జలంధర గారితో

2016లో ఇండియా వచ్చినప్పుడు, హైద్రాబాదు నుంచి ఏమీ తేవాలని అక్కయ్యను అడిగితేపున్నాగపూలుపట్టుకురా! అంది. అలా నేను పూల పరిమళం అఘ్రాణించాను.


ప్రాణిక్ హీలరైన మా అక్క అప్పటి వరకూ ఎంత చెప్పినా తలకెక్కని హీలింగు పై,  విపరీతమైన జిజ్ఞాస కలిగింది పుస్తకం చదివాక…. ఒక మనిషి అసలు రకంగా సంబంధం లేకుండా నిస్వార్థంగా మరొకరి బాగోగులు చూడటం, ఎనర్జీ పంపటం(తల్లితండ్రులు కాకుండా)…ప్రపంచములో భాదిత వర్గం కోసం తమ ప్రార్థనలలో కలపటంఅసలు సదా పరుల క్షేమము కోరటంఅవ్వన్నీ సాధ్యమనీ పుస్తకం చదవకపోతే నే నంతగా కన్విస్సు అయ్యేదాన్ని కాదేమో.2016

నుంచి నేటి వరకూ బెస్టు సెల్లింగు పుస్తకంగా అమ్మకాలలో నిలచిన  ‘పున్నాగపూలునాలో చాలా మార్పు తెచ్చింది. ముందుగా,ముఖ్యం గా నాకు హీలింగు మీద గౌరవం కలగటమే కాదు లోతుగా తెలుసుకోవాలని కోరిక కలిగింది. 

మన తోటి వారిని మనము ఎంతగా చేయూత నివ్వచో చెప్పిన పుస్తకం మీద నాకు చాలా అభిమానం కలిగింది. అది రాసిన జలంధర గారంటే  అభిమానం కలగటం కూడా చాలా సహజం కదా!

చెన్నై లోవుండే జలంధర గారుమైత్రిఅని ఒక కాలము కూడా నిర్వహిస్తారు. కాలమ్ ద్వారా వారు చాలా మంది అవసరాలకు తగ్గ ఆఫర్మేషన్స్ ఇస్తూ, హీలింగు చేస్తూ సహాయం చేస్తున్నారు కూడా. 

పూన్నగపూలుచదివిహీలింగ్ నేర్చుకోవటం ఆధ్యాత్మకతవెతుకులాటలో మరో అడుగు వెయ్యటానికి సహయపడిందన్నది నా నమ్మకము

ఆలోచనా ధోరణిలో మార్పు, ప్రతిదీ పాజిటివ్ గా చూడటం, ప్రతికూల పరిస్థితులలో నైనా ధైర్యంగా వుండగలగటం ఇత్యాదివి అలవడుతాయి హీలింగు వలన. మన వాళ్ళు ప్రతిదీ సంకల్పబలం అంటారుగాఉదాహరణకు అమెరికాలో కొడుకు జబ్బు పడితే,దూరంగా ఇండియాలో అమ్మ బాధతో, తపనతో భగవంతుని ప్రార్దిస్తుంది. తపన వల్ల కలిగే పాజిటివ్ తరంగాలు లేదా వైబ్రేషను కూమారుని ఆరోగ్యాన్ని కుదుట పరుస్తాయి.(నమ్మశక్యం కానిదే అయినా నిజం).  
ప్రపంచములో ప్రతిదీ శక్తి తరంగాలేగా. మనకు తెలియనంత వరకూ లేదంటాము. రెడియో, టీవీ, ఫోనులా వీటిని ఎవరో చూపెడితే అప్పుడు అవునంటాముగా.
వాదులాడే సందేహాప్రాణులతో కాలయాపన కన్నా ప్రక్కవారికి నిస్వార్థంగా ఎమి చెయ్యచ్చో చెప్పే విద్యైనా గొప్పవే కదా!! 

హీలింగు పై పెరిగిన గౌరవం నన్ను జలంధర గారితో కలిపింది(Thanks to Suresh). హైద్రాబాదు రావలసివున్నా వారి డేట్స్ లో మార్పుతో కలవ లేకపోయాను. మా అరుణాచల యాత్రకు చెన్నైలోనే క్యాబు తీసుకు వెళ్ళేది

వారికి విషయం చెబితే కలసి వెళ్ళమన్నారు. విధంగా సినీయర్ హీలర్ గా వారి సలహాలను పొందే అవకాశము కలిగింది. మా ఫైట్ డిలే వల్ల నేను వారితో గడిపినది చాలా కొంత సమయము మాత్రమే.

 వారి చూపిన ఆదరణ ఆప్యాయత అపురూపమైనదివారి చూట్టూ వున్నఅరాచాలా విశాలమైనది.

