మంచి పుస్తకాలు పాఠకుల మనస్సులను కస్తూరి సువాసనలా మత్తెకిస్తాయి. చదివిన తరువాత ఎన్నో సంవత్సరాలు తోడుంటాయి.గమ్యం సూచిస్తాయి. జ్ఞానదీపికలవుతాయి. అటు వంటి పుస్తకాలను గురించి చెప్పాలంటే ఎక్కువగా పుస్తకాలు చదివేవారికి ఎన్నో ఉంటాయి. అలాంటి పుస్తకాలను పరిచయం చేశారు రచయిత్రి వీరలక్ష్మీదేవిగారి తన శేఫాలికలో. శేఫాలిక అంటే పారిజాతాలట. పారిజాతం దేవపుష్పం. చెట్టు మీదుంటే మనం కొయ్యలేము. పూర్తిగా విచ్చుకొనిదానంతట అదే, రాత్రి మంచు పరచుకున్న వసుధను కౌగిలించుకుంటుంది. మన ఉదయాలను సుగంధభరితం చేస్తుంది. సున్నితమైన పారిజాత కదంబం వీరి శేఫాలికలు. అసలు…
Tag: మనసులో మాట
కృష్ణతత్త్వం
కృష్ణస్తు భగవాన్ స్వయమ్’… కృష్ణుడే పరమతత్త్వం… చరమ లక్ష్యం.. ఏ పరతత్త్వమును వివరించటానికి భాష చాలదో… సర్వ భాషలకు అందని మౌనములో తప్ప అర్థం మనకు తెలియదో…కేవలం ప్రేమ ద్వారా మాత్రమే అందుకోగలరో ఆ పరతత్త్వమే శ్రీకృష్ణ తత్త్వము. కృష్ణుడు ఒక యుగానికి చెందినవాడనో, లేక,చరిత్రలోనో, పురాణాలలోనో, కావ్యాలలోనో చదివే నాయకుడనుకోవటం అజ్ఞానానికి గుర్తు. శ్రీ కృష్ణుడు సర్వత్రా వ్యాపించిన పరతత్వమే. మనము ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థమవుతూ, ఇంకా తెలుసుకోవలసినది ఎంతో మిగిలి ఉండటమే కృష్ణతత్త్వము. …
నిత్యపూజ
నిత్య పూజ ప్రాముఖ్యత కొందరు పూజ చెయ్యనిదే ఉదయపు అల్పాహారం కూడా అంటరు.అసలు ఈ నిత్య పూజ ఏమిటి?దాని ప్రాముఖ్యత ఏమిటి?ఆ విధి – విధానం ఏమిటి?అన్న సందేహం మనకు తప్పక కలుగుతుంది. ప్రతి దినం చేసే చేసే ప్రార్థనే నిత్య పూజ. పర్వదినములలో, ప్రత్యేక సందర్భాలలో చేసేది ప్రత్యేకమైన పూజ.నిర్గుణుడు, నిరాకారి అయిన పరమాత్మని తలుచుకోవాటానికి, కొలుచుకోవటానికి మనకు వీలుగా వుండటానికి మన ఋషులు చూపించిన బహు చక్కని సులువైన మార్గం విగ్రహారాధన.విగ్రహారాధన అన్నది మానవుడు…
సుందరకాండ -సాధన – అంతరార్థం
సుందరకాండ -సాధన – అంతరార్థం “మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం॥వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి॥” సుందరకాండకు ఆ పేరు ఎందుకు వచ్చి ఉంటుదన్న విషయం నిరుడు విచారం చేసుకున్నాము. సుందరకాండ కేవలం రామాయణంలో ఒక కాండ మాత్రమే కాదు, ఎన్నో రహస్యాలను తనలో ఇముడ్చుకున్న విజ్ఞానం. ఇది కేవలం బ్రహ్మ విద్యే. సుందరకాండను అనుసంధానం చేసుకొని తరించిన భక్తులున్నారు. వారు సుందరకాండ ఒక్కటే అనునిత్యం పారాయణం చేసుకుంటారుట. అందుకే రోజూ…
Buttato tippalu
ప్రయాణములో పదనిసలు -6 బుట్టోపాఖ్యానము నేను వారణాసీ నుంచి వంట్లో బాగుండక స్టమక్ ఫ్లూ తో హైద్రాబాదు వచ్చిన మరురోజు, మా బావగారు అన్నారు ఈ ‘బుట్ట’ గురించి. ‘తినగలవా, బుట్ట తెస్తాను’ అని. నేను ‘మాములు ఫుడ్డే తినలేక ఇబ్బందిగా వుంది ఇక బుట్ట –తట్టా ఒక్కటే తక్కువ నాకు’అని, అయినా బుట్టంటేనూ?’ అని ప్రశ్నించాను. అక్కయ్య చెప్పింది ‘సుబ్బయ్యగారి బుట్ట’ అని. అదే మొదలు నేను ఆ బుట్ట పుడ్డు –విడ్డూరాలు వినటము. బుట్ట…
