#అమ్మఆలోచనలు


అప్పటికీ భగవాన్‌ రమణుల గురించి ప్రచారము లేదు. అందుకే ఆయన ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. కాని అరుణగిరిపై ఉన్న సాధువు మహిమాన్వితుడని నెమ్మదిగా వ్యాపించటము మొదలవుతోంది.

అలాంటి కాలములో భగవాన్‌రమణులను దర్శించటానికి ఒక డాంబికపు వ్యక్తులు కొండ పైకి వచ్చారు.
అప్పటికి కొద్ది కాలం ముందే భగవాను విరూపాక్షగుహ కొచ్చారు.
ఆ రోజు అక్కడ భక్తులెవ్వరూ లేరు. భగవాను విరూపాక్షగుహ శుభ్రం చేస్తున్నారు. ఆయన బురదతో గోడలను అలుకుతున్నారు.
ఆ సమయంలో అక్కడికొచ్చిన డాంబిక వ్యక్తులు, భగవానును చూచి, పనివాడనుకొని వారితో దురుసుగా “ఇక్కడ కొండ పైన శక్తి ఉన్న సాదువు ఎక్కడున్నాడు?“ అని అడిగారు.
భగవాను సమాధానమువ్వలేదు
“గుహలెక్కడ” అని మళ్ళీ అడిగారు.
కొండపైకి దారి చూపారు భగవాను.
వారు వెళ్ళిపోయారు.
అలికే పని ముగించి భగవాన్ నీటితో శుభ్రపరుచుకొని వచ్చి కూర్చున్నారు.
కొందరు భక్తులు వచ్చారు.
అందరూ ధ్యానములో ఉన్నారు.
ఇంతలో రొప్పుతూ మళ్ళీ డాంబీకులు వచ్చి “ఇక్కడ ఏ సాధువూ లేడు…” అని కోపంగా వెళ్ళిపోయారు.
వచ్చిన భక్తుడు “భగవాను! వారు మీ కోసమే వచ్చారు. చెప్పవచ్చుగా మీరే అని? మీరు కావాలని వారిని ఏడిపించారు…” అన్నాడు.
భగవాను అతనితో “లేదు. నేను ఏడిపించలేదు. వారు నాకోసం అడగలేదు. శక్తి ఉన్న సాదువు కావాలన్నారు. నాకు తెలియదు. కాబట్టి నేను ఏమీ చెప్పలేకపోయాను. గుహకు దారి అడిగితే చూపాను.”
“ఆ సాధువు మీరేనన్ని ఎందుకు చెప్పలేదు?”
“నేను శక్తి ఉన్న సాధువునని నాకు తెలియదు. నేనే కావాలనుకున్న వారు నా వేషధారణా, పని పట్టించుకోరుకూడా…” అన్నాడు.

అవును. సద్గురువు వేషధారణా, రూప కన్నా వారి దయ, వారు చూపే కరుణే మనకు ముఖ్యమని గురుచరిత్ర బోధిస్తుంది.
డాంబికముగా ఉండి అతిశయము చూపే వారికి పరమాత్మ దర్శనం కాదు. ఆ పరమాత్మ ఎదురుగా నిలిచినా కూడా. అందుకే ముందు అహన్నీ వాకిలి బయట వదిలి రమ్మని చెబుతారు.
“నాది- నేను” అన్నది కాలిపట్టామీద పడెయ్యాలి. అందరి పాదముద్రల వలన ఆ అహం నశిస్తుంది.
‘జగదంబా, మాకున్న అహం వదిలిపోయేలా మమ్ము అనుగ్రహించు. మేము అజ్ఞానులమైనా నీ ఎడల మా భక్తిని మరల్చకుము’ అని మనము అమ్మను కోరుకుందాం
జయహో మాతా!





Sent from my iPhone

Leave a comment