అష్టావక్రగీత#10జనక మహారాజు అష్టావక్రునికి జ్ఞాన తృష్ణతో అడిగిన ప్రశ్నకు అష్టావక్రుడు ఆత్మ నిజతత్త్వాన్ని గురించి వివరించి చెబుతాడు.జనక మహారాజుకు ఆత్మానుభవము కలిగింది. ఆ జ్ఞానం కలిగిన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చెబుతున్నాడు.సముద్రంలో అనేకమైన అలలు పుడుతూ ఉంటవి. అవే కాదు కెరటాలు, నురుగు, నీటి బిందువులు వెదజల్లబడుతూ ఉంటాయి. తిరిగి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. అలాగే పరమాత్మ నుంచి ఆత్మలు ఉద్భివిస్తాయి. తిరిగి లయమవుతాయి. అన్నీ సముద్రంలో భాగాలలా, పరమాత్మలో ఇవీ భాగాలే. అలా ఆత్మ పరమాత్మలో…
Tag: #Astavakrageeta #vedantam #myreadings #వేదాంతం #అష్టావక్రగీత #నాలోకం #సాధన
అష్టావక్రగీత#9
అష్టావక్రగీత#9 జనక మహారాజు అష్టావక్రునికి జ్ఞాన తృష్ణతో అడిగిన ప్రశ్నకు అష్టావక్రుడు ఆత్మ నిజతత్త్వాన్ని గురించి వివరించి చెబుతాడు. జనక మహారాజుకు ఆత్మానుభవము కలిగింది. ఆ జ్ఞానం కలిగిన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చెబుతున్నాడు. సముద్రంలో అనేకమైన అలలు పుడుతూ ఉంటవి. అవే కాదు కెరటాలు, నురుగు, నీటి బిందువులు వెదజల్లబడుతూ ఉంటాయి. తిరిగి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. అలాగే పరమాత్మ నుంచి ఆత్మలు ఉద్భివిస్తాయి. తిరిగి లయమవుతాయి. అన్నీ సముద్రంలో భాగాలలా, పరమాత్మలో ఇవీ భాగాలే….
Astavakrageeta8
అష్టావక్రగీత #8 జనక మహారాజు మిథిలా నగర రాజు. ఆయన జ్ఞాని కూడా. అష్టావక్రుని జ్ఞాన, ముక్తి, వైరాగ్యం గురించి అడిగినప్పుడు అష్టావక్రుడు మహారాజుకు సమాధానంగా “బంధాలను వదిలెయ్యమని, విషయలంపటాలను విషంలా వదిలెయ్యమని చెబుతాడు. ఇంద్రియాలు కోరికల వెంట పరుగులు పెడతాయి. ఒక కోరిక తరువాత మరో కోరిక కలుగుతూనే ఉంటుంది. అవే విషయ లంపటాలు. వాటిని విషంలా చూడాలి. రజ్జు సర్ప బ్రాంతిలా చుట్టూ ఉన్న ప్రపంచము నిజమని అనిపిస్తుంది. కాని బ్రాంతి వీడి లోన…
అష్టావక్రగీత7
అష్టావక్రగీత#7 ”సాకారమనృతం విద్ది నిరాకారం తు నిశ్చలమ్।ఏతత్త్వోపదేశేన న పునర్భవ సంభవః॥” రూపం నశిస్తుంది. రూపం లేనిది శాశ్వతంగా ఉంటుంది. ఈ జ్ఞానం వల్ల పునఃజన్మ నుంచి విముక్తి పొందుతావు. జగత్తు మిథ్య. కనిపించేది అశాశ్వతం.ఆత్మ సర్వసాక్షిగా ఉంటుంది. నశించిపోయే వాటి మీద అభిమానం వద్దు. ఆకారంలేని ఆత్మ సర్వకాలాల్లో ఉంది. ఇదే ఆనందం. ఇటు వంటి ఆనందమే బ్రహ్మం. ఇదే చిన్మాత్ర. చిన్మాత్రలో విశ్రయించటమే ముక్తి. “యథైవాదర్శమధ్యస్తే రూపేంతః పరితస్తుసః।తథైవాస్మిన్శరీరేంతః పరితః పరమేశ్వరః॥” అద్దంలో ప్రతిబింబం…
అష్టావక్రగీత6
జనకుడు అడిగిన ప్రశ్నకు అష్టావక్రుడు సమాధానంగా విషయలంపటాలను విషంగా వదిలెయ్యమని చెబుతాడు. ఆయన ఇంకా ఇలా చెబుతున్నాడు…. “నిస్సంగో నిష్క్రియో సిత్వం స్వప్రకాశో నిరంజనఃఅయమేవ హితే బంధః సమాధి మనుతిష్టసి॥” నీవు నిస్సంగుడవు. నిప్ర్కియుడువు. స్వయంజ్యోతివి. నీకు ఏ మలినము లేదు. అంటవు. బంధాలు తొలగించుకొని స్థిరంగా ఉండు. నీ మనస్సుతో కాని, శరీరంతోకాని, అవి అనుభవించే విషయాలతో నీకు సంబంధం ఉండదు. నీ ఆత్మకు నీ కర్మకు సంబంధం ఉండదు. పరమాత్మకు ఏ కర్మలు అంటవు. అందుకే చెట్టు…
