శేఫాలికలు

మంచి పుస్తకాలు పాఠకుల మనస్సులను కస్తూరి సువాసనలా మత్తెకిస్తాయి.  చదివిన తరువాత ఎన్నో సంవత్సరాలు తోడుంటాయి.
గమ్యం సూచిస్తాయి. జ్ఞానదీపికలవుతాయి. 
అటు వంటి పుస్తకాలను గురించి చెప్పాలంటే ఎక్కువగా పుస్తకాలు చదివేవారికి ఎన్నో ఉంటాయి. 

అలాంటి పుస్తకాలను పరిచయం చేశారు రచయిత్రి వీరలక్ష్మీదేవిగారి తన శేఫాలికలో. 
శేఫాలిక అంటే పారిజాతాలట. పారిజాతం దేవపుష్పం. చెట్టు మీదుంటే మనం కొయ్యలేము. పూర్తిగా విచ్చుకొని
దానంతట అదే, రాత్రి మంచు పరచుకున్న వసుధను కౌగిలించుకుంటుంది. మన ఉదయాలను సుగంధభరితం చేస్తుంది. సున్నితమైన పారిజాత కదంబం వీరి శేఫాలికలు. 
అసలు కొందరి రచనల గురించి నావంటి సామాన్య పాఠకురాలు సమీక్షించలేదు. ఎందుకంటే తెలుగులో తెలివైన, తోతైన భావాలతో రచనలు సాగించే వారిలో వీరలక్ష్మిగారు ఒకరు. వారి రచనల సమీక్ష కాదిది. కేవలం నేను చదివి , నాకు బాగా నచ్చిందని మిత్రులకు పంచుకుంటున్న భావం. 
వారు చదివిన కథలు, తనను ప్రభావితం చేసిన కథలు సినిమాల గురించి ప్రస్తావనే ఈ శేపాలికలు. 

“జవ్వాది రాసిన జేబుగుడ్డలా” ఈ కథలు గుభాళించాయి. 
మునిపల్లెవారి మూర్తి నుంచి కృష్ణశాస్త్రి మరిగించిన మల్లెల వరకూ
చలం నుంచి రవీంద్రుని వివిధ కథల వరకూ సాంబ్రాణి పొగలా మనలను చుట్టుముడుతాయి. 
మోహతంతులు బిసతంతులంటారట. అమ్మవారికి బిసతంతునీయసి అన్న నామం ఉంది.  అమ్మ రూపు వర్ణన అది. తామరతూడలోని నులి దారాలు. మోహ మటువంటిదట మరి. ఆ వివరాలున్న కథలు…
కాంతినీ మరికాస్త ఎరుకనీ పట్టుకు వచ్చే కథలు…
టాల్‌స్టాయ్‌ కథల నుంచీ రష్యా కథల వరకూ…

భారతపు కథలూ… భావము నింపిన కథలూ
ఎక్కడి భారతం…ఎక్కడి నన్నయ్య…ఎక్కడి కథలు.. ఎంత జ్ఞానము…
చండీదాస్ నుంచి బుర్రా వెంకసుబ్రమణ్యం గారి జేబురుమాల వరకూ …ఎన్ని పతీకాత్మ

కథలో…

రచయిత్రి ఒక చోట చెబుతారు “చాలు అనుకోవటానికి ఎంతో ప్రపంచం చూసి, జీవితం తాలుకూ చేదు అనుభవించి అక్కడ ఏమీ లేదని గానీ అంతే ఉందని గానీ నిర్దారణకు రావాలి” 
ఇటు వంటి ఆలోచనే కదా తన వైపుకు తనను త్రిప్పుతుంది. ఒకరిని ఎరుకలోకి త్రిప్పిగలదు. 
ఈ కథల తాలూకు ఆలోచనలు “ఆత్మకి పట్టిన దుమ్మును” వదలగొట్టకలవు.
ఒకచోట చెప్పారు ఆమె, అహంకారం కన్నా, విషయవాంఛల కన్నా నలుగురికీ తెలియాలన్నది పెద్ద బంధమని. 
మనకు వెంటనే ఈ సోషల్‌మీడియాలో రకరకాల జనాల పిచ్చులు గుర్తుకు వస్తాయి. 
ఇలా ఎన్నో కథలు, కొన్ని సినిమాలు… కొంత జ్ఞానము. 
ఇందులో నాకు బాగా నచ్చినది మష్టారు గారి కథ. వారి మాష్టారు విశ్వనాథవారిని కలవటం. అదో గొప్ప కథ…
మనస్సుకు నచ్చిన ఈ పుస్తకాన్ని అసలు చదివి ఇండియాలో ఉంచాలనుకున్నా… కాని దాన్ని దారి పోడువునా…ఆ కథలను… మాటలను…పంచిన జ్ఞాపకాలను పరుచుకుంటూ… జారిన పారిజాతాలను ఏరుకుంటూ మా ఊరొచ్చేశాను. 
మళ్ళీ చదువుతానేమొ… మళ్ళీ మళ్ళీ చదవుతాను బహుశా…. అంతగా హత్తుకుంది…ఆ శైలి.. ఆ వివరాలు.. ఆ ఎరుక… అచ్చంగా జేబుగుడ్డలో దాచిన జవ్వాదిలా…
అభినందలు వాడ్రేవు వీరలక్షిగారు. మీరు మరిన్ని శేఫాలికలు చల్లాలని కోరుతున్నాను. ఏరుకోవటానికి సిద్ధమవుతూ…

ప్రేమతో 
సంధ్యా యల్లాప్రగడ

2 Comments Add yours

  1. srkudaravalli says:

    dear sandhya garu
    where can i get this book
    can u mail me the publisher .

    with best regards
    k srinivasa rao

    Like

    1. you may get them in any Navodaya book stalls andi

      Like

Leave a comment