రామాయణం సుందరకాండ

సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథా| సుందరే సుందరీ సీతా, సుందరే సుందరం వనమ్ ||సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపిః |సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరమ్||సుందరకాండ గురించి చెప్పిన మాట ఇది. ఏమిటీ సుందరం? అని సందేహ పడే జీవులకు“నష్టద్రవ్యస్య లాభోహి సుందరః పరికీర్తితః” పోయిన వస్తువు దొరికితే కలిగే ఆనందం సుందరం.  పోయినది సీతమ్మే కాదు, సీతకు రాముడి జాడ కూడా తెలిసిందీ కాండలోఅందుకే సుందర కాండ పారాయణంతో దుఃఖం…

శేఫాలికలు

మంచి పుస్తకాలు పాఠకుల మనస్సులను కస్తూరి సువాసనలా మత్తెకిస్తాయి.  చదివిన తరువాత ఎన్నో సంవత్సరాలు తోడుంటాయి.గమ్యం సూచిస్తాయి. జ్ఞానదీపికలవుతాయి. అటు వంటి పుస్తకాలను గురించి చెప్పాలంటే ఎక్కువగా పుస్తకాలు చదివేవారికి ఎన్నో ఉంటాయి.  అలాంటి పుస్తకాలను పరిచయం చేశారు రచయిత్రి వీరలక్ష్మీదేవిగారి తన శేఫాలికలో. శేఫాలిక అంటే పారిజాతాలట. పారిజాతం దేవపుష్పం. చెట్టు మీదుంటే మనం కొయ్యలేము. పూర్తిగా విచ్చుకొనిదానంతట అదే, రాత్రి మంచు పరచుకున్న వసుధను కౌగిలించుకుంటుంది. మన ఉదయాలను సుగంధభరితం చేస్తుంది. సున్నితమైన పారిజాత కదంబం వీరి శేఫాలికలు. అసలు…

భగవాను అడుగుజాడలలో

మంచి పుస్తకాలు చాలా అరుదుగా దొరుకుతాయి. అవి దొరికినప్పుడు, వాటిని చదివాక  గొప్ప సంతోషం కలుగుతుంది. అది మనకు భగవద్గీతలా దారి చూపేదైతే, ఆ రసానందం గురించి ఇక చెప్పనక్కర్లేదు కదా!!అలాంటి గ్రంధం గురించే ఈ వ్యాసం. ఈ పుస్తకం ప్రతి సాధకుడూ చదవవలసినది. ప్రతి ఉపాసకుడూ చదవవలసినది. ప్రతి అద్వైతి కూడా తప్పక చదవవలసినది. ప్రతి మానవుడూ కూడా తప్పక చదవవలసినది.  ఆ గ్రంధం  “Living by the words of Bhagawan” అన్న ఆంగ్ల గ్రంధానికి తెలుగు అనువాదం…

నే చదినిన పుస్తకం

ఈ మధ్య కాలములో నే చదివిన పుస్తకాలలో చాలా మటుకు సాధనకు పనికివచ్చేవే అని చెప్పలేను. కొన్ని మాములు పుస్తకాలు… కొన్ని కథలు…కాని ఈ పుస్తకం అలా ఏ కోవకూ చెందనిదిగా చెప్పాలి. ఎందుకంటే ఇది రమణభక్తురాలి కథ అయినా, ఆమె భగవానుతో తన అనుబంధం గురించి కానీ, సాధన గురించి గానీ ఈ పుస్తకంలో వివరించినది పెద్దగా ఏమీ లేదు. కాని రమణాశ్రమం, ఆనాటి స్థితిగతులు, ఆశ్రమం ఎలా వృద్ధి చెందింది, ఏ ఏ ప్రముఖులు…

గురుమండలం

గురువు – గురుమండలము గురు మండలము సూక్ష్మలోకంలో ఉంటుంది. మనకు కనపడుతున్న భౌతిక ప్రపంచము మాత్రమే ప్రపంచమని తలవటమే అజ్ణానము. మనకు కనపడేది కేవలం1/7 భాగము. మనకు కనపడని విశ్వం అనంతం. ఇంతటి విశ్వంలో పెనుచీకటికి ఆవల ఉన్న ఈశ్వరుడ్ని ఎలా పొందగలము?దానికే మనకు గురువును సహాయం కావాలి. అంతేనా అంటే కాదు గురువు ఈశ్వరుడై జీవుని/సాధకుని వేదన తగ్గిస్తాడు.  ఈశ్వర ప్రభతో  వెలిగే గురుదేవులు జీవుడి వేదన తగ్గించి అంతర్మఖమై స్వాత్మను తెలుసుకోవటానికి సహయపడతాడు. అందుకే గురువు అవసరం ప్రతి ఒక్కరికీ ఉంటుంది….