ప్రయాణాలు చెయ్యాలంటే ముందుగా చాలా ప్లాన్ చేసుకుంటాము. బడ్జెట్, హోటల్, టికెట్స్, చూడవలసిన ప్రదేశాలు, కలవవలసిన మనుష్యులు ఇత్యాదివి. కొందరు మా అమ్మాయిలాంటి అతిగా ప్లాన్ చేసేవారు ఒక లిస్ట్ చేసుకు ఉంచుకుంటారు. నిముష నిముషానికి ఎక్కడ ఉండాలి, ఏమి చెయ్యాలని. ఆలా చేసి, బడ్జెట్ను తక్కువగా చూపించి, అప్రూవలు చేయించుకొని ఇప్పటి వరకు 20 దేశాలు తిరిగేసింది తను. కొందరుంటారు ‘డైనమిక్’ గా ప్రయాణాలు సాగిస్తారు. వీకెండ్ వచ్చిందంటే ‘చలో’ అనుకోని, రైల్లో బసో చూసుకొని…
Author: ఉహలు- ఊసులు - సంధ్య
జలంధర గారితో
2016లో ఇండియా వచ్చినప్పుడు, హైద్రాబాదు నుంచి ఏమీ తేవాలని అక్కయ్యను అడిగితే’పున్నాగపూలు’ పట్టుకురా! అంది. అలా నేను ఆ పూల పరిమళం అఘ్రాణించాను. ప్రాణిక్ హీలరైన మా అక్క అప్పటి వరకూ ఎంత చెప్పినా తలకెక్కని హీలింగు పై, విపరీతమైన జిజ్ఞాస కలిగింది ఆ పుస్తకం చదివాక…. ఒక మనిషి అసలు ఏ రకంగా సంబంధం లేకుండా నిస్వార్థంగా మరొకరి బాగోగులు చూడటం, ఎనర్జీ పంపటం(తల్లితండ్రులు కాకుండా)…ప్రపంచములో భాదిత వర్గం కోసం తమ ప్రార్థనలలో కలపటం…అసలు సదా…
నీల’ ను సృష్టించిన బ్రహ్మతో సమయం – మధురం!!
నీల’ ను సృష్టించిన బ్రహ్మతో సమయం – మధురం!! “సంఘమందు పుట్టి సంఘమందు పెరిగి సంఘజీవి కాడే సాటి నరుడు… సంఘ వృద్ధి లేక స్వాభివృధి లేదు నవయుగాలకు బాట నార్ల మాట ” అని పూర్వం నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పినారు. మనం మన చూట్టు ఉన్న కమ్యూనిటీకి మన వంతుగా ఎదో ఒక విధంగా సాయం చెయ్యాలి. మామూలు మానవులకు కొంత భాద్యత ఉన్నా, రచయితలకు ఆ బాధ్యత మరి కొంత ఎక్కువగా ఉంటుంది….
బొమ్మదేవరతో కాసేపు:
తెలుగు సాహిత్యాన్ని ఎందరో మహానుభావులు సుసంపన్నం చేస్తూ, అద్భుతమైన సాహిత్యాన్ని పండిస్తున్నారు. సాహిత్యంలో ప్రేమ కథలు హృదయానికి అతుక్కుపోయి, చదువరులను చదువుతున్న రచనతో అనుసంధానం చేసి, తమ కథే అది అన్న భావన కలిగిస్తాయి. అలాంటి ప్రేమ కథలు,హృద్యమైన శైలితో ,చదివే వారిని ఊహాలోకాలు తీసుకు పోయే రచనలు, రచయితలూ మనకు చాలా మంది ఉన్నారు. వారిలో అత్యంత చిన్న వయస్సులో రచనలు మొదలు పెట్టి, తెలుగు హృదయాల్ని హోల్ సేల్ గా దీపావళి ధమాకా లో…
అష్టాక్షరీ క్షేత్రం:
బదిరిలో అద్భుతమైన ఆతిధ్యానికి అష్టాక్షారీ క్షేత్రం: బదిరిలో వుండాలంటే మనము ముందుగా ఎక్కడ వుండాలో చూసుకోవాలికదా!! సాధరణంగా టూరు ప్యాకేజీలలో వెళ్ళేవారికి అందులో భాగంగా నిర్వాహకులే యాత్రికుల బసను ఏర్పాటుచేస్తారు. కానీ విడిగా ఎలాంటి ప్యాకేజీ లేని నా వంటి వారికి, ముందుగా వసతి బుక్ చేసుకోవాలనుకునే వారు ఈ అక్షక్షాషరీ క్షేతం సౌకర్యవంతమైన, అద్బుతమైన వసతి అందిస్తోంది. విశాలమైన, శుభ్రమైన ఆవరణ అలకనంద ప్రక్కనే గలగలలతో ఎంతో ప్రశాంత కలిగిస్తుంది. విడివిడిగా చిన్న పెద్ద గదులు,,గుంపుగా…