ఆంధ్ర పథం -నా సమీక్ష
చరిత్ర చదవటం ఎందుకు? దానికి సమాధానం కన్నా ముందు అసలు ఒక విషయం చెప్పండి…. బాగా సంపద ఉన్నవారి పిల్లలలో కనిపించే మంచి,గొప్ప లక్షణం ఏమిటి? ఆత్మవిశ్వాసం ! గమనించారా? వారి ఆత్మ విశ్వాసం…. అది వారి సంపద మూలంగానే కదా! అలాగే గొప్ప చరిత్ర వారసత్వ సంపదగా ఉన్న జాతిలో కనపడేది కూడా ఆత్మ విశ్వాసమే! ప్రపంచ దేశాలలో ఘన చరిత్ర వున్న రాజ్యాల పద్దతి, పస్తుత వారి విధానాలలో మనము గమనించవచ్చు. తమ జాతి…
My review
చిన్న కథలు చదవటానికి బాగుంటాయి… త్వరగా, చకచకా చదివేసి, చదివిన కథలలో నచ్చినవి మననం చేసుకోవటం మంచి అనుభూతి. అందునా మంచి కథ చదివితే ఆ అనుభూతి రసానుభూతి. మరి మంచి కథలు అన్ని ఒక్క దగ్గర కూడి ఒక పుస్తకం లా వస్తే…. అది మరింత మధురమే కదా! కథలో – నిర్మించిన వస్తువు, కథా గమనం,కథలోని పాత్రలు, ఔచిత్యం, సమస్యను వివరించటం, కొన్ని సందర్భాలలో పరిష్కారము సూచించటం ఇత్యాది లక్షణాలు కథను చదువరులకు గుర్తుండేలా…
హిందోళ రాగము
“శిశుర్వేత్తి పశుర్వేత్తి వేతి గానరసం ఫణి కోవేత్తి కవితా తత్త్వం శివో జానాతి వా నవా ” అన్ని పెద్దలు చెప్పారు. చిన్నలను పెద్దలను, పశు పక్షాదులను సమానముగా అలరించి మైమరపించే శక్తి సంగీతానికి ఉంది. అలాంటి సంగీతంలో కొన్ని రాగాలు మరీ అవలీలగా ఆకట్టుకొని, హృదయాన్ని ఉరూతలూగిస్తాయి. అలా అలవోకగా మనసును రంజించే రాగాలలో “హిందోళ” రాగ మొకటి. హిందుస్తానీ వారు ‘మాల్కోస్’ అంటారు దీనినే. దీనికి 20వ మేళకర్త అయిన ‘నటభైరవి’ జన్యం. ఈ…
మాతృభాషాదినోత్సవము
1.అమ్మ చిరునవ్వు భాష తెలుగు। అమ్మ మమ్ముల దగ్గరకు తీసుకొని పెట్టిన గోరు ముద్దలు భాష తెలుగు। మా చిన్నతన్నాన ఆడిన గుజ్జనగూళ్ళ భాష తెలుగు। నాన్న చెయ్యి పట్టుకు నడిచిన నడత తెలుగు।। 2.నన్నయ్య అక్షర రమ్యత తెలుగు। తిక్కన నాటకీయత తెలుగు। కృష్ణరాయలు పద్యసొగసు తెలుగు। రామకృష్ణుని చతురత తెలుగు। పెద్దన ప్రవరుని పవిత్రత తెలుగు। నంది తిమ్మన నుడికారము తెలుగు।। 3.పోతన భాగవతపు వెలుగు తెలుగు। శ్రీనాధుని వీర శృంగారము తెలుగు। గురజాడ…
కుదిపేసిన గొల్లపూడివారి సాయంకాలము
మంచి పుస్తకానికి ఉన్న లక్షణం పాఠకులను ఏకధాటిగా చదివించటంలోనే కాదు, చదివాక దాని ప్రభావంలో ఆ చదివిన వారు కొట్టుకుపోవడం. అదీ అట్లా ఇట్లా కాదు, పూర్తిగా మునిగి పోవటం. వారిలో కొంత మార్పు తేవటము. పాఠకులు తమ కథను ఆ చదివిన కథతో అనుసంధానించుకోవటం. పాత్రలలో మమైక్యమైపోవటం. తమ కోణంలో ఆ కథను చూడటం. కొన్నిచోట్ల కథతో తాదాత్మ్యం చెందటం. కథను కొంత సమర్ధించుకోవటం. వెరసి పూర్తిగా అందులో మునిగి తమను తాము కోల్పోయేలా చేసేది…