సొగసైన బిళహరి 

సొగసైన బిళహరి 

మొన్నటి వారము నా నేస్తం వచ్చింది నన్ను కలవటానికి. చక్కటి గాయని అయిన తను నన్ను, నా సంగీత సాధన గురించి అడిగినప్పుడు, అదిగో అప్పుడు అందుకున్నాను నా విపంచిని. 
సరే కానీయి, అంటూ ఆలపించింది బిళహరి లో. నాకు సాధన లేక కుంటూ పడుతూ, గాత్రంలో మాత్రం సాగించాను తన కూడా. మరి బిళహరి కున్న  బలమే అది. మంచి కోమలమైన రసభరితమైన రాగం. ఉదయమైనా, సాయంకాలంలోనైనా హాయిని పంచే సరస కోమల రాగం. 

కొద్దిగా సంగీతం తెలిసిన వారైనా, తెలియకపోయినా  “రా రా వేణుగోపా బాలా..” అన్న స్వరజతి వినని వారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. 

వినసొంపైన, రాజసమైన, ఠీవైన,బహు ముఖములైన, బిళహరికి 29 మేళ కర్త రాగమైన  శంకరాభరణం జన్యరాగం.  
సొంపైన, వినటానికి హాయిగొలిపే బిళహరి రాగం వినపడని సంగీత తరగతులు ఉండవంటే అతిశయోక్తి లేదు కదా! 

మోహనకు దగ్గరి చుట్టంలా అనిపిస్తుంది. 
రాగలహరిలలో బిళహరితో మోహనను అందుకే సంగీతకారులు విరివిరిగా వాడుతూ ఉంటారు. 
రాగంలో  ప్రఖ్యాతమైన కీర్తనలే కాదు,  చాలా పాపులర్ సినిమా పాటలు కూడా అనేకం ఉన్నాయి. 

మధ్యనే వచ్చిన బాహుబలి లోనిమురిపాల ముకుంద ..సరదాల సునంద ……. .కన్నా నిదురించరాఅన్నది బిళహరే!. 

బిళహరి 
ఆరోహణ  – రి  
అవరోహణ ని మా రి  

బిళహరి ఔడవ ఆరోహణ (మధ్యమ , నిషాదాలు ఉండవు), సంపూర్ణ అవరోహణ లతో అలరారుతూ భక్తిని, శృంగారాన్ని సమానంగా పలికించు రాగముగా పేరుపొందింది. 

బిళహరి లో కొన్ని ప్రఖ్యాత కీర్తనలు: 

త్యాగరాజ స్వామివారిదొరకునా ఇటువంటి సేవ” ,  “పరిదానమిచ్చితే పాలింతువేమోఅన్న కీర్తనలు   రాగంలోనివే.
శ్రీ చామండేశ్వరి’… అన్న మైసూర్ వాసుదేవ చార్య వారి కీర్తన నవరాత్రులలో వినే ఉంటారు. అది కూడా రాగంలోనిదే.

పూరయ మమకారం’  అన్న నారాయణ తీర్థ తరంగం రాగం లోనిదే. 

కొన్ని ప్రఖ్యాత చిత్ర గీతాలు / సినిమా పాటలు ..

చెంగు చెంగున గెంతులు వెయ్యండిఅన్న  సినిమాలో పాట కూడా బిళహరి, మోహన కలసి పాడిన రాగ మాలిక! 

మిరజాలకలడా నా యానతిఅన్న శ్రీ కృష్ణ తులాభారం లోని పాత పాట రాగంలోనిదే.

వేదంలా ప్రవహించే గోదావరిఅన్న పాత కూడా బిళహరి రాగామే. 
వినిపించని రాగాలేఅన్న పాటచదువుకున్న అమ్మాయిలు’   సినిమాలోనిది కూడా బిళహరే!

ఎవరు నేర్పేరమ్మ కొమ్మకు ” ‘భార్య భర్తలుచిత్రం లోనిది,
ఏదో ఏదో అన్నది మసక వెలుతురుముత్యాల ముగ్గు చిత్రం లోనిది,’నీతోనే  ఆగేనా సంగీతంఅన్న రుద్రవీణ లోనిది, 
బాహుబలి లోనిమురిపాల ముకుంద ..సరదాల సనంద ……. .కన్నా నిదురించరా”  ఇవ్వనీ బిళహరి రాగములో పలికించినవే. 

కొన్ని ప్రఖ్యాత ప్రైవేట్ పాటలు కూడా రాగం లో ఉండి అలరిస్తున్నాయి: 

నండూరి వారి ఎంకి పాటలలోగుండె గొంతులోకి  కొట్టాడుతున్నది, కుంసుండ నేదురా కాసింతసేపు 

దేవి నీ మ్రోల ఒదిగి ఉన్నామమ్మాఏదైనా వరమడుగఁ ఎంతవారము తల్లిఅన్ని పాలగుమ్మి విశ్వనాథం గారు  పాడినది వినే ఉంటారు. అది కూడా బిళహరే ! 

కలడందుడు దీనుల యెడ, కలదు కలడందురు పరమ యోగిఅన్న భక్త ప్రహ్లద చిత్రంలోని పద్యం కూడా బిళహరి. 

భక్తిని, శృంగారాన్ని సమపాళ్లలో పలికించే బిళహరి కాలానికైనా, ఎవ్వరైనా హాయిగా పాడుకో తగిన రాగం.

Leave a comment