నేను ఎదైనా ఒక విషయం నమ్మితే మరి వెనక్కు చూడను. అలాగే చాలా లయల్ కస్టుమరు నుకూడా. ( నమ్మకమైన వినియోగదారు). ఎదైనా మొదలెడితే తుఫానులు వచ్చినా, భూగోళం బద్దలైనా వదలను. అలాగని అగౌరవాన్నీ తీసుకుంటామా? తీసుకోవాలా? భారతదేశంలో వినియోగదారులు ఇది చాలా ఆలోచించవలసిన విషయము. నేను ఒక 20 సంవత్సరాల క్రితం “ఆంద్రాబ్యాంకు” లో నా ఖాతాను తెరిచాను. ఆ బ్రాంచు తార్నాకాలో ఇంటి ప్రక్కనే. అది తెరచినప్పుడు NRI ని కాదు. కానీ కొంత…
Author: ఉహలు- ఊసులు - సంధ్య
పోపులపెట్టె
పోపులడబ్బా అమ్మ పోపులడబ్బా పురాతనమైనది… ఇత్తడి ఆ పోపులడబ్బా సర్వరంగులను నింపుకొని కుటుంబానికి ఆరోగ్యాన్ని ఆనందాన్నీ అందించేది. అమృతమయమైన అమ్మ వంటకు ఆ పోపులడబ్బా ముక్తాయింపు ఇవ్వవలసినదే. ధనియాల సుగంధముతో ఇంగువ గుభాళింపుతో వంటగది తోపాటు ఇల్లంతా ఒక రకమైన దేశీయ జ్ఞాపకాలతో నిండి వుండటానికి పోపులడబ్బా యే కారణం. , ఎరుపు, ముదురు , నలుపు, తెలుపుల రంగులతో కలసిన మిశ్రమం జీవితంలోని సర్వ సమస్యలకు సమాధానము ఆ పోపులడబ్బా. అక్కయ్య బుగ్గమీద మొటిమకు, సుమంగళిల…
మా అట్లాంటా పండుగ
ఈ మధ్యకాలములో ఇండియాలో పండుగలు ఎలా జరుపుకుంటున్నారో నాకు తెలియదు కానీ, మా చిన్నప్పుడు ఏ పండుగ వచ్చినా సరే అదో పెద్ద హడావిడి గడబిడా. ఉదయం మామిడి ఆకుల గలగల తో పాటు మా నాన్నగారి అరుపులతో సుప్రభాతాలుగా మొదలయ్యేది. గడపలకు పసుపులు కుంకుమలు రంగులద్దటం, మేము కుయ్యో మొర్రో మని లబలబ లాడుతున్నా వినకుండా కుంకుడు కాయలతో రుసరుసా తలస్నానాలు.. బలే బలే మని మురిపించే కొత్తబట్టలు …అన్నింటి కన్నా మజామజా అయిన మరో…
వరము
హృదయ దహరాకాశాన వెలిసిన అరుణా అతి కరుణామూర్తి… జగమునందు వెలసిన మాయను బద్దలుకొట్టి సత్య స్వరూపమును తెలుసుకొనుటకు ఇచ్ఛను కలిగించిన ఇచ్ఛాశక్తివి నీవు. నడుస్తున్న దంతా నీ మాయయని, విషయము తేలుసుకొను జిజ్ఞాసతో సద్గురువుల సన్నిద్దినిచ్చిన జ్ఞానశక్తివి నీవుకదటమ్మా! తపనగా అంతఃకరణములో నిలచి, నా అంతరింద్రియములను నడిపించే క్రియాశక్తివి మాతా…. అతి నిద్ర, అలసత్వం లేని క్రమమైన సాదన కూడా నీవ్యై నిలచి నడుపుమా!! మూలాధారము స్వప్నావస్థలో నిలచిన కుండలిని … ఈ సాదనతో క్రమముగా జాగ్రుతమై…
Addictive social media
మరో కొత్త సంవత్సరము రాబోతున్నది!! ఈ సంవత్సరము ఎమీ సాదించామో సింహవలోకనం చేసుకొవటానికి ఇదే మంచి తరుణము. మనము ప్రతి రోజు ఒక కొత్త విషయం తెలుసకుంటూనే వుంటాము. ఆ విషయం ఎంతగా మనకు పనికి వస్తుంది.. మన గమ్యం ఏమిటి? దానిని సాదించటములో మనము ఎంత వరకూ వచ్చాము లాంటి విషయాలు మనము ఆలోచించుకునేది ఇలాంటి సందర్భాలలోనే కదా!! మనలను మనము శోదించుకొని, మనను మనము మార్పుకొనుటకు ఇది మంచి అవకాశము కూడా. ఇలాంటి సందర్బాలలో…
