మరో కొత్త సంవత్సరము రాబోతున్నది!!
ఈ సంవత్సరము ఎమీ సాదించామో సింహవలోకనం చేసుకొవటానికి ఇదే మంచి తరుణము.
మనము ప్రతి రోజు ఒక కొత్త విషయం తెలుసకుంటూనే వుంటాము. ఆ విషయం ఎంతగా మనకు పనికి వస్తుంది.. మన గమ్యం ఏమిటి? దానిని సాదించటములో మనము ఎంత వరకూ వచ్చాము లాంటి విషయాలు మనము ఆలోచించుకునేది ఇలాంటి సందర్భాలలోనే కదా!! మనలను మనము శోదించుకొని, మనను మనము మార్పుకొనుటకు ఇది మంచి అవకాశము కూడా.
ఇలాంటి సందర్బాలలో నాకు ముఖ పుస్తకం గురించే ఎక్కువగా ఆలోచన వస్తోంది. ఎందుకంటే, మనము మనకు తెలియకుండానే చాలా మటుకు ఈ సోషల్ మీడియా చుట్టూ అల్లుకుపోయాము. మన భావనలు, కవితలు, కథలు మిత్రులు దీనీచుట్టూరానే తయారయ్యాయి ఈ మధ్యన. మనము దీనికి ఎంతగా బానిసలమయ్యామంటే ఒక లైకు ఒక కామెంటు కోసము మనలను మనము, మన మిత్రులను మనము పూర్తిగా మార్చుకునే వరకూ వచ్చేశాము.
చదవటం, పుస్తకముల సేకరణ, కొత్త విషయాలు తెలుసుకోవటం అన్నీంటికి ఈ పేస్స్ బుక్కే మూలము అయ్యింది. ఇది ఒక మంచి విషయము అయినా అతి సర్వత్రా మంచిది కాదు కదా!
ఎందుకంటే, కొంత మంది ఈ మాధ్యమలో మమైక్యమై తమ దైనందిత జీవితాలలో పెను మార్పులను కొనితెచ్చుకుంటున్నారు. మన తోటి వారిని, మనము రోజూ చూసే వారిని మనము మనకు తెలియకుండానే నిర్లక్ష్యం చేస్తున్నాము, దూరము చేసుకుంటున్నాము.
ఈ వాడకము ఎంత నిష్పత్తిలో చేస్తున్నాము అన్నది ఎవరికి వారు బేజరు వేసుకోవాలి ఇలాంటి సందర్భాలలో.
ఈ మధ్య కాలములో కొందరు మిత్రుల మధ్య అభిప్రాయభేదాలకు కారణం కేవలం లైకులు కామెంటులు ఇవ్వలేదనో, ఎవరో తమ పోస్టులు కాఫీ చేశారనో, ఎత్తేశారనో, మరోటో చేశారనీ…
కొందరు మరి కొంత ముందుకు వెళ్ళి… తమకు ఈ మాయాజాల గూడులో గుర్తింపు రాలేదనో, తగ్గిందనో…. ఎవరో కావాలని తగ్గించారనో… విపరీతమైన ఆలోచనలతో అనవసరపు రాద్దాంతాలతో ద్వేషాలను పెంచుకోవటం కూడా నేను గమనించిన విషయం.
మరి కొందరు తమకు కావలసిన గుర్తింపు రావటం లేదనో లేదా, వచ్చినది సరిపోవటం లేదనో భావించి, attention కోసం తమ వయస్సును మరచిపోయి కొత్త కొత్త వేషాలు వెయ్యటం.
మరి కొందరుంటారు. వారు ఎప్పుడూ మేము జెండా ఎత్తేస్తున్నామోచ్చ్ అంటూ ప్రకటిస్తూ వుంటారు. వీళ్ళ ‘ఆ నలుగురు’
మిత్రులు ‘వద్దు…. వద్దూ’ అంటూ స్లోగన్లులు. రెండు రోజుల తరువాత అంతా తూచ్చ్ అనటం. లేదా మళ్ళీ రెండు రోజులకో వారానికి ప్రత్యక్షం.
Fb,లో ఈ వెఱ్ఱి కూడా ఈ మధ్య చాలా చూస్తున్నాము. వెళ్ళటం ఎందుకు? మళ్ళీ రెండు రోజులకే రావటం ఎందుకు? అనవసర హంగామా కాకుంటే.
మరి కొందరు ఏమీ చేసినా ఇక్కడ ఫోస్టడం… నష్టం గుర్తించక పోవటం. ప్రతిదీ పోస్టు చేసే ఒక ‘అతి స్నేహ వనిత’ సంగతి చూడండి ఎంత కష్టం తెచ్చుకుందో….ఇది నిజంగా జరిగిన సంఘటన… johns creek లో ఇలానే ఇద్దరు యువతులు, మేము నడకకు బయలుచేరామని ప్రకటించి రెండు మైలు నడచి ఇంటికి చేరాక చూస్తే ఏముంది… కొంప కొల్లేరయ్యింది…
సొమ్ము దొంగలపాలు….
