#NRIConfusion
NRI లు భారతదేశం వదలి వచ్చాక నూటికి తొంబై మంది వెనక్కు వెళ్లిపోవాలనే ఉదేశ్యం తో ఉంటారు. వారు మనసు సదా డోలాయమానంగా ఉంటుంది.
మేము అందులో మినహాయింపు కాదు. అందునా ఇండియా వెళ్లి బంధు మిత్రుల మధ్య కాలం గడిపి వెనకకు మరలి వచ్చేటప్పుడు మరింతగా ఆ భావం ఎక్కువగా ఉంటుంది.
మరింత అటు ఇటు కంగారు పెట్టటానికి, సంకటమంలో పడేయ్య ఇక్కడ పరిసరాలు, పనులు దోహదపెడుతాయి.
నిన్న విమానం దిగి బయటకు రాగానే….. గ్లాస్ డోర్ తెరుచుకోవటం, టాక్సీ ఎదురుగ ఉంది…. చల్లని గాలి మొఖానికి తగిలి స్వాగతం తెలిపింది. టాక్సీ ఒక మిడ్ suv. స్మూత్ గా నడిపిస్తూ ఇంటికి వస్తుంటే….. నేను మా శ్రీవారు మొఖాలు చేసుకొన్నాము…. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్న ఈ జీవితాలని గందరగోళం లోకి తీసుకుపోవాలా? అని….
నా డ్రైవర్స్ లైసెన్స్ ఎక్సపైర్ అయ్యింది ఇండియా లో ఉన్నప్పుడే.
రాగానే ఉదయం ఇంటర్నెట్ లో ఫారం డౌన్లోడ్ చేసి, ఇంట్లో ఉన్న ప్రింటర్ మీద ప్రింట్ చేసుకొని ఇంటికి 15 నిముషాల దూరం లో ఉన్న DDS ఆఫీస్ కి వెళ్ళాము.
ఆ భవనం చుట్టూ తిరిగి దారి వెత్తుకోని, లోపలి వెళ్లి, మూడంటే మూడు నిముషాలలో మళ్ళీ బయటకు వచ్చేశాము….. పని కాదని కాదు…..
పని కానిచ్చుకొని….
ఇలాంటప్పుడే ఇంకొంత కన్ఫ్యూషన్….. డోలాయమానంగా మనసు ఊగుతోంది…..
మనలను మనం కష్టపెట్టుకోవటం…. భారతావనికి వెనకకు వెళ్ళాలన్న కోరికను…..అవసరమా?…….
సుఖంగా ఉన్న ప్రాణానికి…. ….