శ్రీ రాగము – ఒక పరిశీలన
శ్లో।। ఓం కారంచ పరబ్రహ్మ యావదోంకార సంభవః । అకారోకారమాకార ఏతే సంగీత సంభవాః ।। ఓంకారము పరబ్రహ్మ స్వరూపము. ఆ ఓంకారము నుంచే యావత్తు జగము పుట్టెను. అందులో అకార, ఉకార, మకారముల వలన సంగీతము సంభవించినదని అర్థం. సంగీతము భాషా భేదాలు లేకండా సమస్త ప్రాణులను అలరించే గుణం కలిగి వుంది. అలాంటి మధురమైన సంగీతము లో శాస్త్రీయ సంగీతము తల్లి వేరు వంటిది. శాస్త్రీయ సంగీతమే మూలముగా వివిధ సంగీత రూపాలకు ప్రాణముగా…
కోమలి గాధారం నా సమీక్ష
నేను హైద్రాబాదు వెళ్ళిన వెంటనే క్రమం తప్పక ప్రతీసారి చేసే పని ఒకటి వుంది. అదే పుస్తకాల దుకాణంకు వెళ్ళటం. నచ్చిన, అత్యంత అధికంగా అమ్మకం అవుతున్న పుస్తకాలను కొని తెచ్చుకోవటం అలవాటు. చదవనివి, చదివిన వాటిలలో నచ్చినవి, పచ్చళ్ళ పార్సిలుతో కలిపి అట్లాంటా పంపించటం. చదివిన కథల పుస్తకాలు నేను హైద్రాబాదులో వదిలేసి వస్తూ వుంటాను, రివాజుగా. ఈ సారి చదివేసినా మన వ్యక్తిగత లైబ్రరీలో వుంచుకోతగ్గ ఉత్తమమైనదిగా తలచి తెచ్చుకున్నాను ఒక పుస్తకాన్ని. అది…
హఃంసోహం
హఃంస ఎగిరింది గగనానికి హృదయాంరాళ నుంచి! పల్లంలో పంట కాలువవెంట పరుగిడుతూ తిరిగింది। పంట భూములలో వరిచేలను మృదువుగా నిమిరింది! పల్లె ప్రజల లోగిళ్ళ సంక్రాంతి మగ్గులను గునగునగా చూసింది గుంభనగ నవ్వింది.। ఆసాముసలైనా ఏ సాములైనా హఃంస ముందంతా మొకరిల్లవలసినదే!! అడవులలో అలరారి అందాలు చూసింది.. గడ్డి పువ్వులకు నీలి రంగులద్దింది। జడివానలో వంపు వాగులలో హాయిగా తడిసింది.. పట్నల గజిబిజిల హడావిడులకు కొంత తత్తరపడ్డా … యోగా సెంటరులలో కొంత నిలచింది హఃంస ఎగిరింది…
అంతర్వేదన
కవిత్వం ఒక భావావేశం,ఒక భావ ప్రకటన… కొందరు సౌందర్యాన్ని ఆరాధించి కవిత్వం చెబితే, కొందరు సంఘం మీద తమ బాధ్యతను కవిత్వంలో పలికించారు. ఏది ఏమైనా కవిత్వం కవి యొక్క జీవిత గాధ.. బాధ… హృదయాన్నీ రంజింపచేసినా… మనసును ఉరకలు పెట్టించినా , జనులను ఉద్యమింపచేసినా అది ఒక్క కవిత్వానికే సాధ్యం…. కవిత్వానికున్న బలం అది… అది అడవులలో గీతమైనా… రాజాస్థానాలలో వెలిగినదైనా… కవిత్వం బలమైనది. అలాంటి కవే నిరంకుశుడు కూడా. అలాంటి కవిత్వంలో కవి బాధ్యతతో…
NRI confusion
#NRIConfusion NRI లు భారతదేశం వదలి వచ్చాక నూటికి తొంబై మంది వెనక్కు వెళ్లిపోవాలనే ఉదేశ్యం తో ఉంటారు. వారు మనసు సదా డోలాయమానంగా ఉంటుంది. మేము అందులో మినహాయింపు కాదు. అందునా ఇండియా వెళ్లి బంధు మిత్రుల మధ్య కాలం గడిపి వెనకకు మరలి వచ్చేటప్పుడు మరింతగా ఆ భావం ఎక్కువగా ఉంటుంది. మరింత అటు ఇటు కంగారు పెట్టటానికి, సంకటమంలో పడేయ్య ఇక్కడ పరిసరాలు, పనులు దోహదపెడుతాయి. నిన్న విమానం దిగి బయటకు రాగానే……..