ఈ మధ్య కాలములో నే చదివిన పుస్తకాలలో చాలా మటుకు సాధనకు పనికివచ్చేవే అని చెప్పలేను. కొన్ని మాములు పుస్తకాలు… కొన్ని కథలు…కాని ఈ పుస్తకం అలా ఏ కోవకూ చెందనిదిగా చెప్పాలి. ఎందుకంటే ఇది రమణభక్తురాలి కథ అయినా, ఆమె భగవానుతో తన అనుబంధం గురించి కానీ, సాధన గురించి గానీ ఈ పుస్తకంలో వివరించినది పెద్దగా ఏమీ లేదు. కాని రమణాశ్రమం, ఆనాటి స్థితిగతులు, ఆశ్రమం ఎలా వృద్ధి చెందింది, ఏ ఏ ప్రముఖులు…