ప్రతి వారు తమతో పాటు ప్రక్కవారి మేలు కోరాలి

ప్రతి వుదయము మనము కుదిరినంతగా మనమున్న భూమిని, కష్టాలలో వున్న తోటివారికి కొంత పాజిటివు ఎనర్జి ఇవ్వాలి
మనకు ఎవ్వరూ వ్యక్తిగతంగా తెలియనవసరములేదు. మనము పంపే పాజిటివ్ గులాబీ తరంగాల ఎక్కడో గాయపడ్డ హృదయానికి స్వాంతన చేస్తాయి. పని చెయ్యటానికి మనం రోజులో ఒక 15 నిముషాలు కూడా పట్టదు. మనము వెళ్ళే చోటకు మన పని చెసే ఆఫీసునో మరోటి దానికి మనం దీవించాలి. కొంత పాజిటివ్ ఎనర్జీ పంపాలి.  ఇలా ప్రతి రోజు చెస్తే అనుకోని అద్భుత ఫలితాలను చూడొచ్చు.

మనము చెసే ఎలాంటి సాదనైనా (జపము, ధ్యానమో మరోటో) క్రియా తో అనుసంధానపరచాలి. క్రియను ప్రతి దినము సాదన చెయ్యాలి. మన వద్ద పని చెసే శక్తి వుంది. విశ్వంలో  అనంతమైన శక్తి వుంది. కలపటానికి వైరు పెట్టి స్విచ్చు వెయ్యాలిగా. అదే క్రియా సాదన. (అమ్మవారి నామపారయణములోనైనా,జపం లోనైనా, క్రియా సాదన ఒక క్రమ పద్దతి లో ఫలితాలందిస్తుంది.)
కర్మలు వివిద రకాలంటాయి కదా!! పూర్వ కర్మలు మనతో పాటూ వస్తూ వుండే ప్రారబ్ధకర్మలు. వాటిని మనము అనుభవించవలసినదే. కొత్త కర్మలు చెయ్యక నిష్కామ కర్మల యందు జ్ఞానముతో వున్నా ప్రారబ్ధ కర్మలు వెనకకు లాగుతాయి. వీటిని తగ్గించుకోవటానికి క్రియా యోగం సహాయకారి.
సదా సత్కర్మలను ఆచరిస్తూ, వాటి ఫలితము పరమాత్మ కృప అని, కాబట్టి వాటి ఫలితం కూడా పరమాత్మకే చెందుతుందన్న ఎరుక కలిగి వుండే స్థితి కలుగుతుంది.
వీటికి వల్ల మన తోటి వారికి చేతనైన సహాయం చెయ్యగలం. అది వస్తు రూపేణ కావచ్చు, మాట రూపేణ, సేవ రూపేణ లేదా హీలింగులో బ్లెస్సింగులు ఇచ్చి కానీ. ఏది ఏమైనా మనం కోరేది సర్వేజనసుఖినో భవంతుఅయి వుండాలి.
ఇంత సాదన చేస్తున్న కొన్ని సార్లు విసిగించే సందర్భాలు వస్తాయి. మనము సదా మన హృదయం లో పింకు ఎనర్జీ ని ఫీల్/ అనుభవములో తెచ్చుకుంటే మనము సదా జాగృతిలో వుంటాము. దీనికి మూడు స్థాయీ భేదాలుంటాయి.
అవి :Instinct, Intellect, Intuition
ఇవి సాధకుని వివిధ స్థాయిలలో వివిధ రకాలుగా పనిచేస్తుంది. “
(లలితా నామాలలో వివరణ వుండింది)

ఇలా మౌనము బలవంతముగా కాకుండ మనసులో నుంచి సహజం గా మౌనము పుడుతుంది. మౌనము మనకుసాధకునికి ముందుకు నడవటానికి మరింత సహాయపడుతుంది”…ఇలా ప్రవాహం లా జ్ఞానమునాకు లభించింది.

జ్ఞనప్రదాయినిగా జలంధర గారు నాకిచ్చిన సలహసదా ప్రక్కవారికు మంచిని/Help పంచుకుంటూ సాధనలోముందుకుసాగమని.

వారు ఎంత జ్ఞానము పంచుకున్నా, మనము గ్రహించగలిగేది కొంతే వుంటుంది. దానికి తోడు శ్రీవారి తొందర  పెట్టడం.
బయలుచేరకతప్పదని మా కిద్దరికి అర్దమైయ్యింది. వారు వాట్స్అప్ లో సలహాలను ఇస్తానని ప్రామిస్ చేశారు.
హనీ ని మనస్పూర్తుగా దీవించారు. 
లోపలికి తీసుకుపోయి చంద్రమోహను గార్కి పరిచయం చేశారు.(మా శ్రీవారికి చంద్రమోహను, జలంధర గారు జంట అని అప్పటి వరకూ తెలియదు)

 
నాకు కానుకగా వారి మైత్రి రెండవభాగం ఇచ్చారు. ( నా వద్ద మొదటిభాగం వుందని నేను చెప్పకపోయినా తెలిసింది వారికి).
గేటుదాక వచ్చి సాగనంపారు
మహోన్నత్తమైన హీలరు, ప్రేమమూర్తి అయిన జలంధర గారికి వీల్కులు పలికి మేము రమణుని ఆశ్శీసులకై తిరువన్నామలై సాగిపోయాము!!
 
(మనకు హైద్రాబాదులో మంచి హీలింగు ఫెసిలిటీ వుంది. సహయము కావాలనుకునేవారు అమీరుపేటయోగా హీలింగు కేంద్రంగూగుల్ చెయ్యవచ్చు)

Leave a comment