అమ్మఆలోచనలు

అమ్మఆలోచనలు “నోటికి రెండు ధర్మాలున్నాయి ఒకటి తినటం. రెండు శబ్ధం చెయ్యటం” అన్నది అమ్మ. మానవులమైన మనం నోటిని దేనికి వాడుతున్నాము?ఆ శబ్దాలు ఎటు వంటి శబ్దాలు? పరమాత్మను పంచేంద్రియాల ద్వారా కూడా సేవచెయ్యాలని గురువులు చెబుతారు. అదే భాగవతము కూడా చెబుతుంది. మనందరము భగవంతునికి షోడష లేదా పంచ ఉపచారాలు చేస్తాము.పుష్పం, పత్రం, దీపం, ధూపం, నైవెద్యం. ఇవే కదా. ఇది మనకు తెలిసిన పూజ. కాని భాగవతము చెప్పే పూజ, అదే ప్రహ్లాదుుకు కూడా…

అమ్మఆలోచనలు ఒక భక్తుడు అమ్మను చూడటానికి జిల్లేళ్ళమూడి వెడుతున్నాడు. అది రాత్రి సమయం. అప్పటికి అక్కడికి రోడ్డు లేదు. కాలిబాట మీదుగా వెళ్ళాలి. రెండు కాలువలు దాటాలి. వచ్చే ఆ భక్తునికి ఆ కాలువ ఎక్కడ దాటాలో తెలియలేదు. వెతకగా అక్కడో పల్లెవాడు పడుకొని ఉన్నాడు.ఈ భక్తుడు అతనిని నిద్రలేపి అడిగి, ఆ కాలువ దాటాడు. అతను అడగక పోయినా అతని చేతులో నలుభై పైసలు పెట్టి వచ్చాడు. పల్లెవాడు లెక్కపెట్టకుండా జేబులో పెట్టుకున్నాడు.అమ్మ వద్దకు చేరాక…

అమ్మఆలోచనలు

అమ్మఆలోచనలు 1954 లో గుంటూరులో చికిత్స పొందుతున్న లోకనాథంగారిని చూడటానికి అమ్మ వచ్చింది. అమ్మ కట్టు బట్టలతో బయలుదేరింది ఆరోజు.ఆనాటి వారి పరిస్థితి అది. అమ్మ రోడ్డు మీద ఏడవ నెంబరు మైలు రాయి వద్ద కూర్చొని ఉంది.ఆ సమయంలో రెడ్డి సుబ్బయ్య 8 రూపాయులు పెట్టి చీర కొని తెచ్చి అమ్మకిచ్చాడు. తరువాత అమ్మ ఆ సంఘటన తలుచుకుంటూ “నాన్నా! ఇవాళ అమ్మకి పట్టు చీరలు పెట్టారు. బంగారం దిగేశారు. వీటి విలువ ఎక్కువ కావచ్చు….

#అమ్మఆలోచనలు

“నాకు శిష్యులు లేరు శిశువులే” అన్న అమ్మ అమృతమూర్తి. అమ్మ చాలా సార్లు “భర్త అంటే భావన” అని చెప్పేది. ఆ భర్త భావన మనస్సులో ఉన్నంత కాలము భర్త భౌతికంగా లేకపోయినా స్త్రీని వికృతరూపిణిగా చెయ్యకూడదని అమ్మ చెప్పేది. అమ్మ ఒక సందర్భంలో “బిడ్డ పుట్టిన 11 వ రోజు పేరు పెడతాము. గాజులు కాటుక పూలు ఇవ్వన్నీ పెళ్ళికి ముందు ఉన్నవే. అసలు వాటిని ఎందుకు తీసెయ్యాలి? మంగళసూత్రాలు తీసేసినంత మాత్రాన కుటుంబంతో పోదు…

#అమ్మఆలోచనలు

#అమ్మఆలోచనలు కుర్తాళం పీఠాధిపతి శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు పుర్వాశ్రమంలో అమ్మ భక్తులలో ఒకరు. వారు జిల్లేళ్ళమూడి వెళ్ళినప్పుడు వారితో కృష్ణబిక్షు అన్న బాగవతోత్తముడు కూడా వచ్చాడు. ఈ కృష్ణభిక్షు గొప్ప సాధకుడు. ఆయన భగవాను రమణ మహర్షిని, కావ్యకంఠ గణపతి ముని ని కూడా సేవించుకున్న పుణ్యాత్ముడు. ఆయనకు కొన్ని విషన్స్ వచ్చేవి. దానికి తోడు ఆయనకు తర్డు (మూడవ నేత్రం) ఐ జ్ఞానం ఉండేది. ఆయన గురువు ఆయనను అడిగారుట “అమ్మ…