ఇక్కడ దొంగలు కొందరు మన మిత్రులలోనే వుంటూ మన మీద కన్నేసి వుంటారు అవకాశం కోసం… దొరికితే దోచ్చేస్తారు. అందునా మన భారతీయ కుటుంబాల మీద ఇక్కడ సదా ఎఱ్రగా చూస్తూ వుంటారు…
మరి కొందరు..నలుగురు కలసినా వెంటనే ఫోటోలు తీసి ఇంస్ట్రాగ్రమ్ లో, వాట్స్అప్లలో, ఫేసుబుకులో ఫోస్టు చెయ్యటం…చేసి రియాక్షన్ కోసం గిజగిజలాడటం. మిగిలిన వారు వీరిని చూసి అసుయగా ఫీల్ అవటం. వారు కలసి మంచి విషయం తెలుసుకుంటే, అది నలుగురికి పంచితే సంతోషమే….కానీ, నలుగురు కలసీ గాసిప్ లు పంచుకోవటం….కలవని ఐదవ వారు కుళ్ళిపోవటం కూడా చాలా సామాన్యమైయ్యింది. ఇది మన జీవితాలలో కనపడని విషం చిందిస్తున్నది.
ఈ fb, Instagram,ట్విట్టరు అన్నది ఓక మత్తు మందు. మాధక దవ్యాలు వాడినప్పుడు మెదడులో ఒక ప్రత్యేకమైన enzymes విడుదలైయి, వాడిన వారిని కాసేపు ప్రపంచపు ఎత్తులలో వున్నట్లు భ్రమ కలిగిస్తుంది. ఈ అంతర్జాలాలోని సోషల్మిడియాలలోని ఈ లైకులు, కామెంట్లు కూడా అలాంటి మత్తు కలిగించే ఎమ్ జేన్స్ విడుదలైనట్టుగా చేసి వాడుతున్న వారి మెదడులతో ఆడుకుంటున్నాయని సోషల్ శాస్త్రజ్ఞులు ఉవాచిస్తున్నారు.
అంటే ఈ అతి వాడకము, ఈ ఫేకు గుర్తింపు కోసం ప్రాకులాట అన్నది కూడా వ్యామోహము. ఇది ఒక డ్రగ్సు లాంటిదే.
అంతర్జాలము ఓక మాయాజాలం!!అసలు కనపడని మయాలోకము. సోషల్ మీడియా రెండు వైపులా పదునుగా వున్న కత్తి వంటిది. కత్తితో కూరలు తరగవచ్చు …కుత్తుకలూ తెగనరకవచ్చు. వాడే మనిషి విజ్ఞతల బట్టి వుంటుంది.
మనిషి పూర్తిగా వీటిలో పడి తమ చుట్టూ వుండే వారిని, తమ ప్రత్యక్ష మిత్రులను కుటుంబాన్నీ కొల్పోతున్నారు అని సోషల్ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
ఈ వాడకము రుగ్మతలకు మన సాంఘిక శాస్త్రజ్ఞలు ఇచ్చే సలహా ఏమిటంటే :
1.నోటిఫికేషన్స్ ఆపేయ్యటం. ఫోను మీద నోటిఫికేషన్ లేక పోతే మనం వెంటనే చూడము.
2. సమయ పాలన పాటించటము. కొంత సమయం మాత్రమే ఈ fb లాంటి వాటిలలో వుండి మిగిలిన సమయం మన ప్రత్యక్ష మిత్రులతో… కుటుంబాలతో , పుస్తకాలతోనో సమయం గడపటం.
3. నిద్ర లేచిన వెంఠనే, బోజన సమయాలలో కేవలం ఆ సమయానికి కావలసివాటి పై శ్రద్ద పెట్టటం. కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి మిగిలినవి ఆ కాసేపు వదిలి వేయ్యటం..
4. ప్రతిదీ సోషల్ మిడియాలో పంచుకునే ప్రయత్నం చెయ్యకపోవటం. జీవితములో కొంత ప్రైవసీ అన్నది పాటించటం.
5. ప్రతిదీ ప్రతి వారు గుర్తించాలనే తాపత్రయం తగ్గించుకోవటం.
ఇలాంటి కొన్ని పాటించి జీవితాలను దారిలో పెట్టుకోని అంతా సుఖంగా వుండవచ్చు.
నేను కూడా ఈ విషయంలో సదా నన్ను నేను చేక్ చేసుకుంటూ నిలవరించే ప్రయత్నంలో చేస్తూ వుంటాను.
అంతర్జాలపు మత్తు లేని ప్రత్యక్ష సంబంధాలతోనూ, నిజమైన మిత్రలతోనూ, నలుగురికీ పనికి వచ్చే సేవలోనూ వుండాలని కూడా కోరుకుంటూ వుంటాను.
కొత్త సంవత్సరములోకి మరో నాలుగు రోజులలోకి అడుగెడుతున్న ఈ తరుణంలో…నా రెజల్యుషను కూడా అంతర్జాలపై పట్టుతో నన్ను నేను నియంత్రించుకుంటూ ముందుకు సాగటం.