శనగ దోశ- నా అజ్ఞానము

శనగ దోశ- నా అజ్ఞానము మా పుటింట్లో మడులు, దడులు ఎక్కువ. అందుకే అసలు వంటింటి ఛాయలకు రానిచ్చేవారు కారు మా చిన్నప్పుడు. నాకు వంట రాకపోవటానికి ఇదో కారణమనుకోండి. ఈ సాకుగా నా బద్దకాన్ని కప్పేసి ఎప్పుడూ నాకు వంటరాకపోవటానికి ఈ పద్దతులే కారణమని సాదించే చాన్సు వదిలేదాని కాదు. వంటే కాదు వంటవస్తువులు కూడా ఏవి ఏమిటో తెలియని అమాయకత్వం ఎవ్వరూ గమనించ కుండా చాలా కాలము దాచాను కాని ఓక సారి అడ్డంగా…

Rotimatic-Magic

పూర్వం వంటంటే అదో ప్రహసనంలా ఉండేది. వడ్లు నూరటం నుంచి, విసరటం,దంచటం అంతా మనుష్యులే చేతులతో, రాతి పనిముట్లతోనూ (రోలు, తిరగలి,గాడి పోయ్యి, రోకలి, పొత్రం ఇత్యాదివి)చేసేవారు. ఆనాడు స్త్రీ కు రోజంతా వంటఇంట్లోనే గడిచిపోయేదంటే మరి వింత కాదు. విద్యుత్ కనిపెట్టాక, కొద్ది కొద్దిగా యంత్రాలు చోటు చేసుకుంటూ, స్త్రీలకు ఈ అవస్థను కొంత తప్పించాయి. తిరగలి బదులు వెట్ గ్రైండర్, రోళ్ళు బదులు మిక్సీ, కట్టెల పొయ్యి బదులు గ్యాస్ స్టవ్, ఎలక్ట్రిక్ పొయ్యి,…

రవ్వ దోశ పెళ్ల పెళ్ల -తింటే కరకర

రవ్వ దోశ పెళ్ల పెళ్ల ,తింటే కరకర ఈ సమూహం లో చేరాక ఏవైనా కొత్త వంటకాలు నేర్చుకో వచ్చుగా అని ఆశతో మీరంతా గుమగుమతో అదర గొట్టేస్త్తున్నారు. నీకు పెద్దగా వంటల రకాలు రావు..వచ్చినతవరకు పంచుకోవాలనే ఉబలాటం తప్ప…… అందుకే బాగా త్రీవ్రంగా అలోచించి, ఛంట్టబ్బాయి లో శ్రీలక్ష్మి ని ప్రార్ధన చేసి చేసిన “రవ్వ దోశ పెళ్ల పెళ్ల , తింటే కరకర” మీ కోసం అందిస్తున్నా. . కావలసిన సరుకులు: ఒక గ్లాస్…

అమెరికా లో ఆవకాయ

అమెరికా లో ఆవకాయ ——————— నేను సైతం అమెరికాలో మామిడికాయను కొని తెచ్చాను.. విందు లో వాడాలని, పసందుగా బోంచేయ్యా లని, తెచ్చిన కాయని ముక్కలుగా తరిగాను, చెక్కలను వేరు చేశాను.. ట్రంప్ మీద కోపాన్ని కారంగా మార్చాను ఎర్రటి కారాని వేశాను ఒక తూకాన, చేతయి చేతకాని ఆవేశంలా మిగిలిన తెల్లని ఉప్పును అదే చేత్తో వేశాను… వడ్డించా ఘాటుగా రెండేసి చెంచాల ఆవాలు పిండిలా మార్చి, H 1 ఉద్యోగి వీసా సమస్యను.. H…

పెసరట్టు

ముడి పెసలు కడు ఒడుపుగా తెచ్చి ముచ్చటగా ముందు రోజు నానపోసి ముసలం లేని యంత్రమున పిండి గావించి మరునాడు ఉదయం పెనము సిద్ధం చేసి ముచ్చటగా ఆ పెనం మీద  మూడు చుట్టులా పిండి తిప్పి మిర్చి, ఉల్లి క్యారటు మరియు జీలకఱ్ఱయు చల్లి మురిపముగా తీసి వడ్డించగా మగడు మురిసెను మోము మెరిసెను, ముక్తి తీర ఆనందముగా గానము చేసేనిట్లు “అల్లం పచ్చిమిర్చి జీలకఱ్ఱ చల్లి నాకు నచ్చేటట్లు మా ఆవిడా వేసింది ఒక…