#అమ్మఆలోచనలు

ఒక భక్తుడు ఒక సారి భగవాను వద్దకు వచ్చి తనని ఎవరో దూషిస్తున్నారని చెప్పాడు. భగవాన్ వినట్లుగా ఊరుకున్నారు. ఆ భక్తుడు ఆగలేక “భగవాన్ అనవసరంగా అంత తిడుతుంటే నాకు కోపం వస్తున్నది. ఎంత ఆపుకుందామన్నా ఆగటం లేదు. ఏంచెయ్యాలా?” అన్నాడు. భగవాన్ నవ్వుతూ “ నీవు గూడా వారితో కలసి తిట్టుకో. సరిపోతుంది” అన్నారు. అందరూ నవ్వారు. “సరిపోయింది. నన్ను నేను తిట్టుకోవాలా?” అన్నాడా భక్తుడు. “అవునయ్యా! నీ శరీరాన్ని కదా వారు దూషించేది. కోపతాపాల…

#అమ్మఆలోచనలు

#అమ్మఆలోచనలు మంత్రము దీక్ష వంటివి గురువులు శిష్యులకు ఇవ్వటం లోకసామాన్యం కాని అమ్మ విషయంలో అలా కాదు. ఎవరైనా వచ్చి మంత్ర దీక్ష ఇవ్వమంటే అమ్మను అడిగితే “మనస్సే మంత్రం. నాన్నా! ఏ మాటైనా మంత్రం మస్ససిద్ధి ఉంటే…” అనేది అమ్మ. అమ్మ మాటే మంత్రం. మరో మంత్రం ఎందుకు? లలితా నామాలలో కూడా “శ్రీమాత” అన్నదే మోదటి నామము. అలాంటి అమ్మ మంత్రదీక్ష లిచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఉపనయనమైనప్పుడు అమ్మ వటువుకు గాయత్రి దీక్ష నిచ్చింది….

#అమ్మఆలోచనలు

#అమ్మఆలోచనలు ఒకసారి ఒక భక్తుడు రమణ మహర్షిని సందర్శించాడు. ఆభక్తునికి రమణుల ఉపదేశమైన “నిన్ను నీవు తెలుసుకో?” అన్న విచారమార్గం నచ్చదు.కాని ఆయన మిత్రులు రమణుని సందర్శించ నిశ్చయించుకున్నారు.  అందుకని వారితో కలిసి అరుణాచలం వచ్చాడు. రమణాశ్రమములో రమణమహర్షిని సందర్శించాడు. ఆయన భగవాను వద్దకు వచ్చాడు“భగవాను మీరు “నిన్ను నీవు తెలుసుకో” అని చెబుతారు. నాకు తెలుసు. ఆ మార్గం నాకు నచ్చదు. నాకు దేవుడి మీద భక్తి ప్రేమ ఉన్నాయి. నారాయణుడు సర్వం. ఏకో నారాయణ. ఇది చాలా?”భగవాను చిరునవ్వుతో “చాలును”…

#అమ్మఆలోచనలు

జిల్లేళ్ళమూడి వెళ్ళిన వారికి అమ్మ భోజనం పెట్టడం అనుభవమే. నేటికీ ఆ అన్నదాన మహాయజ్ఞం సాగుతూనే ఉంది. ఎవ్వరు వచ్చి అమ్మ ముందు భోజనం చెయ్యమని చెప్పేది. అక్కడ లేని వారికీ, దూరాన ఉన్న పరమభాగవతోత్తములకూ కూడా అమ్మ అన్నం పెట్టేది. అది మనకు తెలియదు. అది విశ్వరహస్యం. అమ్మ మరి విశ్వజనని కాబట్టి, ఆమె తన బిడ్డలందరికీ భోజనం పెట్టేది. అమ్మ లక్ష్మ మందికి ఒకే బంతిలో భోజనం చేస్తూంటే చూడాలని ఉంది అని కదూ…

#అమ్మఆలోచనలు

మానవులుగా జన్మించిన వారు తప్పక ఐదు ప్రశ్నలు వేసుకోవాట…నేను ఎవరు? నేను ఏమి పొందవలెను? నేను ఎట్లు పొందవలెను? పొందుటకు ఆటకంమేమిటి? పొందన ఫలమేమిటి? జీవితంలో ప్రతి దానికీ ఇలా ఆలోచించుకోమని రామాయణాది నేర్పుతాయి. భగవానులు కూడా ఎప్పుడూ నేనెవరు అన్నదే తెలుసుకోమంటారు. ఆ విచార మార్గం అంత సులభం కాదు. దానికి భగవానులే ఒక సారి ఇలా చెబుతారు” నేనెవరు?”* అది కనుగొనే దెలాగ? నీవు ప్రశ్నించుకో. అన్నమయ కోశమనే ఈ దేహమూ, దాని ధర్మాలూ…