అష్టావక్రగీత
అష్టావక్రగీత#5 మన మనస్సులో ఏ భావము బలంగా ఉంటుందో అదే నిజమవుతుంది. ఇందులో మ్యాజిక్ ఏమీలేదండి. మనఃనిర్మతం ప్రపంచం. మన మనస్సులో అనుకున్నదే మనకు కనపడుతుంది. లేకపోతే మన దృష్టికి ఆనదు. ఉదాహరణకు ఆకలిగా ఉన్నవారికి ప్రతీది ఆహారంలా కనపడుతుంది. అప్పటి వరకూ కనపడని హోటల్స్ కనబడుతాయి. మనస్సులో ఆలోచనతో లోకం చూస్తారు. చాలా సార్లు తరగతి గదులలో విద్యార్థులను టీచర్లు “ఎక్కడ పెట్టావు బుర్ర… పాఠం వినటంలేదు” అంటూ ఉంటారు. అంటే మనస్సులో ఆలోచనలు ఎక్కడో…
అష్టావత్రగీత-4
అష్టావక్రగీత#4 అహం కర్తేత్యహం మాన మహాకృష్ణాహి దంశితఃనాహం కర్తేతి విశ్వసామృతం పీత్వా సుఖీభవ॥ ఒక నల్లటి త్రాచు పాము ఉంది. దాని వంటి నిండా కాలకూట విషముంది. దాని కాటుకు విషముతో కుట్టబడితే విషంతో వారు నిండిపోయి దుఃఖమనుభవిస్తారు. కర్తృత్వం అన్నది నల్లటి త్రాచుపాము. కర్తృత్వం అంటే చేసేది నేనే అన్న అహంకారం. అహంకారం కన్నా నల్లటి త్రాచు మరోటి లేదు. అహంకారం నిండా ఉన్నవారు వంటి నిండా ప్రవహిస్తున్న విషం కలవారు ఒక్కటే. వారికి ఎవ్వరూ…
అష్టావక్రగీత-3
అష్టావక్రగీత#3 వైరాగ్యం ఎలా కలుగుతుంది? జ్ఞానము ఎలా కలుగుతుంది? ముక్తి ఎలా కలుగుతుందని జనకమహారాజు ప్రశ్నించగా అష్టావక్రుడు సమాధానం చెబుతున్నాడు. విషయలంపటాలను విషంలా వదిలెయ్యమన్నాడు. బంధాలనుంచి విడుదల చేసుకోమన్నాడు. ఏ బంధాలవి? “యదిదేహం పృథక్కృత్య చితి విశ్రామ్యతిష్టసి।అధునైవ సుఖీ శాంతః బంధముక్తో భవిష్యసి॥” శరీరము నేనన్న తాదాత్మ్యం నుంచి వేరుపడి నీ ఎరుకలో నీ కాంషియస్‌నెస్‌లో నిలబడి నిన్ను నీవు చూసుకు. నిత్యముక్తుడవు.నిత్యతృప్తుడవు. ఆనందరూపమే నీవు. దేహమనేది ఒక పెద్ద బంధం. ఈ దేహము నేను అన్న…
అష్టావక్రగీత-2
అష్టావక్రగీత #2 జనకుడు రాజయోగి. ఆయనకు జ్ఞాని అని పేరు. ఆయన అష్టావక్రుడన్న మునికుమారుని అడిగిన ప్రశ్న “జ్ఞానం అంటే ఏమిటి? వైరాగ్యం ఎలా నిలుపుకోవాలి? ముక్తి ఎలా లభ్యమవుతుంది?” అష్టావక్రగీతలో మొదటి అధ్యాయములోని 19 శ్లోకాలాలో సమాధానం చెబుతాడు అష్టావక్రుడు. ఆలోచించండి వేల సంవత్సరాలకు పూర్వం శంకరభగవద్పాదుల వారు మనకు అద్వైత జ్ఞానము పంచక పూర్వం అజ్ఞానమన్న రెల్లగడ్డిని పదునైన కత్తి వంటి సమాధానాలతో అష్టావక్రుడు చెప్పాడంటే….ఆనాటి మునుల జ్ఞానగంగా ప్రవాహం మన బుర్రకు అందనిది….
అష్టావక్రగీత -1
నేను” అన్నది ఏమిటో తెలుసుకో!, అన్నారు భగవానులు.“నేను” మీద ధ్యానం చెయి, తెలియగలదని అన్నామలై (రమణుల వారి శిష్యులు) చెప్పారు. “నేను” అన్న భావమే అహం. మానవుకున్న 26 తత్త్వాలు/ గుణాలు/భూతాలలో ముఖ్యమైనది అని చెబుతారు వేదాంతులు. దీని విషయం తెలుసుకోవటానికి గురువును ఆశ్రయించమన్నారు పెద్దలు. గురువు ఏం చెబుతాడు? “అజ్ఞానివి నీవు కాదయ్యా! నీ స్వభావం జ్ఞానమే. కాని నీవు, నీవు కానిదైన శరీరము నీవన్న బ్రాంతిలో ఉండి నీ అసలు రూపం గహ్రించటము లేదు. నీ అసలు స్వరూపము…