మనసులోని మురికి
“మనమంతా బానిసలం గానుగలం పీనుగలం… ముందు దగా వెనక దగా కుడి వెడమలు దగాదగా” అని శ్రీ.శ్రీ మొత్తుకున్నది ఇందుకేనా? అని సందేహం!! వివరాలకు వెడితే ; కొన్ని రోజుల క్రితం ఒక మెసేజ్ చూశాను. కరేబియను లో వున్న ఒక హిందు మాంక్ -దండపాణి చెప్పిన ప్రసంగము. ఆయన కాలుష్యం- పరిశుభ్రం గురించి చెబుతూ, ‘మన ఆలోచనలలో పరిశుభ్రత ఎంత అవసరమే, నెగిటివ్ ఆలోచనలు దరి చేరనివ్వకపోవటం అంత ముఖ్యమైన విషయమే’ అని తెలిపారు. మనం…
నాకు తెలిసిన సాలరుజంగు
మా చిన్నప్పుడు సాలారుజంగు మ్యూజియం వెళ్ళినప్పుడు, వింతగా చూస్తుంటే చెప్పారు ఇవ్వన్నీ ఒక్కళ్ళు సేకరించిన సరుకు అని. అన్ని సేకరించటానికి ఎంత ఇంటరెస్ట్ , సమయము ఉండాలో నా చిన్న బుర్రకు అర్థం కాలేదు. అమెరికాలో ఇలాంటి కలెక్షన్, కలెక్టు చేసే వారు చాలా మంది ఉంటారు. వారికి గ్రూప్లు, విషయాలు పంచుకోవటం, ఊరు ఊరు తిరగం,మాల్స్. ఫిల్టు మార్కెట్లు , ఆక్షన్ కేంద్రాలు, ఓహో అదో మహా లోకం…. మనకు తెలియని ప్రపంచం. ఇంట్రెస్ట్ ఉండాలి…
Special time with GLN Shastry garu
పది సంవత్సరముల క్రితం నేను GLN శాస్త్రిగారి రాసిన ‘సౌందర్యలహరి’ వివరణ మొట్టమొదట చదివాను. నాకది చాలా నచ్చిన వివరణ. వారి శైలి అరటిపండు వలచి నోట్లో పెట్టినట్లుగా వుంటుంది. మనం గుటుక్కుమనటమే తరువాయి. అంతటి సవివరముల వివరణ లలిత కు కూడా వారు రాశారని తెలుసుకొని చాలా సంవత్సరాలు వెతికి దొరకపుచ్చుకొని మొదలెట్టాను. ప్రారంభించటము నేనే చేసినా, క్రమం తప్పక నడుపుతున్నది మాత్రం ఆ జగదంబనే. అది ఎన్నో సందర్భలలో నాకు రుజువవుతున్న సత్యం. నేటికి…
Sound No Horn Please!!
మొన్నీమధ్యన వీధిలో నడచివెడుతున్నా. ఉదయం ఆరు గంటల సమయం… పాలకోసం ప్రొద్దునే వెళ్తున్నప్పుడు. వీధిలో మరో పురుగు లేదు… వెనకనుంచి ఒక మోటారు బైక్ … అంత ప్రశాంత వాతావరణం నీ బద్దలు చేస్తూ, హార్న్ మోగిస్తూ నా ప్రక్కగా వెళ్ళిపోయాడు. నేను వీధి మధ్యలో నడవటం లేదు… ప్రక్కగానే ఉన్నాను. ఒక ప్రక్కన వెడుతున్నా ఆ వీధిలో మరో పురుగు లేకపోయినా సరే, మరో జీవి కనిపిస్తే హార్న్ మోగించాలని మన దేశంలో డ్రైవింగ్ లెసన్స్…
పలుకుల తల్లి
పలుకు పలుకుల తల్లి పలుకు బంగారు తల్లి పలుకుల పరా తల్లి పలుకు ధాతువు వా తల్లి పలుకు మూలమైన తల్లి పలుకుల పగడపు తల్లి పలుకు పశ్యతి అనాహతమున మా తల్లి పలుకుపూబోణి పలుకు జిలుకుల వైఖరి తల్లి పలుకుటెలనాగ మా తల్లి పలుకుగా మారు మా తల్లి పలుకవదేమి ఓ తల్లి!! తలచి పిలచితి తల్లి!! నా ఆత్మనీవే తల్లి!! పలుకులాడించ దీవించె మా తల్లి!! సంధ్యా యల్లాప్రగడ