అనామిక

నీ గాఢ నిద్రలో-
నా పలవరింతలకు విచ్చిన  … 
నీ పెదాల చిరునగవుల
వెలుగులతో,  .
నా హృదయము మెరిసినది
ఈ పూట!

గాఢంచు నిద్రల అంచులలో
నీ కలలకు రాణిగా,
నీ జీవిత ప్రేయసిగా
మురిసిన
నా చిరు యవ్వన వెలుగుల తారాజువ్వలు
ఎగిరిపోయాయి….
నేడు
కలయిక  మృగ్యమై
మౌనముగా…. 
మృత్యువు ఛాయలకు
గమనము సుగమనమై
సాగుతూ….
నీకు ప్రేమైక్యజీవన
కలవరింతలు వివరిస్తున్నాను.

స్నేహానికి, ప్రేమకు హద్దులు చెరపి

గాఢంచు మమకారపు వలపులు తొడిగిన
మన బందానికి నాకు తెలియదు పేరు కానీ,

తెలిసినది కొంచమే.
అది, నీవు నా జీవితములో అత్యంత మఖ్యమైన భాగమని.

సంధ్య యల్లాప్రగడ

Leave a comment