంటారు కదా. మనము చిన్నప్పుడు సైన్సు లో చదువుకున్నాముగా ఆ విషయము. అప్పుడంటే ఏమో ప్రయోగాలు చేయ్యించేవారు కూడానూ తరగతి గదిలో.  నేడు అలా కాకుండా ప్రతి పది సంవత్సరాలకూ మారుతున్న జాకెట్ల చేతుల కొలత, మెడ వంపులతో కూడా మనకు గుండ్రముగా వుంటుదని, మొదలయ్యిన చోటే చేరుతుందని తెలుస్తుంది. నిర్ధారణకు మనకు బోలెడు ఉదాహరణలు వున్నాయి మన చుట్టూ కూడా.  అయితే ఈ మధ్య ఆ విషయము మరల మరల నా…

గణపతి ముని

యోగులు- భూమిపై పరమాత్మ స్వరూపములు: నాయన కావ్యకంఠ గణపతి ముని తపఃసంపన్నులైన యోగులు, సిద్ధ యోగులు, పరమాత్మ ప్రతినిధులు. వారు ఏ శరీరమునాశ్రయించినా పరిపూర్ణ పరమాత్మ ను ఆవిష్కరిస్తారు. భారతదేశ ఆధునిక చరిత్రలో ఇటు వంటి మహానుభావుడు,మహాముని , తపోనిరతుడు కనపడరు. ఆయన మహాతపస్వి. భారతమాత దాస్య శృంకలాలు తెగటానికి తపస్సు చేశారు. తన తపఃశక్తితో మౌన స్వామి అని పేరు పొందిన బ్రాహ్మణస్వామికి భగవాను రమణ మహర్షి అని నామకరణము చేసి,వారి చేత మౌనము మాన్పించారు….

Sunday game

ఆదివారం ఆట క్రికెటు అంటే మనవాళ్ళు కళ్ళూ చెవులు అప్పచెప్పేస్తారు. అదీ అలా ఇలా కాదు.  ప్రక్కగా అణుబాంబు వేసినా వారి కాలి మీద వెంట్రుక కదలదు వీళ్ళకి  అంత శ్రద్ధ భక్తి వుంటుంది ఆట మీద.  మా శ్రీవారు అలా వళ్ళు మరచి, క్రికెటుకై ఆస్తి రాసిచ్చే సందర్భాలు కోకొల్లలు. ఎదో నేను ప్రక్కనుండి కాచుకోబట్టి బ్రతికి బట్టకడుతున్నాము ఇలా.   ఆయన ఆట చూస్తే మనవాళ్ళు గెలవరని నాకో గట్టి నమ్మకము. దానికి కారణాలున్నాయి. పూర్వం…